Gas Cylinder: జస్ట్ ఒక్క మిస్డ్ కాల్‌తో ఇంటికే గ్యాస్ సిలిండర్.. ఇవి పక్కా తెలుసుకోండి..

గ్యాస్ సిలిండర్ అయిపోవస్తుందా? బుక్ చేయాలంటే ఏజెన్సీకి వెళ్లాలా లేక లైన్లో వేచి ఉండాలా అని ఆలోచిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఇప్పుడు మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా కేవలం ఒక్క నిమిషంలో గ్యాస్ రీఫిల్ ఆర్డర్ చేయవచ్చు. ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్‌పీ ఇలా ఏదైనా సరే.. వాట్సాప్ నుంచి మిస్డ్ కాల్ వరకు గ్యాస్‌ను ఈజీగా బుక్ చేసుకోవచ్చు.

Gas Cylinder: జస్ట్ ఒక్క మిస్డ్ కాల్‌తో ఇంటికే గ్యాస్ సిలిండర్.. ఇవి పక్కా తెలుసుకోండి..
How To Book Lpg Gas Cylinder Online

Updated on: Mar 12, 2026 | 5:27 PM

ఒకప్పుడు గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే గ్యాస్ ఏజెన్సీ చుట్టూ తిరగాలి లేదా గంటల తరబడి ఫోన్ లైన్ కోసం వేచి చూడాలి. కానీ ఇప్పుడు రోజులు మారాయి. వినియోగదారుల సౌకర్యార్థం దేశంలోని ప్రముఖ గ్యాస్ కంపెనీలైన ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ బుకింగ్ ప్రక్రియను అత్యంత సులభతరం చేశాయి. కేవలం ఒక మిస్డ్ కాల్ లేదా వాట్సాప్ మెసేజ్‌తో మీ సిలిండర్ ఇంటికి వస్తుంది. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివిధ మార్గాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండేన్ గ్యాస్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తన వినియోగదారుల కోసం అత్యాధునిక సేవలను అందిస్తోంది.

IVRS, SMS బుకింగ్: 77189 55555 నంబర్‌కు కాల్ చేసి మీ రిజిస్టర్డ్ మొబైల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

వాట్సాప్ : 75888 88824 నంబర్‌కు REFILL అని మెసేజ్ పంపండి.

మిస్డ్ కాల్: 84549 55555 కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు.

హెల్ప్‌లైన్: 1800 2333 555.

భారత్ గ్యాస్

భారత్ పెట్రోలియం తన కస్టమర్ల కోసం హలో BPCL యాప్‌తో పాటు ఇతర సేవలను అందిస్తోంది.

IVRS నంబర్లు: 77150 12345 లేదా 77180 12345.

వాట్సాప్: 1800 224 344 నంబర్ ద్వారా బుకింగ్ సులభం.

మొబైల్ యాప్: Hello BPCL యాప్ ద్వారా చెల్లింపులు కూడా చేయవచ్చు.

హెచ్‌పీ గ్యాస్

హిందూస్తాన్ పెట్రోలియం HP Anytime సేవ ద్వారా కస్టమర్లకు చేరువలో ఉంది.

బుకింగ్ కాల్: 77189 55555.

వాట్సాప్: 92222 01122 నంబర్‌కు మెసేజ్ చేయండి.

మిస్డ్ కాల్: 94936 02222.

హెల్ప్‌లైన్: 1800 233 3555.

గమనించాల్సిన ముఖ్య విషయాలు..

అధికారిక నంబర్లు లేదా మొబైల్ యాప్‌ల ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోండి. తెలియని లింక్‌లను క్లిక్ చేసి మోసపోకండి. ఒకవేళ గ్యాస్ లీకేజీ లేదా మరేదైనా ప్రమాదం జరిగితే వెంటనే జాతీయ అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ 1906కు డయల్ చేయండి. డిజిటల్ సేవలు అందుబాటులోకి రావడంతో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా మొబైల్ ఫోన్ ద్వారా నిమిషాల్లో గ్యాస్ రీఫిల్ ఆర్డర్ చేయగలుగుతున్నారు.

Follow Us