
పరుగులు పెడుతున్న బంగారం ధరలు కాస్తా ఉపశమనం కలిగించాయి. ఇటీవల లక్షరూపాయలు దాటిన బంగారం ధరలు.. తర్వాత 95 వేల వరకు దిగి వచ్చాయి. అయితే గత రెండు రోజుల నుంచి తులం బంగారం ధర లక్ష రూపాయలు దాటేసింది. ఏకంగా లక్షా 2వేలకుపైగా ఎగబాకింది. ఇక వెండి ధర కూడా అంతే.. కిలో వెండి ధర లక్షా 10 వేలకుపైగా వెళ్లింది. అయితే తాజాగా జూన్ 17వ తేదీన రాత్రి 7 గంటల సమయానికి తులం బంగారం ధరపై భారీగా దిగి వచ్చింది. పెరుగుతున్న బంగారం ఒక్కసారిగా దిగి వచ్చింది. అయితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 1140 రూపాయలు తగ్గి లక్షా 370 రూపాయల వద్ద ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై 1050 రూపాయలు తగ్గి ప్రస్తుతం 92,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. అయితే ఇది ఉపశమనం కలిగించే అంశం కాకపోయినా పెరుగుతున్న ధరలకు కొంత మేలనే చెప్పాలి. ఇంత తగ్గుముఖం పట్టినా సామాన్యుడు మాత్రం కొనలేని పరిస్థితి ఉంది. ఎంత తగ్గినా ప్రస్తుతం బంగారం కొనాలంటే లక్ష రూపాయలు పెట్టుకోవాల్సిందే.
ఇది కూడా చదవండి: AC Rules: కేంద్రం కీలక నిర్ణయం.. కొత్త ఎయిర్ కండిషనింగ్ నిబంధనలు
అయితే న్యూయార్క్ నుండి న్యూఢిల్లీ వరకు బంగారం ధరలో భారీ తగ్గుదల కనిపించింది. ఢిల్లీలో బంగారం ధర రూ.1200 తగ్గగా, మరోవైపు, న్యూయార్క్‌లో బంగారం ధర 12 డాలర్లకు పైగా తగ్గింది. ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే ప్రపంచంలోనే అతిపెద్ద భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత మధ్య బంగారం ధర ఎందుకు తగ్గింది? ఒక పెద్ద సంక్షోభం ముగిసే సంకేతాలు ఏమైనా ఉన్నాయా? ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణలో భాగంగా ఇరాన్ దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తోందనే భావన వ్యాపారులలో వేగంగా వ్యాపిస్తోంది.
మరోవైపు, వెండి ధరలు పెరిగాయి. ఢిల్లీలో వెండి ధర స్వల్పంగా పెరిగింది. మరోవైపు, ఫ్యూచర్స్ మార్కెట్లో వెండి ధర రికార్డు స్థాయికి చేరుకుంది. న్యూయార్క్‌లో వెండి ధరల్లో కూడా పెరుగుదల ఉంది. ప్రపంచంలోని ప్రధాన మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఇది కూడా చదవండి: Helicopter Pilot: హెలికాప్టర్ పైలట్ నెల జీతం ఎంత ఉంటుందో తెలుసా..?
ఢిల్లీలో బంగారం ధరలు
ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం బంగారం ధర 10 గ్రాములకు రూ.1,200 తగ్గి రూ.1,00,170కి చేరుకుంది. మునుపటి ట్రేడింగ్ సెషన్‌లో, 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం 10 గ్రాములకు రూ.1,01,370 వద్ద ముగిసింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం 10 గ్రాములకు రూ.1,100 తగ్గి రూ.99,450కి చేరుకుంది (అన్ని పన్నులతో సహా). సోమవారం, 10 గ్రాములకు రూ.1,00,550 వద్ద ముగిసింది. అయితే, మంగళవారం, వెండి ధర రూ.100 పెరిగి కిలోకు రూ.1,07,200కి చేరుకుంది (అన్ని పన్నులతో సహా). మునుపటి ట్రేడింగ్ సెషన్‌లో, వెండి కిలోకు రూ.1,07,100 వద్ద ముగిసింది.
ఇది కూడా చదవండి: Flight Sound: ప్లైట్ టేకాఫ్ అయ్యే ముందు ఈ సౌండ్ ఎందుకు వస్తుందో తెలుసా? దేనికి సంకేతం!
ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య పూర్తి స్థాయి ప్రాంతీయ యుద్ధం జరిగే అవకాశాన్ని వ్యాపారులు తిరిగి అంచనా వేయడంతో మంగళవారం బంగారం ధరలు మరింత తగ్గాయని HDFC సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు (కమోడిటీ) సౌమిల్ గాంధీ అన్నారు. ఇజ్రాయెల్‌తో పెరుగుతున్న వివాదానికి ఇరాన్ చురుకుగా దౌత్యపరమైన పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్లు వచ్చిన నివేదికల తర్వాత ఈ మార్పు వచ్చింది.
ఇది కూడా చదవండి: School Holidays: జూలైలో పాఠశాలలకు వరుసగా సెలవులు ఉంటాయా?