Hyundai electric car: ఎలక్ట్రిక్‌ వాహన రంగంలోకి అడుగు పెట్టిన హ్యుండాయ్‌.. కొత్త కారు టీజర్‌ చూశారా..?

|

Feb 18, 2021 | 2:05 PM

Hyundai Unveils Interior Teaser of Ioniq 5: పెరుగుతోన్న కర్భన ఉద్గారాలకు అడ్డుకట్టవేయడానికి ఎలక్ట్రిక్‌ వాహనాలు పెద్ద వస్తోన్న విషయం తెలిసిందే. ప్రభుత్వాలు ప్రోత్సహాకాలు అందిస్తుండడం, ప్రముఖ కంపెనీలు..

Hyundai electric car: ఎలక్ట్రిక్‌ వాహన రంగంలోకి అడుగు పెట్టిన హ్యుండాయ్‌.. కొత్త కారు టీజర్‌ చూశారా..?
Follow us on

Hyundai Unveils Interior Teaser of Ioniq 5: పెరుగుతోన్న కర్భన ఉద్గారాలకు అడ్డుకట్టవేయడానికి ఎలక్ట్రిక్‌ వాహనాలు పెద్ద ఎత్తున వస్తోన్న విషయం తెలిసిందే. ప్రభుత్వాలు ప్రోత్సహాకాలు అందిస్తుండడం, ప్రముఖ కంపెనీలు సైతం ఈ రంగంలోకి అడుగు పెడుతుండడంతో భారీ ఎత్తున ఈ-వాహనాల ఉత్పత్తి జరుగుతోంది.
ఈ క్రమంలోనే ప్రముఖ అంతర్జాతీయ సంస్థ టెస్లా భారత్‌లో తమ ఎలక్ట్రానిక్‌ కార్లను లాంచ్‌ చేయడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే హ్యుండాయ్‌ కంపెనీ తన కొత్త ఈ-వెహికిల్‌ టీజర్‌ను లాంచ్‌ చేసింది. ఐయోనిక్‌ 5 పేరుతో తీసుకొస్తున్న ఈ కారు టీజర్‌ను తాజాగా విడుదల చేసింది. అత్యాధునిక ఫీచర్లతో టెస్లాకు పోటీనిచ్చేలా ఉన్న ఈ కారు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ కారులో భారీ డిజిటల్‌ స్క్రీన్‌ సహా డిజిటల్‌ ఇన్ట్సుమెంట్‌ క్లస్టర్‌, ఇన్ఫోటైన్‌మెంట్‌ టచ్‌ స్క్రీన్‌తో పాటు ఎల్‌ఈడీ యాంబియంట్‌ లైటింగ్‌ లాంటి అల్ట్రా-మోడరన్ టెక్నాలజీతో ఈ కారును రూపొందించారు. ఫిబ్రవరి 23న వరల్డ్ ప్రీమియర్‌ షోకి ఈ కారును సిద్ధం చేస్తున్నారు. ఐదు నిమిషాల ఛార్జింగ్‌తో 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీలో గతంలో ప్రకటించింది. ఇక కారు ఇంటీరియర్‌తో పాటు సీట్‌ అడ్జెస్ట్‌కు సంబంధించిన టీజర్‌ను కంపెనీలో ట్విట్టర్‌లో షేర్‌ చేసింది.

Also Read: Amazon: భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టనున్న అమెజాన్.. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీకి..