
ఫిబ్రవరి 2024లో హ్యుందాయ్ విక్రయాలు మందకొడిగా సాగింది. అయితే గత ఏడాదితో పోలిస్తే హుందాయ్ మొత్తం అమ్మకాలు ఈ మధ్యకాలంలో పెరిగాయి. కానీ ఎగుమతులు తగ్గాయి. కాబట్టి దేశంలోని రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ తన మార్కెట్ గురించి తాజాగా గణాంకాలను వెల్లడించింది. ఇండియాలో మొత్తం విక్రయాలు ఫిబ్రవరిలో వార్షిక ప్రాతిపదికన 4.5 శాతం పెరిగి 60,501 యూనిట్లకు చేరుకున్నట్లు తెలిసింది. గత ఏడాది ఫిబ్రవరిలో మొత్తం విక్రయాలు 57,851 యూనిట్లుగా ప్రకటించింది సంస్థ. గత ఏడాదితో పోలిస్తే యూనిట్ల విలువలో పెరుగుదల కనిపిస్తోంది.
ఫిబ్రవరి 2024లోమొత్తం అమ్మకాల పరంగా హ్యుందాయ్‌కి మంచి మార్కెట్ ఉంది. దేశీయ హోల్‌సేల్ అమ్మకాలు 7 శాతం పెరిగి 50,201 యూనిట్లకు చేరుకున్నాయి. 2023 ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో కాస్త పెరిగింది. గత ఏడాది ఇదే నెలలో (ఫిబ్రవరి 2023) 47,001 యూనిట్లు.
కంపెనీ ఎగుమతులు గత నెలలో 5 శాతం తగ్గుదల కనిపించింది.10,300 యూనిట్లకు పడిపోయాయి, ఇ
ఏడాది క్రితం (2023) ఫిబ్రవరి నెలలో 10,850 యూనిట్లు ఉండగా.. ఫిబ్రవరితో పాటు జనవరి 2024లో కూడా, ఈ కంపెనీ ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన తగ్గాయి, అయితే మొత్తం అమ్మకాల పరింగా చూస్తే కాస్త పెరిగింది.
జనవరిలో, హ్యుందాయ్ హోల్‌సేల్ అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 8.5 శాతం పెరుగుదలతో 67,615 యూనిట్లకు చేరుకున్నాయి. అదే సమయంలో, దాని దేశీయ అమ్మకాలు 14 శాతం పెరిగి 57,115 యూనిట్లకు చేరుకుందని సంస్థ ప్రకటించింది. అయితే కార్ల ఎగుమతి 14 శాతం తగ్గి 10,500 యూనిట్లకు చేరుకుంది, ఇది గత ఏడాది 2023 జనవరిలో 12,170 యూనిట్లుగా నమోదైంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..