ICICI Insurance: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ 2021-22 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో రూ.185 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి కంపెనీ లాభం కేవలం రూ.64 కోట్లుగా ఉంది. అంటే ఆదాయాన్ని రెండింతలకు చేరింది. కొత్త వ్యాపారం గణనీయంగా పెరగటం ఇందుకు కలిసివచ్చిందని కంపెనీ వెల్లడించింది. కాగా.. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను లాభం మాత్రం రూ.960 కోట్ల నుంచి రూ.754 కోట్లకు తగ్గినట్లు తెలిపింది. ఈ కాలంలో కొత్త వ్యాపారం విలువ 33.4 శాతం వృద్ధి చెంది రూ.2,163 కోట్లుగా నమోదైందని తెలిపింది. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేరుకు రూ.0.55 పైసల చొప్పున డివిడెండ్ చెల్లించాలని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ బోర్డు ఆమోదించింది. కరోనా కారణంగా అనేక మందిలో ఇన్సూరెన్స్ విషయంలో వచ్చిన మార్పు కూడా దీనికి దోహదపడినట్లు నిపుణులు అంటున్నారు. ప్రజల్లో ఇన్సూరెన్స్ పట్ల ఆదరణ పెరుగుతోందని.. దాని వల్ల వచ్చే ప్రయోజనాలను ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పుకోవచ్చు. తాజాగా చాలా కంపెనీలు ప్రకటిస్తున్న వార్షిక ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. ఆయా కంపెనీల షేర్ హోల్డర్లకు సైతం మంచి లాభాలను అందిస్తున్నాయి.
ఇవీ చదవండి..
Anand Mahindra: బ్రిలియంట్ అంటూ ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్.. నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్..
LIC: ఫెమా నిబంధనలను సవరించిన ప్రభుత్వం.. ఎల్‌ఐసీలో 20 శాతం ఎఫ్‌డీఐ పెట్టుబడులకు మార్గం సుగమం..
Gas Prices: కేంద్రం ఆ పని చేయనందునే ఆకాశానికి గ్యాస్ ధరలు .. ఆందోళనలో పరిశ్రమ వర్గాలు..