
ఈ రోజుల్లో ధనవంతులు కావాలంటే అందరికి సాధ్యం కాకపోవచ్చు. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు ధనవంతులు కావాలంటే కష్టమైన పని అనుకుంటారు. కానీ కొన్ని ట్రిక్స్ పాటించడం వల్ల మధ్య తరగతి ప్రజలు కూడా ధనవంతులు కావచ్చని జెరోధా సహ వ్యవస్థాపకుడు, CEO నితిన్ కామత్ సలహా ఇస్తున్నారు. అందుకు కొన్ని మార్గాలను అనుసరించాల్సి ఉంటుందని చెప్పారాయన. ధనవంతులు కావడానికి ఎలాంటి సత్వరమార్గం లేదు. మీరు ధనవంతులు కావాలనుకుంటే ఓపికగా, క్రమశిక్షణతో ఉండండి. అనవసర ఖర్చులు తగ్గించుకోండి.. పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. అత్యవసర, ఆరోగ్య నిధిని సృష్టించుకోండి. మీ జీతం ఖర్చు చేయడానికి బదులుగా పొదుపు, పెట్టుబడులకు ఉపయోగించండని సలహా ఇస్తున్నారు.
కామత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ లో ఒక పోస్ట్ చేశారు. “ప్రజలు తరచుగా నన్ను స్టాక్ టిప్స్ లేదా వారిని ధనవంతులుగా చేసే విషయాలను అడుగుతారు. కానీ నిజం ఏమిటంటే ధనవంతులు కావడానికి ఎలాంటి సత్వరమార్గం లేదు. దీనికి మంచి అలవాట్లు, ఓర్పు అవసరం. ప్రజలు అవసరం లేని వస్తువులను కొనకూడదని, ముఖ్యంగా రుణాలు తీసుకొని కొనకూడదని ఆయన అన్నారు. మధ్యతరగతి ఉచ్చు అనేది ప్రజలను బయటపడటం కష్టతరమైన పరిస్థితిలో చిక్కుకుపోయేలా చేస్తుందని కూడా ఆయన అన్నారు. కొన్ని పొరపాట్ల చేయడం కారణంగా అప్పుల్లో కూరుకుపోవచ్చనేది ఆయన అభిప్రాయం.
కష్టపడి పనిచేయండి.. ఉద్యోగం సంపాదించండి. అయితే అనవసరమైన రుణం తీసుకోవాలని ఇబ్బందులు పడకండి.. ఆడంబరమైన వస్తువులపై డబ్బును వృధా చేయకండని సూచించారు. ఇలాంటి విషయాలలో డబ్బును వృధా చేసి అప్పుల్లో చిక్కుకుంటారని చెబుతున్నారు. దీనిపై వీడియోను కూడా కామత్ పంచుకున్నారు.
I often get asked for a stock tip, something that will make people rich. 😬
Unfortunately, there are no shortcuts to getting rich. It takes good habits and patience. Things like buying stuff you don’t need, or worse, borrowing to buy them. The other big one is not having health… pic.twitter.com/qWYaDuhZKe
— Nithin Kamath (@Nithin0dha) April 10, 2025
1. మీ ఖర్చులను తగ్గించుకుని పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. మీ నెలవారీ ఖర్చులను రాయండి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని, అందులో కేవలం 1% తీసుకొని ఇండెక్స్ ఫండ్ లాంటి సాధనంలో పెట్టుబడి పెట్టండి.
2. అత్యవసర నిధిని సృష్టించండి. కనీసం 6 నెలల ఖర్చులను ఆదా చేసుకోండి. ఉదాహరణకు, మీ నెలవారీ ఖర్చు రూ.30,000 అయితే, మీరు ఉద్యోగం కోల్పోయినప్పటికీ హాయిగా జీవించడానికి రూ.1.8 లక్షలు ఆదా చేయండి.
3. ఆరోగ్య బీమా తీసుకోవాలని నిర్ధారించుకోండి. ఈ రోజుల్లో ఆసుపత్రి బిల్లులు విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి ఆరోగ్య బీమా లేకుండా రిస్క్ తీసుకోకండి.
4. దురాశ వద్దు. క్రమశిక్షణతో ఉండండి. త్వరిత రాబడి కోసం డబ్బు వృధా చేయకండి. క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టండి. కాలక్రమేణా డబ్బు పెరగనివ్వండి.
ఇది కూడా చదవండి: Gold Price Today: తగ్గేదిలే అంటున్న బంగారం, వెండి ధరలు.. తులం ధర ఎంత? ఇక కొనడం కష్టమేనా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి