TVS iQube Electric Scooter: భారీ తగ్గింపు.. రూ. 41,000 వరకూ ఆదా.. ఈ-స్కూటర్‌ కొనాలంటే ఇప్పుడే కొనేయండి..

వాస్తవానికి, ఫేమ్‌ 2 సబ్సిడీ 2024, ఏప్రిల్ 1, నాటికి నిలిచిపోతుంది. దీంతో కంపెనీలు తమ స్టాక్లను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం టీవీఎస్‌ ఐక్యూబ్‌కి రూ.22,065 సబ్సిడీ లభిస్తుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై లభించే ఇతర తగ్గింపులను మొత్తం కలిపితే అది రూ. 40,564కి చేరుతుంది.

TVS iQube Electric Scooter: భారీ తగ్గింపు.. రూ. 41,000 వరకూ ఆదా.. ఈ-స్కూటర్‌ కొనాలంటే ఇప్పుడే కొనేయండి..
Tvs Iqube Electric Scooter

Updated on: Mar 15, 2024 | 7:23 AM

ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్‌ న్యూస్‌. ప్రముఖ ఈ-స్కూటర్‌ తయారీదారు టీవీఎస్‌ తన ఏకైక ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఐక్యూబ్‌పై అదిరే ఆఫర్‌ను అందిస్తోంది. ఈ మార్చినెలలో దీనిని కొనుగోలు చేయడం ద్వారా రూ. 41,000 వరకూ ఆదా చేసుకునే అవకాశాన్ని కంపెనీ ఇస్తోంది. దీనిలో రూ. 6000 క్యాష్ బ్యాక్ తగ్గింపు, వినియోగదారుడు నో కాస్ట్ ఈఎంఐపై కొనుగోలు చేస్తే, రూ. 7500 అదనపు తగ్గింపును పొందే అవకాశం ఉంటుంది. అదే సమయంలో రూ.5000 విలువైన ఎక్స్‌టెండెడ్‌ వారంటీ కూడా పూర్తిగా ఉచితంగా పొందొచ్చు. ఈ ఆఫర్ 31 మార్చి 2024 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

వాస్తవానికి, ఫేమ్‌ 2 సబ్సిడీ 2024, ఏప్రిల్ 1, నాటికి నిలిచిపోతుంది. దీంతో కంపెనీలు తమ స్టాక్లను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం టీవీఎస్‌ ఐక్యూబ్‌కి రూ.22,065 సబ్సిడీ లభిస్తుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్పై లభించే ఇతర తగ్గింపులను మొత్తం కలిపితే అది రూ. 40,564కి చేరుతుంది. అటువంటి పరిస్థితిలో, ఈ ఇ-స్కూటర్‌ను కొనుగోలు చేయడానికి ఇదే ఉత్తమ సమయం. ఈ ఆఫర్‌ మార్చి 31 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీని ధరలు ఏప్రిల్ 1 నుంచి పెరగనున్నాయి. కాగా ఈ టీవీఎస్‌ ఐక్యూబ్‌ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న రెండో ఎలక్ట్రిక్ స్కూటర్‌గా రికార్డు నమోదు చేసింది.

అతి తక్కువ ఖర్చుతో..

టీవీఎస్‌ మోటార్స్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను ఐక్యూబ్‌ అధికారిక పేజీలో వివరించింది. వాహనంలో లీటర్ పెట్రోలు రూ.100 వెచ్చించాల్సి ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోల్ స్కూటర్పై 50,000 కి.మీ ప్రయాణించాలంటే దాదాపు రూ.లక్ష ఖర్చు అవుతుంది. ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్తో 50,000 కి.మీ ప్రయాణించడానికి అయ్యే ఖర్చు రూ.6,466 మాత్రమేనని చెబుతోంది. దీనికి అదనంగా జీఎస్టీ కూడా ఆదా అవుతుందని పేర్కొంది. సర్వీస్‌ మెయింటెనెన్స్‌ చార్జీలు కూడా ఆదా అవుతాయని వివరించింది. ఈ విధంగా ఐక్యూబ్‌ ప్రతి 50,000కిలోమీటర్‌లకు రూ.93,500 ఆదా చేస్తుంది. ఐక్యూబ్లోని బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేయడానికి రూ.19 అవుతుందని పేర్కొంది. ఐక్యూబ్‌ ఎస్టీ మోడల్‌ ఫుల్‌ చార్జ్‌ చేయడానికి 4 గంటల 6 నిమిషాలు పడుతుంది. దీని తర్వాత 145కిలోమీటర్ల వరకు నడపవచ్చు. అంటే మీరు రోజూ 30కిలోమీటర్లు నడిస్తే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని వారానికి రెండుసార్లు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. రెండు సార్లు ఛార్జింగ్ చేస్తే రూ.37.50 అవుతుంది. అంటే సగటు నెలవారీ ఖర్చు రూ.150. అంటే రోజువారీ ఖర్చు రూ.3 అవుతుంది. అదే సమయంలో, దీని పరిధి రెండుసార్లు ఛార్జింగ్ చేస్తే 290కిమీ ఉంటుంది. అంటే ఈ ఖర్చుతో మీరు ప్రతిరోజూ సగటున 30కిలోమీటర్లు హాయిగా నడవవచ్చు.

ఇవి కూడా చదవండి

టీవీఎస్‌ ఐక్యూబ్‌ ఫీచర్లు..

టీవీఎస్‌ ఐక్యూబ్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ 7 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్క్రీన్, క్లీన్ యూఐ, ఇన్ఫినిటీ థీమ్ పర్సనలైజేషన్, వాయిస్ అసిస్ట్, అలెక్సా స్కిల్ సెట్, ఇంట్యూటివ్ మ్యూజిక్ ప్లేయర్ కంట్రోల్, ఓటీఏ అప్డేడేట్స్, ప్లగ్-అండ్-ప్లే విత్ ఛార్జర్ ఫాస్ట్ ఛార్జింగ్, సేఫ్టీ ఇన్ఫర్మేషన్, బ్లూటూత్ ఫీచర్లతో పాటు 32 లీటర్ల నిల్వ స్థలాన్ని అందిస్తుంది.

టీవీఎస్‌ ఐ‍క్యూబ్‌ స్పెసిఫికేషన్లు..

ఇందులో 5.1కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 140 కి.మీ. రేజ్‌ ఇస్తుంది. ఈ స్కూటర్లో 5-వే జాయ్లాస్టిక్ ఇంటరాక్టివిటీ, మ్యూజిక్‌ కంట్రోల్స్‌, వాహన ఆరోగ్యంతో ప్రోయాక్టివ్ నోటిఫికేషన్లు, 4జీ టెలిమాటిక్స్, ఓటీఏ అప్డేట్లను పొందుతుంది. స్కూటర్ థీమ్ వాయిస్ అసిస్ట్, అలెక్సాతో వస్తుంది. ఇది 1.5కేడబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతు ఇస్తుంది. దీని స్మార్ట్‌ కనెక్ట్‌ ప్లాట్ఫారమ్ మెరుగైన నావిగేషన్ సిస్టమ్, టెలిమాటిక్స్ యూనిట్, యాంటీ-థెఫ్ట్, జియో ఫెన్సింగ్ వంటి ఫీచర్లను అందిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us