
మహిళలు ఇంట్లో ఉండి వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నారా..అయితే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయవద్దు. వెంటనే ఓ మంచి ఐడియాతో బిజినెస్ ప్రారంభించండి. నెలకు లక్షల్లో ఆదాయాన్ని సంపాదించే అనేక బిజినెస్ ఐడియాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మీరు ఏది చేయగలరు అంచనా వేసుకొని వ్యాపారం ప్రారంభించండి.
వ్యాపారం చేయాలంటే పెట్టుబడి తప్పనిసరి. పెట్టుబడి కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా. ఇంక ఆలోచించాల్సిన అవసరం లేదు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ముద్రా రుణాలను అందిస్తోంది. దీని కోసం ఎలాంటి తనఖా పెట్టాల్సిన అవసరం లేకుండానే ఈ ముద్రా రుణాలను పొందే వీలుంది. 50 వేల నుంచి పది లక్షల వరకు మీరు రుణాలను పొందే వీలుంది బయట ప్రైవేటు బ్యాంకులతో పోల్చి చూసిన ఇతర వడ్డీ వ్యాపారుల వద్ద మీరు రుణం తీసుకున్న ఇంతకన్నా చాలా ఎక్కువ మొత్తంలో మీరు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
పెట్టుబడి అందుకున్న అనంతరం ఏ వ్యాపారం చేయాలా అని ఆలోచిస్తున్నారా. ఆన్ లైన్ బర్త్ డే కేక్ బిజినెస్ ప్రారంభించడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. సంవత్సరంలో 365 రోజులు ఎవరో ఒకరి బర్త్ డే జరుగుతూనే ఉంటుంది. అందుకే బర్త్ డే కేకులకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇక ఇక వెడ్డింగ్ యానివర్సరీ, మరేదైనా సెలబ్రేషన్ కోసం కూడా చాలామంది కేకులను కట్ చేస్తుంటారు.
సాధారణంగా కేకులను బేకరీలో తయారు చేస్తూ ఉంటారు. అయితే ఈ బిజినెస్ లో మీరు ఇంటి వద్ద కేకులను తయారు చేసి ఆన్లైన్ ద్వారా ఆర్డర్లను స్వీకరించి విక్రయించాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు మొదటగా మీ ఇంటి వద్ద ఓ గదిని కేటాయించి బేకరీ సెట్ అప్ చేసుకోవాల్సి ఉంటుంది. బేకరీకి కావాల్సినటువంటి ఓవెన్, కేక్ తయారీకి కావాల్సిన ఇతర సామాగ్రిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ మీకు కేక్ తయారు చేయడం రాకపోతే స్వంతంగా తయారు చేయాలని కోరిక ఉన్నట్లయితే.. వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ సంస్థలు కేక్ తయారీలో శిక్షణను అందిస్తున్నాయి. ఈ శిక్షణను పొందిన అనంతరం మీరు కేక్ తయారు చేసుకోవచ్చు.
ఇక ఆన్లైన్ ద్వారా ఆర్డర్లను స్వీకరించడానికి, స్విగ్గి, జొమాటో వంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటే సరిపోతుంది. అలాగే ఫోన్ ద్వారా కూడా ఆర్డర్లను తీసుకుంటే సరిపోతుంది. అలాగే మీరు సొంతంగా ఒక వెబ్సైట్ రూపొందించుకొని కూడా ఆర్డర్లను పొందే వీలుంది. . ఇక పబ్లిసిటీ కోసం మీరు డిజిటల్ మార్కెటింగ్ను ఆశ్రయిస్తే మంచిది డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కూడా మీ పబ్లిసిటీని పెద్ద ఎత్తున చేసే వీలుంది. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీకు ప్రతి నెల రూ. 50 వేల నుంచి రూ. 1 లక్ష వరకూ సంపాదించవచ్చు. ఆర్డర్లు పెరిగితే సహాయకుడిని పెట్టుకోవచ్చు. అలాగే మీకు ఆదాయం కూడా పెరిగే చాన్స్ ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..