OTT Plans: ఓటీటీల బిల్లు ఎక్కువ అవుతుందా? తక్కువ ఖర్చుతో ఓటీటీలు ఎంజాయ్ చేసే ప్లాన్ ఇదే!

ఈ రోజుల్లో అందరూ ఓటీటీలకు బాగా అలవాటు అయ్యారు. మంచి మంచి కంటెంట్ అంతా ఓటీటీల్లోనే ఉంటుంది. అయితే ప్రస్తుతం పదుల సంఖ్యలో ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటికి సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలంటే ఖర్చు చాలా అవుతుంది. మరి తక్కువ ఖర్చుతో ఓటీటీలు ఏంజాయ్ చేసే మార్గమే లేదా?

OTT Plans: ఓటీటీల బిల్లు ఎక్కువ అవుతుందా? తక్కువ ఖర్చుతో ఓటీటీలు ఎంజాయ్ చేసే ప్లాన్ ఇదే!
Ott Plans

Updated on: Oct 15, 2025 | 4:25 PM

ఓటీటీలు వచ్చాక జనాలు సినిమాలకు వెళ్లడం కూడా తగ్గించారు. ఇంట్లో టీవీలో ఓటీటీ యాప్స్ ఇన్ స్టాల్ చేసుకునే టీవీనే థియేటర్ గా మార్చుకుంటున్నారు. అయితే ఓటీటీలకు ఫుల్ గా ఎంజాయ్ చేయాలంటే అన్ని ఓటీటీలకు సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలి. అలా చూసుకుంటే ఒక్క ఓటీటీల కోసమే నెలకు రూ. 2 వేల దాకా అవుతుంది. మీరు OTT సబ్‌స్క్రిప్షన్ ఖర్చులను తగ్గించుకోవాలనుకుంటే.. యాప్‌లో సబ్ స్క్రిప్షన్  కొనుగోలు చేయడానికి బదులుగా బ్రాడ్‌బ్యాండ్ బండిల్‌ను ఎంచుకోవడం స్మార్ట్ ఆప్షన్. ఈ ఆప్షన్ తో లాభమేంటంటే..

ఓటీటీ బండిల్స్

ఓటీటీల కోసం ఎక్కువ ఖర్చు అవుతున్నట్టయితే మీరు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ ద్వారా ఓటీటీ బండిల్స్ ను కొనుగోలు చేయొచ్చు. యాక్ట్ బ్రాడ్ బ్యాండ్, ఎయిర్ టెల్ ఫైబర్, జియో ఫైబర్, టాటా ప్లే వంటి కంపెనీలు తమ ఫైబర్ ఇంటర్నెట్ ప్లాన్‌లలో భాగంగా అనేక ఓటీటీ యాప్‌ సబ్ స్క్రిప్షన్ ను ఇస్తున్నాయి.  వీటిని కొనుగోలు చేయడం ద్వారా ఇంటర్నెట్ బిల్లులో భాగంగానే అదనంగా ఓటీటీలు పొందొచ్చు. తద్వారా నెలకు రూ. 1000 దాకా అదా అవుతుంది.

ఏడాదికి పదివేలు ఆదా

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ రూ.599 నెల ప్లాన్‌లో 30 Mbps స్పీడ్ ఇంటర్నెట్ తో పాటు 11  ఓటీటీ యాప్‌లను ఉచితంగా అందిస్తుంది. అలాగే టాటా ప్లే ఫైబర్ యొక్క రూ.850  ప్లాన్‌తో 100 Mbps  స్పీడ్ ఇంటర్నెట్ తో పాటు 4 ఓటీటీ యాప్స్ 200కి పైగా టీవీ ఛానెల్స్ లభిస్తాయి. ఇలా ఓటీటీ బండిల్స్  ఉండే ప్లాన్స్ వాడడం ద్వారా ఓటీటీ యాప్‌లు, టీవీ ఛానెల్స్, ఇంటర్నెట్.. ఇవన్నీ ఒకే బిల్లులో కవర్ చేయబడతాయి. కుటుంబ సభ్యులు వేర్వేరు పరికరాల్లో ఒకేసారి స్ట్రీమ్ చేయవచ్చు. తద్వారా సంవత్సరానికి రూ.10,000 వరకు ఆదా చేయొచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి