Central Government: ప్రభుత్వ పథకాల్లో సమస్యలున్నాయా..? ఆన్‌లైన్‌లో ఇలా ఫిర్యాదు చేస్తే మీ ప్రాబ్లం క్లియర్..

మీకు అర్హత ఉన్నా ప్రభుత్వ పథకాలు అందటం లేదా..? ఏదైనా ప్రభుత్వ శాఖ ఉండే మీ పని పెండింగ్‌లో ఉందా.. ? ప్రభుత్వ సేవలు పొందటంలో ఆలస్యం జరుగుతుందా..? ఇలాంటి సమస్యలపై మీరు ఆన్‌లైన్‌లో సులువుగా ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం మీరు ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు.

Central Government: ప్రభుత్వ పథకాల్లో సమస్యలున్నాయా..? ఆన్‌లైన్‌లో ఇలా ఫిర్యాదు చేస్తే మీ ప్రాబ్లం క్లియర్..
Central Government

Updated on: Nov 29, 2026 | 1:24 PM

కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలు సులువుగా ఫిర్యాదు చేయవచ్చు. తమ ఫిర్యాదులను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవచ్చు. ఇందుకోసం మీరు ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇంటి వద్ద నుంచే ఆన్‌లైన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలపై సింపుల్‌గా ఫిర్యాదు చేయవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం మీరు చేయాల్సిన పని ఏమీ లేదు. సింపుల్‌గా వెబ్ సైట్ ఓపెన్ చేసి మొబైల్‌తో లాగిన్ అయి మీ సమస్యను తెలిపితే చాలు. మీ సమస్యలను ఆయా ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లవచ్చు. రేషన్, పెన్షన్, ప్రభుత్వ పథకాలపై ఫిర్యాదు చేయవచ్చు. ఈ ప్రాసెస్ ఎలా అనేది ఇప్పుడు చూద్దాం.

ఏయే సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చు

ప్రభుత్వ పథకాలు, రేషన్, పింఛన్లు, బ్యాంకింగ్, పోస్టల్ శాఖ, ఇన్సూరెన్స్, అవినీతి, ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఫిర్యాదు చేయవచ్చు. మీకు అర్హతలు ఉండి ప్రభుత్వ పథకాలు అందకపోయినా, పింఛన్లు సకాలంలో అందకపోయినా, ప్రభుత్వ సేవల్లో జాప్యం జరిగినా, ప్రభుత్వ శాఖల్లో చాలాకాలంగా పనులు పెండింగ్‌లో ఉన్నా, పనులు పూర్తి చేయడానికి లంచాలు డిమాండ్ చేసినా ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. మీరు ఇందులో ఫిర్యాదు చేయడానికి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. మీరే స్వయంగా ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేస్తే ఎలాంటి ఛార్జీలు ఉండవు. అదే కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఫిర్యాదు చేస్తే రుసుంలు చెల్లించాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయడం ఎలా..?

-https://pgportal.gov.in/Home/LodgeGrievance అనే అధికారిక పోర్టల్‌ తెరవండి

-హోమ్ పేజీలో రిజిస్ట్రేషన్ లేదా సైన్ అప్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి

-మీ పేరు, చిరునామా, మొబైల్ నంబర్ వంటి అవసరమైన సమాచారాన్ని నమోదు చేయండి

-అనంతరం రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి

-ఇప్పుడు మీ మొబైల్ నంబర్, రిజిస్ట్రేషన్ ఐడి ద్వారా మళ్లీ లాగిన్ అవ్వండి

– ఫిర్యాదు చేయడానికి మీరు సంబంధిత మంత్రిత్వ శాఖ, విభాగం లేదా సంస్థను ఎంచుకోండి

-మీ సమస్యను స్పష్టమైన పదాలలో రాయండి

-ఫిర్యాదును నిరూపించడానికి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి

-అనంతరం మీ ఫిర్యాదును సబ్మిట్ చేయండి

ఫిర్యాదు స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా..?

– https://pgportal.gov.in/Home అనే పోర్టల్‌ ఓపెన్ చేయండి

-గ్రీవెన్సెస్ విభాగానికి వెళ్లి వ్యూ స్టేటస్‌పై క్లిక్ చేయండి

-రిజిస్ట్రేషన్ నంబర్, సెక్యూరిటీ కోడ్‌ను నమోదు చేయండి

-మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ నమోదు చేయండి

-OTPని నమోదు చేసిన తర్వాత మీ ఫిర్యాదు స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది

Loading...
Unable to load recommendations.
Follow Us