SBI Customer Center : ఎస్బీఐ కస్టమర్ కేంద్రాన్ని ఎలా ప్రారంభించాలి..! ఎంత ఆదాయం ఉంటుంది.. తెలుసుకోండి..

|

Jun 20, 2021 | 1:02 PM

SBI Customer Center : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ బ్రాంచ్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం, ఏటిఎం ద్వారా వినియోగదారులకు

SBI Customer Center : ఎస్బీఐ కస్టమర్ కేంద్రాన్ని ఎలా ప్రారంభించాలి..! ఎంత ఆదాయం ఉంటుంది.. తెలుసుకోండి..
Sbi
Follow us on

SBI Customer Center : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ బ్రాంచ్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం, ఏటిఎం ద్వారా వినియోగదారులకు వివిధ సౌకర్యాలను అందిస్తూనే ఉంది. అదేవిధంగా బ్యాంక్ అనేక కస్టమర్ సర్వీస్ పాయింట్లను నిర్వహించింది. దీని నుంచి వినియోగదారులు బ్యాంకుకు సంబంధించిన అనేక పనులను చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు సేవా కేంద్రాల నుంచి బ్యాంకులో ఒక ఖాతాను కూడా తెరవవచ్చు. ఖాతాలో డబ్బు జమ చేయడం, ఖాతా తెరవడం వంటి కొన్ని ముఖ్యమైన పనులను ఇక్కడ చేయవచ్చు.

కస్టమర్ సేవా కేంద్రాలు బ్యాంక్ బ్రాంచ్ కొంచెం దూరంలో ఉన్న ప్రదేశాలలో ఉంటాయి. ముఖ్యంగా గ్రామాల్లో లేదా మారుమూల ప్రాంతాల్లో ఎక్కువగా ఉపయోగించబడతాయి. ప్రత్యేక విషయం ఏమిటంటే మీరు ఈ కస్టమర్ సేవా కేంద్రాన్ని తెరవగలరు. దీంతో బ్యాంక్ మీకు కొన్ని బ్యాంకింగ్ పనులకు అనుమతిస్తుంది. దీని కోసం మీరు బ్యాంక్ నుంచి అనుమతి తీసుకోవాలి. మీరు ఏదైనా ఉపాధి మార్గాల కోసం చూస్తున్నట్లయితే మీరు ఈ కస్టమర్ సేవా కేంద్రాన్ని తెరిచి కస్టమర్ల కోసం పనిచేయడం ద్వారా మంచి డబ్బు సంపాదించవచ్చు. మీరు కస్టమర్ సేవా కేంద్రాన్ని ఎలా తెరవవచ్చో దానిని తెరవడానికి ప్రక్రియ ఏమిటో తెలుసుకుందాం.

CSP ని ఎవరు తెరవగలరు?
అవసరమైన పత్రాలను నింపడం ద్వారా ఏ వ్యక్తి అయినా ఎస్బిఐ సిఎస్పిని తెరవవచ్చు. CSP కేంద్రం కోసం మీరు మొదట బ్యాంకును సంప్రదించాలి. దీని కోసం బ్యాంకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇటీవల ఒక వ్యక్తి ట్విట్టర్ ద్వారా ఎస్బిఐని ట్యాగ్ చేసి ఎస్బిఐ సిఎస్పిని ఎలా తెరవగలరని అడిగారు. ఈ ప్రశ్నకు ఎస్‌బిఐ ట్వీట్ చేయడం ద్వారా సమాధానం ఇచ్చింది. సిఎస్‌పి తీసుకునే విధానాన్ని తెలిపింది. ఎస్బిఐ ఇచ్చిన సమాచారం ప్రకారం.. మొదట దరఖాస్తును ప్రాంతీయ వ్యాపార కార్యాలయానికి (ఆర్బిఓ) సమర్పించాలి.

RBO చిరునామాను https://bank.sbi/portal/web/home/branch- ని సందర్శించవచ్చు. లొకేటర్ దాన్ని పొందవచ్చు. చిరునామా మా సమీప శాఖ నుంచి కూడా పొందవచ్చు. ఇది ఆ RBO క్రింద పనిచేసే అన్ని శాఖల బ్యాంకింగ్ హాలులో ప్రదర్శించబడుతుంది. అనేక నివేదికల ప్రకారం సిఎస్పి కేటాయింపు కోసం చాలా కంపెనీలు ఉన్నాయి దీని ద్వారా సిఎస్పి పొందవచ్చు. అయితే ఈ కంపెనీల ద్వారా కూడా అనేక రకాల మోసాలు కూడా జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో మీరు సంస్థపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మోసాలను నివారించడానికి మీరు నేరుగా బ్యాంకును సంప్రదించవచ్చు.

The Mummy Hero : గుర్తు పట్టలేనంతగా మారిపోయిన హాలీవుడ్ స్టార్ హీరో.. షాక్ తిన్న అభిమానులు

AP Crime News: ఏటీఎంలో చోరి కేసులో దొరికారు.. విచార‌ణ‌లో పోలీసుల మైండ్ బ్లాంక్

Nawazuddin Siddiqui: లాక్ డౌన్ సమయంలో పొలం బాటపట్టిన బాలీవుడ్ నటుడు.. పంట పండేవరకూ ఇక్కడే అంటూ..