Hyundai: మీరు కారు కొంటున్నారా..? హ్యుందాయ్‌ కార్లపై భారీ డిస్కౌంట్లు..!

Hyundai Car Discounts: ఈ నెలలో మీరు కారు కొనాలనుకుంటున్నారా? అది కూడా హ్యుందాయ్‌ కారు అంటే ఇష్టమేనా? అయితే మీకో గుడ్‌న్యూస్‌ ఉంది. ఈ కంపెనీ కార్లపై భారీ డిస్కౌంట్‌ అందిస్తోంది. మరి ఏ కారు కొంటే ఎంత డిస్కౌంట్‌ ఉంటుందో తెలుసుకుందాం..

Hyundai: మీరు కారు కొంటున్నారా..? హ్యుందాయ్‌ కార్లపై భారీ డిస్కౌంట్లు..!
Hyundai Car Discounts

Updated on: Apr 23, 2026 | 10:50 AM

Hyundai Car Discounts: వేసవి కాలంలో కొత్త కారు కొనాలనుకునే వారికి హ్యుందాయ్ అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ బెనిఫిట్స్, స్క్రాపేజ్ సపోర్ట్ రూపంలో ఈ తగ్గింపులు లభిస్తున్నాయి.

ఏ మోడల్‌పై ఎంత తగ్గింపు?

కారు మోడల్ గరిష్ట డిస్కౌంట్ (రూపాయల్లో)
హ్యుందాయ్ వెర్నా రూ. 1.10 లక్షలు
క్రెటా ఎలక్ట్రిక్ రూ. 1.00 లక్ష
హ్యుందాయ్ అల్కాజార్ రూ. 70,000
గ్రాండ్ i10 నియోస్ రూ. 68,000
హ్యుందాయ్ i20 రూ. 58,000
హ్యుందాయ్ క్రెటా రూ. 55,000
హ్యుందాయ్ ఎక్స్టర్ రూ. 43,000
హ్యుందాయ్ ఆరా రూ. 20,000
హ్యుందాయ్ వెన్యూ రూ. 5,000

వెర్నా సెన్సేషన్: ఈ నెలలో అత్యధిక డిస్కౌంట్ పొందుతున్న కారు హ్యుందాయ్ వెర్నా. పాత ఇయర్ మోడల్ స్టాక్ తీసుకునే వారికి ఏకంగా రూ. 1.10 లక్షల ప్రయోజనం కలుగుతుంది. ఇది 160 PS పవర్‌ని ఇచ్చే టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో కూడా అందుబాటులో ఉంది. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలనుకునే వారి కోసం క్రెటా ఎలక్ట్రిక్ పై రూ. 1 లక్ష వరకు కాంబో ఆఫర్లు ఇస్తున్నారు. ఇందులో ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ బోనస్‌లు కూడా కలిసి ఉన్నాయి. చిన్న కార్లపై కూడా ఆఫర్లు ఉన్నాయి. సిటీ డ్రైవింగ్‌కు అనువైన గ్రాండ్ i10 నియోస్‌పై రూ. 68 వేల వరకు తగ్గింపు ఉండటం విశేషం.

గమనిక: ఈ ఆఫర్లు డీలర్‌షిప్‌ను బట్టి, కారు మోడల్ ఇయర్, వేరియంట్‌ను బట్టి మారవచ్చు. కారు కొనే ముందు మీ సమీపంలోని హ్యుందాయ్ షోరూమ్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Window AC vs Split AC: విండో ఏసీ Vs స్ప్లిట్ ఏసీ.. ఏది గదిని త్వరగా చల్లబరుస్తుంది? మీ ఇంటికి ఏది బెస్ట్?

ఇది కూడా చదవండి: Success Story: ఉద్యోగం వదిలేసి కోట్లు సంపాదిస్తున్నాడు.. 4 నెలల్లోనే రూ.1 కోటి విలువైన కంపెనీని నిర్మించిన 24 ఏళ్ల యువకుడు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us