
మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్‌తో పాటు రూ.550కే గ్యాస్ సిలిండర్ అందిస్తోంది. మీరు ఈ పథకంలో అర్హులుగా ఉంటే గ్యాస్ కనెక్షన్ ఉచితంగా అందిస్తారు. బయట డిస్ట్రిబ్యూటర్లు గ్యాస్ కనెక్షన్ కోసం రిజిస్ట్రేషన్ ఛార్జీలు లాంటివి వసూలు చేశారు. కానీ ఈ పథకం ద్వారా ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ పొందవచ్చు. ఇక ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ రూ.వెయ్యి వరకు ఉండగా. ఈ పథకంలో చేరితే కేవలం రూ.550కే గ్యాస్ సిలిండర్ అందుతుంది. కనెక్షన్ తీసుకునేటప్పుడు తొలి సిలిండర్ ఉచితంగా అందిస్తారు. ఇక గ్యాస్ సిలిండర్ల రీఫిల్‌పై కేంద్రం రాయితీ సౌకర్యం కల్పిస్తోంది. అసలు ఈ పథకంలో ఎలా చేరాలి..? దరఖాస్తు విధానం ఏంటి..? ఎన్ని సిలిండర్లు పొందవచ్చు? అనే విషయాలు తెలుసుకుందాం.
ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకాన్ని మే 1,2016లో ప్రధాని మోదీ స్వయంగా ప్రారంభించారు. యూపీలోని బల్లియాలో పథకం లాంచ్ చేశారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 12 కోట్లకుపైగా కుటుంబాలకు లబ్ది చేకూర్చారు. తొలి దశలో 10 కోట్ల కనెక్షన్లు ఇవ్వగా.. రెండో విడతలో 2.34 కోట్ల కనెక్షన్ మంజూరు చేశారు.
-కేవలం మహిళలు మాత్రమే అర్హులు
-మహిళ పేరుపై కనెక్షన్ తీసుకోవాలి
-వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి
-షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందినవారై ఉండాలి
-రేషన్ కార్డు కలిగి ఉండాలి
-ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లబ్ది పొంది ఉండాలి
-అంత్యోదయ అన్న యోజన లబ్దిదారులై ఉండాలి
-14 పాయింట్ల డిక్లరేషన్ తప్పనిసరి
ఆధార్ కార్డ్, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో
-https://pmuy.gov.in/index.aspx వెబ్ సైట్ ఓపెన్ చేయండి
-అప్లై ఫర్ న్యూ ఉజ్వల 2.0 కనెక్షన్ ఆప్షన్‌ను ఎంచుకోండి
-ఏ గ్యాస్ కంపెనీ నుంచి తీసుకోవాలనుకుంటున్నారో దానిపై క్లిక్ చేయండి
-ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ కంపెనీల నుంచి పొందవచ్చు
-మీ పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ వివరాలతో గ్యాస్ ఏజెన్సీలో రిజిస్ట్రేషన్ చేసుకోండి
-ఆ తర్వాత మొబైల్ నెంబర్, పాస్ వర్డ్‌తో లాగిన్ అవ్వండి
-స్టేట్, జిల్లా, పిన్ కోడ్, ఏజెన్సీ పేరును ఎంచుకోండి
-ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయండి
-రేషన్ కార్డ్, కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయండి
-ఏ సిలిండర్ కావాలో ఎంచుకోండి
-బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ నమోదు చేయండి
-దరఖాస్తు ఫారంను ప్రింటవుట్ తీసుకుని గ్యాస్ ఏజెన్సీకి వెళ్లండి