UPI ATM: దేశంలోని మొదటి యూపీఐ ఏటీఎం.. కార్డ్ స్కిమ్మింగ్, మోసగాళ్ళ నుంచి ఎలా రక్షిస్తుంది?

|

Sep 06, 2023 | 2:57 PM

కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణ ఏటీఎం వద్ద డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ని భౌతికంగా ఉపయోగించకుండా కార్డ్ స్కిమ్మింగ్ ప్రమాదాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. కార్డ్ స్కిమ్మింగ్ అనేది కస్టమర్‌లు తమ కార్డ్‌లను ఇన్‌సర్ట్ చేసినప్పుడు కార్డ్ నంబర్‌లు, పిన్‌లతో సహా కార్డ్ సమాచారాన్ని పొందడానికి ఏటీఎంలు లేదా పాయింట్-ఆఫ్-సేల్ టెర్మినల్స్‌లో పరికరాలను అమర్చే ఒక రకమైన మోసం..

UPI ATM: దేశంలోని మొదటి యూపీఐ ఏటీఎం.. కార్డ్ స్కిమ్మింగ్, మోసగాళ్ళ నుంచి ఎలా రక్షిస్తుంది?
Upi Atm
Follow us on

భారతదేశం ఇటీవలి సంవత్సరాలలో ఫిన్‌టెక్ రంగంలో చాలా పురోగతిని సాధిస్తోంది. ప్రపంచ స్థాయిలో భారతదేశం ఈ పరిశ్రమలో అగ్రగామిగా పరిగణించబడటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు వైట్-లేబుల్ యూపీఐ ఏటీఎం (UPI ATM) పేరు కూడా ఈ జాబితాకు జోడించబడింది. ఇది కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణ కోసం రూపొందించబడింది. అంటే కార్డ్ లేకుండా డబ్బు విత్‌డ్రా చేసుకునే సదుపాయం అన్నట్లు. ఈ ఏటీఎం గురించి మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి. అలాగే దాని ప్రయోజనాల గురించి కూడా తెలుసుకుందాం..

హిటాచీ పేమెంట్ సర్వీసెస్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సహకారంతో మోసగాళ్ల ద్వారా కార్డ్ స్కిమ్మింగ్ ప్రమాదాన్ని పూర్తిగా తొలగించడానికి, అలాగే సురక్షితమైన లావాదేవీలను నిర్ధారించడానికి ఈ కొత్త ఆవిష్కరణతో ముందుకు వచ్చింది. అయితే ఈ మధ్య కాలంలో ఏటీఎం మోసాలు పెరిగిపోయిన నేపథ్యంలో సెక్యూరిటీగా ఉండేందుకు చర్యలు చేపడుతోంది ఆర్బీఐ.

కార్డ్ స్కిమ్మింగ్ ప్రమాదాన్ని ఎలా తొలగిస్తారు?

ఇవి కూడా చదవండి
  • కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణ ఏటీఎం వద్ద డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ని భౌతికంగా ఉపయోగించకుండా కార్డ్ స్కిమ్మింగ్ ప్రమాదాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. కార్డ్ స్కిమ్మింగ్ అనేది కస్టమర్‌లు తమ కార్డ్‌లను ఇన్‌సర్ట్ చేసినప్పుడు కార్డ్ నంబర్‌లు, పిన్‌లతో సహా కార్డ్ సమాచారాన్ని పొందడానికి ఏటీఎంలు లేదా పాయింట్-ఆఫ్-సేల్ టెర్మినల్స్‌లో పరికరాలను అమర్చే ఒక రకమైన మోసం.
  • బ్యాంకింగ్ కార్డ్‌లకు పరిమిత ప్రాప్యత ఉన్నవారికి బ్యాంకింగ్ సేవలను అందించడమే తమ అత్యాధునిక మనీ స్పాట్ UPI ATM లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ చెప్పింది యూపీఐ ఏటీఎం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రూపొందించారు. ఇది లెగసీ లావాదేవీల ప్రాసెసింగ్, ఏటీఎం మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ల నుంచి అభివృద్ధి చెందిన సాంకేతికతతో అధునాతన పరిష్కారాల కోసం మార్గాన్ని సూచిస్తుంది. 3,000 ఏటీఎం స్థానాల్లో కార్డ్‌లెస్ నగదును అందించే ఏకైక వైట్ లేబుల్ ఏటీఏం ఆపరేటర్ హిటాచీ పేమెంట్ సర్వీసెస్.
  • హిటాచీ పేమెంట్ సర్వీసెస్ క్యాష్ బిజినెస్ ఎండీ, సీఈవో సుమిల్ వికాంసి, దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న చెల్లింపు మోడ్‌గా యూపీఐ ప్రాముఖ్యతను హైలైట్ చేసారు. ఇది డిజిటల్ లావాదేవీల వాల్యూమ్‌లలో 50 శాతానికి పైగా వాటాను కలిగి ఉందని TOI నివేదించింది.
  • హిటాచీ పేమెంట్ సర్వీసెస్ ఏటీఎం సేవలు, నగదు రీసైక్లింగ్ మెషీన్లు, వైట్ లేబుల్ ఏటీఎం, పీఓఎస్‌ సొల్యూషన్‌లు, టోల్, ట్రాన్సిట్ సొల్యూషన్స్, పేమెంట్ గేట్‌వే సొల్యూషన్స్ వంటి సేవలను అందిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి