
క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నవారు ఆ మార్పులు, కొత్త చార్జీలను తెలుసుకుంటూ ఉండాలి. లేకపోతే అనవసర చార్జీలు, ఆర్థిక భారాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 2025లో ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, యస్ బ్యాంకుల క్రెడిట్ కార్డు నిబంధనలు మారాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ బ్యాంకు క్రెడిట్ కార్డు ఎడ్జ్ రివార్డులపై కొత్త రిడెంప్షన్ ఫీజులు విధించింది. వడ్డీ రేట్లలో మార్పులు తెచ్చింది. ఇంధనం, అద్దె చెల్లింపులు, వాలెట్ లోడ్ పై కొత్త చార్జీలు విధిస్తోంది.
విమాన టిక్కెట్లు, హోటల్ రిజర్వేషన్లపై రివార్డు పాయింట్లను యస్ బ్యాంకు తగ్గించింది. లాంజ్ బెనిఫిట్ల కోసం లిమిట్ ను పెంచింది.
హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించేవారు రూ.50 వేలు, ఆ పైన బిల్లులు చెల్లిస్తే ఒక శాతం ఫీజు కట్టాలి. అలాగే రూ.15 వేలకు పైన జరిపి ఫ్యూయల్ ట్రాన్సాక్షన్లపై కూడా ఒక శాతం ఫీజు చెల్లించాలి.
ఎస్పీఐ కూడా తన క్రెడిట్ కార్డులపై మార్పులు తీసుకువచ్చింది. ఎడ్యుకేషన్, ప్రభుత్వ బిల్లులు, అద్దె, బీబీపీఎస్ చెల్లింపులపై రివార్డు పాయింట్లను నిలిపివేసింది. అలాగే యుటిలిటీ బిల్లులను రూ.50 వేలకు పైన చెల్లిస్తే ఒక శాతం ఫీజు కట్టాలి.
బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు నిబంధనలను మార్చడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఖాతాదారుల బాధ్యతాయుతమైన ప్రవర్తనను ప్రోత్సహించడానికి, మోసాలకు నివారించడానికి, సాంకేతిక పురోగతిని సద్వినియోగం చేసుకోవడానికి బ్యాంకులు ఈ మార్పులు చేస్తాయి. అందువల్ల క్రెడిట్ కార్డు హోల్డర్లు సంబంధిత బ్యాంకుల మార్గదర్శకాలను జాగ్రత్తగా పాటించడం చాలా ముఖ్యం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి