Personal Loan: ఇలా చేస్తే మీకు వెంటనే పర్సనల్ లోన్.. ఈ 5 తప్పులు చేశారో..

పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? లోన్ అప్లై చేసే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. సరైన ప్లానింగ్ లేకపోతే మీ లోన్ రిజెక్ట్ అవ్వొచ్చు.. పైగా క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బతింటుంది. బ్యాంకులు మీ లోన్‌ను ఆమోదించడానికి చూసే 5 ముఖ్య విషయాలు ఏంటివి..? వాటిని ఎలా మెరుగుపరుచుకోవాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Personal Loan: ఇలా చేస్తే మీకు వెంటనే పర్సనల్ లోన్.. ఈ 5 తప్పులు చేశారో..
How To Get A Personal Loan Approved Quickly

Updated on: Oct 13, 2025 | 7:59 PM

పండుగలు, శుభకార్యాల సమయంలో ఖర్చులు పెరగడం సహజం. ఈ అవసరాల కోసం చాలా మంది పర్సనల్ లోన్స్‌ను ఆశ్రయిస్తుంటారు. అయితే సరైన అవగాహన లేకుండా దరఖాస్తు చేస్తే లోన్ క్యాన్సిల్ అవుతుంది. దీంతో మీ ప్లాన్స్ ఆలస్యం కావడమే కాకుండా మీ క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బతింటుంది. బ్యాంకులు లేదా ఫిన్‌టెక్ కంపెనీలు రుణాలు ఆమోదించే ముందు తనిఖీ చేసే 5 అత్యంత కీలకమైన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

క్రెడిట్ స్కోరు

రుణం పొందడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. 750 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు చాలా మంచిది. దీంతో మీరు పాత రుణాలను సకాలంలో తిరిగి చెల్లించారని బ్యాంకులు విశ్వసిస్తాయి. డిఫాల్ట్‌లు, ఆలస్య చెల్లింపులు, లేదా ఒకేసారి చాలా రుణ దరఖాస్తులు ఉంటే లోన్ ఆమోదం పొందడం చాలా కష్టం. మీ స్కోర్‌ను తరచుగా చెక్ చేసి అందులోని తప్పులు ఉంటే వెంటనే సరిచేయండి.

స్థిరమైన జీతం – ఆదాయం

బ్యాంకులు మీరు రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని నిర్ధారించుకోవాలి. దీని కోసం మీ ఆదాయం స్థిరంగా, క్రమం తప్పకుండా ఉండేలా చూస్తాయి. మెరుగైన ఆదాయం ఉంటే లోన్ ఆమోదం పొందే అవకాశం పెరుగుతుంది. ఒకే కంపెనీలో 1-2 సంవత్సరాలు పనిచేయడం మీ ప్రొఫైల్‌కు బలం ఇస్తుంది. స్వయం ఉపాధి పొందుతున్నవారు తప్పనిసరిగా ఆర్థిక నివేదికలు లేదా పన్ను రిటర్న్‌ల వంటి ఆదాయ రుజువు చూపించాల్సి ఉంటుంది.

అప్పు-ఆదాయ నిష్పత్తి

మీ ఆదాయంలో మీరు ఎంతవరకు అప్పుల కోసం ఖర్చు చేస్తున్నారో DTI తెలియజేస్తుంది. మీ నెలవారీ ఆదాయంలో 40-50 శాతం కంటే ఎక్కువ ఇప్పటికే ఇతర ఈఎంఐల కోసం వెళుతుంటే, కొత్త రుణం పొందే అవకాశాలు తగ్గుతాయి. పాత రుణాలను ముందస్తుగా చెల్లించడం లేదా రుణాలను ఏకీకృతం చేయడం ద్వారా మీ డీటీఐ నిష్పత్తిని తగ్గించుకోవచ్చు,

వయస్సు – ఉద్యోగ ప్రొఫైల్

మీ వయస్సు, మీరు పనిచేసే సంస్థపై కూడా రుణం ఆధారపడి ఉంటుంది. బ్యాంకులు సాధారణంగా వయస్సు పరిధిని 21 నుండి 60 సంవత్సరాల మధ్య పరిగణిస్తాయి. యువ దరఖాస్తుదారులు, రిటైర్మెంట్ వయస్సు వరకు ఎక్కువ కాలం ఆదాయం సంపాదించగలిగే అవకాశం ఉన్నందున వారిని తక్కువ రిస్క్‌గా భావిస్తారు. స్థిరమైన లేదా ప్రసిద్ధ కంపెనీలలో పనిచేసేవారి దరఖాస్తులకు త్వరగా ఆమోదం దక్కుతుంది. వైద్యులు, ఇంజనీర్లు, సీఏలు వంటి వృత్తులలో ఉన్నవారిని బ్యాంకులు మరింత విశ్వసనీయంగా పరిగణిస్తాయి.

తిరిగి చెల్లించే సామర్థ్యం

బ్యాంకులు రుణం యొక్క కాలపరిమితిని నిర్ణయించేటప్పుడు మీ పదవీ విరమణ వయస్సును దృష్టిలో ఉంచుకుంటాయి. లోన్ అప్లై చేయడానికి ముందు ఈ ఐదు విషయాలపై దృష్టి సారించి మీ ఆర్థిక ప్రొఫైల్‌ను మెరుగుపరుచుకుంటే మీరు తక్కువ వడ్డీ రేటుతో సులభంగా లోన్ పొందవచ్చు. పర్సనల్ లోన్ తీసుకునే ముందు అవసరమైన ప్రమాణాలను తెలుసుకోవడం మీ ప్లాన్ విజయవంతం కావడానికి మొదటి మెట్టు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి