Tax On Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నారా.. అయితే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది..

|

Mar 17, 2022 | 7:53 PM

మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడిపై వచ్చే లాభాలపై ట్యాక్స్ ఉంటుందని మీకు తెలుసా.. ఒక్కో ఫండ్‌ ఒక్కో విధంగా పన్ను విధిస్తారని తెలుసా..

Tax On Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నారా.. అయితే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది..
Follow us on

మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడిపై వచ్చే లాభాలపై ట్యాక్స్ ఉంటుందని మీకు తెలుసా.. ఒక్కో ఫండ్‌ ఒక్కో విధంగా పన్ను విధిస్తారని తెలుసా.. ఇవి తెలియకపోతే తెసుకుందాం రండి.. ట్యాక్స్ ఈక్విటీ ఫండ్స్ ఒక రకంగా.. డెట్‌ ఫండ్లకు మరో రకంగా ఉంటుంది. ముందుగా ఈక్విటీ ఫండ్ అంటే ఏమిటో చూద్దాం.. కనీసం 65 శాతం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్‌ని ఈక్విటీ ఫండ్స్ అంటారు. ఈక్విటీ ఫండ్ల యూనిట్లను ఒక సంవత్సరం లోపు సేల్ చేస్తే, దానిపై వచ్చే రాబడిని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎస్‌టీసీజీ) అంటారు. ఈ రాబడిపై 15 శాతం టాక్స్ + నాలుగు శాతం సెస్ విధిస్తారు. అదేవిధంగా ఒక సంవత్సరం తర్వాత ఈక్విటీ ఫండ్ యూనిట్లను విక్రయించడం ద్వారా వచ్చే లాభాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (LTCG) అంటారు. ఈక్విటీ ఫండ్స్‌లో దీర్ఘకాలిక మూలధన లాభాలపై 10 శాతం పన్ను, 4 శాతం సెస్ విధిస్తారు. అయితే పెట్టుబడిదారుడు ఒకే ఆర్థిక సంవత్సరంలో లక్ష రూపాయల కంటే ఎక్కువ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పొందినప్పుడు మాత్రమే టాక్స్ వర్తిస్తుంది. అంటే రూ. 1 లక్ష వరకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పై టాక్స్ ఉండదు.

బాండ్స్, ఇతర కచ్చితమైన రాబడిని ఇచ్చే వాటిలో పెట్టుబడి పెట్టేవాటిని డెట్ ఫండ్ల్ అంటారు. మూడేళ్లలోపు డెట్‌ ఫండ్‌లోని యూనిట్లను విక్రయిస్తే, స్వల్పకాలిక మూలధన లాభాలపై టాక్స్ వర్తిస్తుంది. పెట్టుబడిదారుడి ఆదాయపు టాక్స్ శ్లాబ్ ప్రకారం ఈ టాక్స్ విధిస్తారు. మూడు సంవత్సరాల తర్వాత డెట్ ఫండ్ల యూనిట్లను విక్రయించడం వలన లాభంపై 20 శాతం స్థిర రేటుతో దీర్ఘకాలిక మూలధన లాభాలపై టాక్స్ విధిస్తారు. ఇది ఇండెక్స్ ప్రయోజనాన్ని కూడా కలిగి ఉంది.

హైబ్రిడ్ ఫండ్స్‌లో పెట్టుబడులపై టాక్స్

హైబ్రిడ్ లేదా బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌పై మూలధన లాభాల టాక్స్ ఈక్విటీ పెట్టుబడి కేటాయింపుపై ఆధారపడి ఉంటుంది. ఈక్విటీలో పెట్టుబడి 65 శాతం కంటే ఎక్కువ ఉంటే, ఈక్విటీ ఫండ్‌పై విధించే టాక్స్ విధిస్తారు. ఈక్విటీలో 65 శాతం కంటే తక్కువ పెట్టుబడి పెడితే డెట్ ఫండ్‌పై విధించే టాక్స్ విధిస్తారు. అయితే ఇంతకుముందు ఇన్వెస్టర్లు అందుకున్న డివిడెండ్‌పై టాక్స్ విధించలేదు. ఎందుకంటే కంపెనీలు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డిడిటి) చెల్లించేవి. కానీ 2021-22 బడ్జెట్ నుంచి.. మ్యూచువల్ ఫండ్స్ డివిడెండ్లపై కొత్త టాక్స్ నియమం అమల్లోకి వచ్చింది. ఇప్పుడు పెట్టుబడిదారులు అందుకున్న డివిడెండ్‌పై టాక్స్ విధిస్తారు.

Read Also.. Explained: త్వరలో గుడ్‌న్యూస్.. దేశంలో తగ్గనున్న పెట్రో ధరలు.. దీనికి కారణం ఏంటో తెలుసా?