IT Jobs: బెంగళూరును దాటేస్తున్న హైదరాబాద్.. ఐటీ ఉద్యోగులకు టాప్ డెస్టినేషన్ మన సిటీనే..

సాధారణంగా ఐటీ జాబ్స్ అంటే మొదట గుర్తొచ్చేది బెంగళూరే. అక్కడ ఉద్యోగం చేసేందుకు ఐటీ ప్రొఫెషనల్స్ కూడా ఇష్టపడతారు. అయితే ఇటీవల ఐటీ ఉద్యోగుల ఆలోచనా విధానం మారుతోంది. చాలా మంది బెంగళూరు కన్నా హైదరాబాద్ లోనే ఉద్యోగం చేస్తామని చెబుతున్నారంట. హైదరాబాద్ తర్వాత బెంగళూరును ఇష్టపడుతున్నారట. దేశంలో ఓవరాల్ గా ఐటీ జాబ్స్ తగ్గినప్పటికీ ఈ రెండు నగరాల్లో జాబ్స్ కొదువేలేదని గ్లోబల్ జాబ్ మ్యాచింగ్ అండ్ హైరింగ్ ప్లాట్ ఫారం ‘ఇన్‌డీడ్’ ప్రకటించింది.

IT Jobs: బెంగళూరును దాటేస్తున్న హైదరాబాద్.. ఐటీ ఉద్యోగులకు టాప్ డెస్టినేషన్ మన సిటీనే..
It Sector Jobs

Updated on: May 27, 2024 | 11:24 AM

హైదరాబాద్.. చాలా మందికి లవబుల్ సిటీ. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి విద్యార్థి చదవు అయిపోగానే పరుగెత్తేది హైదరాబాద్ వైపే. ఎందుకంటే అక్కడ అవకాశాలు దొరకుతాయి.. ట్రైనింగ్ సెంటర్లు ఉంటాయి.. ఏదో ఒకరకంగా సెటిల్ కావచ్చన్న అంచనాతో అందరూ హైదరాబాద్ వైపు చూస్తుంటారు. అయితే ఇటీవల ఓ సర్వేలో మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఐటీ జాబ్స్ అంటే మొదట గుర్తొచ్చేది బెంగళూరే. అక్కడ ఉద్యోగం చేసేందుకు ఐటీ ప్రొఫెషనల్స్ కూడా ఇష్టపడతారు. అయితే ఇటీవల ఐటీ ఉద్యోగుల ఆలోచనా విధానం మారుతోంది. చాలా మంది బెంగళూరు కన్నా హైదరాబాద్ లోనే ఉద్యోగం చేస్తామని చెబుతున్నారంట. హైదరాబాద్ తర్వాత బెంగళూరును ఇష్టపడుతున్నారట. దేశంలో ఓవరాల్ గా ఐటీ జాబ్స్ తగ్గినప్పటికీ ఈ రెండు నగరాల్లో జాబ్స్ కొదువేలేదని గ్లోబల్ జాబ్ మ్యాచింగ్ అండ్ హైరింగ్ ప్లాట్ ఫారం ‘ఇన్‌డీడ్’ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఇన్‌డీడ్ సర్వే ఇలా..

గ్లోబల్ జాబ్ మ్యాచింగ్ అండ్ హైరింగ్ ప్లాట్‌ఫారమ్ ఇన్‌డీడ్ ఏప్రిల్ 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ఉద్యోగాల స్థితిని హైలైట్ చేస్తూ కొత్త డేటాను విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం, ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాలు హైదరాబాద్‌లో 41.5%, బెంగళూరులో 24% పెరిగాయి. ఈ నగరాలు ఐటీ ప్రొఫెషనల్స్ ఇష్టపడుతున్న అగ్ర గమ్యస్థానాలుగా పేర్కొంది. ఆసక్తికరంగా, జాబ్ క్లిక్‌లలో కూడా గణనీయమైన పెరుగుదల ఉంది, హైదరాబాద్‌లో ఉద్యోగార్థుల ఆసక్తి 161% పెరిగింది. బెంగళూరులో 80% పెరిగింది.

ఉద్యోగాలు తగ్గుతున్నాయ్..

దేశం మొత్తం మీద చూస్తే.. ఐటీ ఉద్యోగ అవకాశాలు తగ్గాయి. జాబ్ పోస్టింగ్‌లు 3.6% తగ్గాయి. అనిశ్చిత ప్రపంచ ఆర్థిక వాతావరణం కారణంగా టెక్ కంపెనీలు నియామకంలో జాగ్రత్తగా ఉన్నాయని ఇది సూచిస్తుంది. ఇన్‌డీడ్ ఇండియా సేల్స్ హెడ్ శశి కుమార్ మాట్లాడుతూ సాఫ్ట్‌వేర్ అండ్ ఐటీ పొజిషన్‌లను ప్రస్తుతం ఈ రంగంలో పనిచేస్తున్న వారికే కాకుండా కొత్త కెరీర్ అవకాశాల కోసం వెతుకుతున్న వ్యక్తులు కూడా ఎక్కువగా కోరుతున్నారు. లేఆఫ్‌లు ఉన్నప్పటికీ, ఐటీ ఉద్యోగాల ఆకర్షణ పెరిగింది. ఈ పాత్రలకు సాధారణంగా అవసరమైన విస్తృతమైన నైపుణ్యం, శిక్షణ, అనుభవం కారణంగా ఐటీలో ఈ బలమైన ఆసక్తి ఉంటోంది.

ఉద్యోగార్థులు ఏమి చేయాలి?

ఈ జాబ్ మార్కెట్‌ను నావిగేట్ చేయడానికి, ఉద్యోగార్ధులు పోటీతత్వ ప్రతిభలో వారిని నిలబెట్టే నైపుణ్యాలను పొందడంపై దృష్టి పెట్టాలని కుమార్ సూచిస్తున్నారు. ప్రస్తుతం డిమాండ్‌ ఉన్న కీలక నైపుణ్యాలు ఏమిటంటే అనాలిసిస్, చురుకైన పద్దతులలో సమస్య పరిష్కారించే తత్వమేనని చెబుతున్నారు.

ఉద్యోగార్థులకు కావాల్సినవి..

ఇన్‌డీడ్ ప్లాట్‌ఫారమ్‌లో జాబ్ పోస్టింగ్‌లు, జాబ్ క్లిక్‌ల ప్రకారం కంపెనీలు ఉద్యోగార్థుల నుంచి ఆశిస్తున్న స్కిల్ సెట్ ఈ విధంగా ఉంది..

  • అనాలిసిస్ స్కిల్స్ 5.51శాతం
  • అజైల్(Agile) 5.39 శాతం
  • ఏపీఐ(API) 5.4శాతం
  • జావా స్క్రిప్ట్(JavaScript) 4శాతం
  • ఎస్‌క్యూఎల్(SQL) 4శాతం

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..