
దేశంలోని రైతన్నలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో పీఎం కిసాన్ పథకం కింద ఏడాదికి రూ.6వేల పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ పథకం కింద ప్రభుత్వం 22వ విడతల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. గత నెల 13నే గౌహతిలో ప్రధాని మోదీ 22వ విడత విడుదల చేశారు. దీంతో ఇప్పుడు రైతులంతా 23వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా, ఈ పథకం కింద ప్రతి 4 నెలలకు ఒకసారి రైతుల ఖాతాల్లో విడుదలవుతాయి. 22వ విడత మార్చిలో వచ్చింది కాబట్టి, 23వ విడత జూలైలో వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం నుంచి వచ్చే పెట్టుబడి సాయం మీరు పొందాలంటే మీ మొబైల్ నంబర్ అప్‌డేట్‌గా ఉండటం చాలా ముఖ్యం. లేకపోతే మీ ఈ సారి డబ్బులు అంతనట్టే. కాబట్టి ఆన్‌లైన్‌లో మొబైల్ నెంబర్ ఎలా అప్‌డేట్ చేసుకోవాలో చూద్దాం..
ఆన్‌లైన్‌లో మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసే విధానం
ఇలా కూడా అప్‌డేట్ చేసుకోవచ్చు
CSC సెంటర్: ఒకవేళ మీకు ఆన్‌లైన్‌లో చేయడం వీలుకాకపోతే, మీ దగ్గర్లోని సీఎస్‌సీ సెంటర్‌కు వెళ్లి అక్కడ అప్‌డేట్ చేసుకోవచ్చు. అక్కడ బయోమెట్రిక్ ద్వారా మీ ఇ-కేవైసీ పూర్తి చేసి, కొత్త నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏవైనా సమస్యలు ఎదురైతే PM కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్లు 155261 లేదా 1800115526 కు కాల్ చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.