
ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు చిన్న వయస్సులో దిగిన ఫొటో సాధారణంగా ఉంటుంది. పెద్దయ్యే కొద్ది శరీరంలో వచ్చే మార్పుల వల్ల మనరూపం పూర్తిగా మారిపోతూ ఉంటుంది. దీని వల్ల వయస్సు పెరిగే కొద్ది ఆధార్ కార్డులోని ఫొటో చూసి మిమ్మల్ని గుర్తు పట్టడం చాలా కష్టతరంగా ఉంటుంది. దీంతో ఆధార్ కార్డులోని ఫొటోను మార్చుకోవడం వల్ల ధృవీకరణ సమయంలో మిమ్మల్ని గుర్తు పట్టడం సులువుగా ఉంటుంది. దీని వల్ల వెరిఫికేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా అవుతుంది. అందుకే ఆధార్ కార్డులోని ఫొటోను మార్చుకోవడం చాలా అవసరం. దీని వల్ల చాలా మీకు చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఆధార్ కార్డులోని ఫొటోను ఎలా మార్చుకోవాలి? ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చా? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం
ప్రస్తుతానికి అయితే ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డులోని మన ఫొటోను మార్చుకునే అవకాశం అందుబాటులో లేదు. ఫొటోను మార్చుకోవాలంటే ఆధార్ కార్డ్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లు లేదా కేంద్ర ప్రభుత్వ కామన్ సర్వీస్ సెంటర్లను సంప్రదించాల్సి ఉంటుంది. అక్కడ ఫొటో అప్డేట్ ఫారం నింపడం ద్వారా మీరు ఫొటోను అప్డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీ బయోమెట్రిక్ వివరాలను అందించాల్సి ఉంటుంది. అనంతరం మీ ఫొటోను అప్డేట్ చేసుకోవచ్చు.
-www.uidai.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
-ఆధార్ అప్డేట్ ఫారంను క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి
-వివరాలు పూర్తి చేసి మీ సమీపంలోని ఆధార్ సెంటర్‌కు వెళ్లి ఫారంను అందించండి.
-రూ.100 ఫీజు చెల్లించండి
-మీ బయోమెట్రిక్ వివరాలు చెక్ చేసి మీ ఫొటోను తీస్తారు
-ఫొటో తీశాక ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి
-ఫొటో తీసాక అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది
-రిక్వెస్ట్ నెంబర్ ఆధారంగా మీ ఫొటో అప్డేట్ అయిందో లేదో తెలుసుకోండి
-ఫొటో అప్డేట్ అయ్యాక కొత్త ఆధార్ కార్డు కోసం రిక్వెస్ట్ పెట్టుకోండి
-మీ ఇంటికి పోస్ట్ ద్వారా కొత్త ఆధార్ కార్డు వస్తుంది.