AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office: నెలకు జస్ట్‌ రూ.10వేల పెట్టుబడి.. సామాన్యుడిని కూడా కోటిశ్వరుడిని చేసే సూపర్ స్కీమ్..

దేశ ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగు పర్చేందుకు, పోస్ట్‌ ఆఫీస్ వివిధ రకాల పొదుపు, పెట్టుబడి పథకాలను అందిస్తోంది. కానీ వీటి గురించి చాలా మంది తెలియదు. అయితే పోస్టల్ సేవింగ్స్ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా రూ.1 కోటి వరకు పొందవచ్చు. అదెలానో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Post Office: నెలకు జస్ట్‌ రూ.10వేల పెట్టుబడి.. సామాన్యుడిని కూడా కోటిశ్వరుడిని చేసే సూపర్ స్కీమ్..
Post Office Savings Schemes
Anand T
|

Updated on: May 15, 2026 | 5:14 PM

Share

ప్రతి ఒక్కరికీ సురక్షితమైన, స్థిరమైన ఆర్థిక భవిష్యత్తు ఉండాలనే కోరిక ఉంటుంది. అందుకోసం చాలా మంది రాత్రింబగళ్లు కష్టపడి పనిచేస్తుంటారు. ఎంత కష్టపడి సంపాదించినప్పటికీ, చాలా మంది తాము అనుకున్న ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోలేకపోతుంటారు. దానికి ప్రధాన కారణం.. సంపాదించిన డబ్బును సరైన మార్గంలో పెట్టుబడి పెట్టి పెంచుకోకపోవడమే. ఇందుకోసమే ప్రభుత్వం పలు రకాల పొదుపు, పెట్టుబడి పథకాలను అమలు చేస్తోంది. వీటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా సామాన్య ప్రజలు సైతం రూ.1 కోటి అనే లక్ష్యాన్ని చాలా సులభంగా చేరుకోవచ్చు. కాబట్టి ఏ పథకంలో ఎలా పెట్టుబడి పెడితే ఈ రూ.1 కోటి లక్ష్యాన్ని సాధించవచ్చో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

మీరు ప్రభుత్వ పొదుపు పథకాల ద్వారా రూ.1 కోటి వరకు సంపాధించాలి అనుకుంటే, ఒక వ్యక్తి ఖచ్చితంగా రెండు ప్రత్యేక పథకాల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అవే పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ (Post Office Time Deposit), పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ (Post Office Recurring Deposit).

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్

ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD), టైమ్ డిపాజిట్ (TD) రెండు కూడా ఒకే రకమైన పథకాలు. ప్రస్తుతం ఈ పథకానికి ఏడాదికి 7.5 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ స్కీమ్‌ ద్వారా మీరు మీ పెట్టుబడిని రూ. 1 కోటి వరకు పెంచుకోవాలి అనుకుంటే. 5 సంవత్సరాల పాటు ఈ స్కీమ్‌లో రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టాలి. మీరు పెట్టుబడి పెట్టిన రూ.10 లక్షల డబ్బు 5 ఏళ్ల ముగిసేసరికి వడ్డీతో కలిపి రూ.14,49,948 అవుతుంది. ఇదే మొత్తాన్ని విత్‌డ్రా చేయకుండా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి చొప్పున మొత్తం 20 సంవత్సరాల పాటు అలాగే కొనసాగించాలి. 20 ఏళ్ల తర్వాత మీ రూ.10 లక్షల ప్రారంభ పెట్టుబడి మొత్తం రూ.44,19,877 గా మారుతుంది.

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్

టైమ్ డిపాజిట్ లాగే, ఈ పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకంలో కూడా 20 ఏళ్ల పాటు పెట్టుబడిని కొనసాగించాల్సి ఉంటుంది. నెలకు రూ.10,000 చొప్పున 6.7% వడ్డీతో మీ చేతికి రూ. 7,13,659 వస్తాయి. తర్వాత ఈ రూ.7.13 లక్షలను 7.5% వడ్డీ ఇచ్చే 5 ఏళ్ల టైమ్ డిపాజిట్ లో వేయాలి. దీనితో పాటు సమాంతరంగా మళ్లీ నెలకు రూ.10,000 కొత్త ఆర్డీ మొదలుపెట్టాలి. పేదళ్లు ముగిసే సరికి పాత ఎఫ్‌డీ వడ్డీతో కలిపి రూ.10.34 లక్షలు అవుతుంది. కొత్త ఆర్డీ ద్వారా మరో రూ.7.13 లక్షలు వస్తాయి. మొత్తం కలిపి రూ.17.47 లక్షలు అవుతుంది. ఈ పథకాన్ని ఇలానే క్రమం తప్పకుండా 20 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ.10,000 పెట్టుబడి పెడుతూ పోతే, గడువు ముగిసేసరికి మీకు మొత్తం రూ.63,50,000 లభిస్తుంది.

రూ.1 కోటి లక్ష్యం నెరవేరేది ఇలా

పైన పేర్కొన్న విధంగా రెండు పథకాల్లోనూ సమాంతరంగా పెట్టుబడి పెట్టడం ద్వారా మీ చేతికి వచ్చే మొత్తం రూ.44,19,877, రూ. 63,50,000 మొత్తం కలిపి 20 ఏళ్ల తర్వాత మీ చేతికి సుమారు రూ.1కోటిపై వస్తాయి. అంటే మీరు అనుకున్న రూ.1 కోటి లక్ష్యాన్ని చాలా సులభంగా అధిగమించినట్టే!

గమనిక: సురక్షితమైన ప్రభుత్వ గ్యారెంటీతో పాటు అధిక లాభాలను పొందాలనుకునే వారికి ఈ డబుల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఒక అద్భుతమైన మార్గమని నిపుణులు చెబుతున్నారు.దీని గురించి మరిన్ని వివరాల కోసం పోస్ట్‌ఆఫీస్ అధికారులను సంప్రదించండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us