
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన యూపీఐ ఆటోపే వినియోగదారులు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లు, లోన్ ఈఎంఐలు, బీమా ప్రీమియంలు, మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీలు, యుటిలిటీ బిల్లులు వంటి పునరావృత చెల్లింపులను ఆటోమేట్ చేయడానికి అనుమతిస్తుంది. యూపీఐ ఆటోపే అనేది వినియోగదారులు ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం లేదా బీమ్ వంటి యూపీఐ యాప్‌లను ఉపయోగించి ఈ-మాండేట్‌లను సెటప్ చేసుకోవడానికి వీలు కల్పించే ఒక ఫీచర్. ఈ సర్వీసును యాక్టివే చేస్తే మీ బ్యాంక్ ఖాతా నుండి షెడ్యూల్ చేసిన వ్యవధిలో రోజువారీ, వారానికో, నెలవారీ లేదా వ్యాపారి పేర్కొన్న విధంగా ఆటోమెటిక్‌గా సొమ్ము కట్ అవుతుంది.
యూపీఐ ఆటో పే ద్వారా నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ వంటి స్ట్రీమింగ్ సేవలు, నెలవారీ విద్యుత్ లేదా మొబైల్ బిల్లులు, బీమా ప్రీమియంలు లేదా ఈఎంఐలు, మ్యూచువల్ ఫండ్ల కోసం ఎస్ఐపీలు, జిమ్ సభ్యత్వాలు లేదా ట్యూషన్ ఫీజులు వంటి వాటిని సులభంగా చేయవచ్చు.
యూపీఐ ఆటోపే లావాదేవీ అమలు చేసిన తర్వాత దానిని ప్రామాణిక యూపీఐ చెల్లింపుల వలె తిరిగి పొందలేము. చెల్లింపు పొరపాటున లేదా తప్పు వ్యాపారికి జరిగితే మీరు రీఫండ్ కోసం వ్యాపారిని నేరుగా సంప్రదించాలి లేదా మీ యూపీఐ యాప్ లేదా బ్యాంక్ ద్వారా ఫిర్యాదు చేయాలి. సమస్యలను నివారించడానికి మీ పేమెంట్లు క్రమం తప్పకుండా సమీక్షించుకోవడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి