Hyundai Aura Facelift: మార్కెట్లోకి హ్యూందాయ్ నుంచి మరో కారు.. అదిరిపోయే ఫీచర్లు.. ధర ఎంతంటే..

హ్యూందాయ్ మోటార్ సరికొత్త మోడల్ తో 2023 ను ప్రారంభించింది. ఆరా ఫేస్ లిఫ్ట్ కారును ఆవిష్కరించింది. సెడాన్ వేరియంట్లో అత్యుత్తమ డిజైన్ తో పాటు, మెరుగైన భద్రతా ప్రామాణాలతో ఇది వస్తోంది.

Hyundai Aura Facelift: మార్కెట్లోకి హ్యూందాయ్ నుంచి మరో కారు.. అదిరిపోయే ఫీచర్లు.. ధర ఎంతంటే..
Hyundai Aura

Edited By: Anil kumar poka

Updated on: Jan 24, 2023 | 8:16 PM

దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హ్యూందాయ్ మోటార్ సరికొత్త మోడల్ తో 2023 ను ప్రారంభించింది. ఆరా ఫేస్ లిఫ్ట్ కారును ఆవిష్కరించింది. సెడాన్ వేరియంట్లో అత్యుత్తమ డిజైన్ తో పాటు, మెరుగైన భద్రతా సౌకర్యాలతో ఇది వస్తోంది. దీనిలో నాలుగు ఎయిర్ బ్యాగ్స్, ఆరు ఎయిర్ బ్యాగ్ ఎంపికలు ఉన్నాయి. స్టార్రీ నైట్ అనే పూర్తిగా కొత్త రంగుతో సహా ఆరు మోనోటోన్ కలర్ సెలెక్షన్లలో లభ్యమవుతోంది. దీని ప్రారంభ ధర రూ. 6,29,600 (ఎక్స్-షోరూమ్) ఉంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

లేటెస్ట్ డిజైన్..

ఆరా ఫేస్ లిఫ్ట్ లేటెస్ట్ డిజైన్ తో వస్తోంది.బయట వైపు బ్లాక్ రేడియేటర్ గ్రిల్ , ఫ్రంట్ బంపర్‌లో కొత్త LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ (DRL) ఉన్నాయి. అలాగే ఫ్రంట్ బంపర్ కూడా ఆరాకు మంచి లుక్ తీసుకొస్తోంది. ఇది R15 డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. వెనుక వింగ్ స్పాయిలర్‌ను కలిగి ఉంది. ఇది వెడల్పుగా, స్పోర్టియర్‌గా, బోల్డ్‌గా కనిపించేలా చేస్తుంది.

ఇంటీరియర్స్ ఇలా..

ఈసెడాన్ లో సీట్ ఫాబ్రిక్ కొత్త డిజైన్‌తో వస్తుంది. ప్యాటర్న్ క్లాస్ అప్పీల్‌ తీసుకొస్తోంది. అంతేకాకుండా గ్లోసీ బ్లాక్ ఇన్‌సర్ట్‌లు, లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్చ గేర్ నాబ్, గేర్ నాబ్‌పై క్రోమ్ ఫినిషింగ్, పార్కింగ్ లివర్ టిప్‌తో పాటు డోర్ హ్యాండిల్స్ లోపల మెటల్ ఫినిషింగ్ తో ఆకట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి

సూపర్ సేఫ్టీ..

కొత్త ఆరా కారులో భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, ఇవి స్మార్ట్ ఆటో AMT వంటి ఫీచర్లు ఉన్నాయి. ఐదు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ ఉంది. ఫస్ట్-ఇన్ సెగ్మెంట్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, బర్గ్‌లర్ అలారం, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు అత్యాధునిక ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.

మూడు వేరియంట్లలో..

ఆరా ఫేస్‌లిఫ్ట్ కారు మూడు ఆప్షన్లతో వస్తోంది. ఐదు స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 1.2-లీటర్ కప్పా పెట్రోల్, స్మార్ట్ ఆటో AMTతో 1.2-లీటర్ కప్పా పెట్రోల్, 1.2-లీటర్ బై-ఫ్యూయల్ (పెట్రోల్ . CNGతో) ఐదు స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఈ కారు అందుబాటులో ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..