Patanjali Shopping: ఆన్‌లైన్ ద్వారా పతంజలి ఉత్పత్తులను కొనుగోలు చేయొచ్చు.. భారీ డిస్కౌంట్ కూడా.. ఎలానో తెలుసుకోండి..

దేశంలోని ప్రముఖ ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ సంస్థ పతంజలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు స్టోర్ల ద్వారా ఉత్పత్తులను కస్టమర్లకు అందిస్తోంది. అయితే ఇక నుంచి మీరు ఆన్‌లైన్, యాప్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నుంచే ఇంటి వద్ద ఆర్డర్ చేసుకోవచ్చు.

Patanjali Shopping: ఆన్‌లైన్ ద్వారా పతంజలి ఉత్పత్తులను కొనుగోలు చేయొచ్చు.. భారీ డిస్కౌంట్ కూడా.. ఎలానో తెలుసుకోండి..
Patanjali Online

Updated on: Jan 27, 2026 | 6:54 PM

దేశవ్యాప్తంగా పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశంలో ఎన్నో కంపెనీల ఆయుర్వేద ఉత్పత్తులు ఉన్నా.. పతంజలి ప్రొడక్ట్స్‌కు మాత్రం ప్రత్యేక పేరు ఉంది. దీంతో పతంజలి ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ఎక్కడికక్కడ పంతజలి స్టోర్స్ వెలిశాయి. కొంతమంది ఇక్కడికి వెళ్లి కొనుగోలు చేస్తుండగా.. ఇక ఆన్‌లైన్ ద్వారా కూడా పతంజలి ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇంట్లోనే ఉండి మీరు వెబ్‌సైట్, యాప్ ద్వారా ఆర్డర్ చేస్తే నేరుగా ఇంటికే డెలివరీ వస్తాయి. అంతేకాకుండా ఆన్లైన్ కొనుగోళ్లపై ఆఫర్లు, డిస్కౌంట్స్ కూడా పొందవచ్చు. క్రెడిట్ కార్డులతో చెల్లిస్తే మరిన్ని ఆఫర్లు వస్తాయి.

యాప్ ద్వారా కూడా ఆర్డర్

యోగా గురువు బాబా రాందేవ్ ఆధ్వర్యంలో నడుస్తున్న పతంజలి సంస్థ ఆయుర్వేద మందులే కాకుండా సుబ్బు, టూత్ పేస్ట్, పిండి, నెయ్యి, మూలికా రసాలు, బిస్కెట్లు, షాంపూ లాంటి ఇంట్లోకి అవసరమయ్యే నిత్యావసర వస్తువులను విక్రయిస్తోంది. ఇక నుంచి పతంజలి షాపులను వెళ్లి కొనాల్సిన అవసరం ఇక లేదు. మీ ఇంటి వద్దనే మొబైల్ ద్వారా పతంజలి వెబ్‌సైట్ లేదా యాప్ ఉపయోగించి ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. డిజిటల్ విధానంలో పేమెంట్ చేస్తే నేరుగా మీ ఇంటికే డెలివరీ చేస్తారు. పట్టణాలు, గ్రామాల్లో పతంజలి స్టోర్లు ఎక్కువగా ఉండవు. దీంతో అక్కడి ప్రజలు ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు.

ఆఫర్లు పొందండిలా..

ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేస్తే 3 శాతం నుంచి 10 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇక పీఎన్‌బీ పతంజలి, ఆర్‌బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో పేమెంట్స్ చేస్తే మరింత క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఇక ఉచిత డోర్ డెలివరీ సౌకర్యం కూడా పొందే అవకాశముంది.

ఎలా ఆర్డర్ చేయాలంటే..?

-patanjaliayurved.net వెబ్‌సైట్‌ను సందర్శించండి
-మీ మొబైల్ నెంబర్‌తో లాగిన్ అవ్వండి
-మీ ప్రొడక్ట్స్‌ను కార్ట్‌కు జోడించండి
-ఆన్‌లైన్ ద్వారా పేమెంట్ చేయండి
-కొన్ని రోజుల్లో మీ ఇంటికే డోర్ డెలివరీ అవుతాయి