Hyderabad: హైదరాబాద్‎లో ఇల్లు కొనాలంటే ఇదే సరైన సమయం.. రియల్ ఎస్టేట్ రంగంపై సర్వేలో ఆసక్తికర విషయాలు..

|

Dec 10, 2021 | 12:06 PM

సొంత ఇల్లు ఉండాలన్నది అద్దెకు ఉంటున్న ప్రతి ఒక్కరి కల.. ఇందులో కొంత మంది కలను సకారం చేసుకున్నారు. మరికొందరు కలను సకారం చేసుకునే పనిలో పడ్డారు. అయితే వారు వెంటనే ఇళ్లు కొనాలి....

Hyderabad: హైదరాబాద్‎లో ఇల్లు కొనాలంటే ఇదే సరైన సమయం.. రియల్ ఎస్టేట్ రంగంపై సర్వేలో ఆసక్తికర విషయాలు..
Houses
Follow us on

సొంత ఇల్లు ఉండాలన్నది అద్దెకు ఉంటున్న ప్రతి ఒక్కరి కల.. ఇందులో కొంత మంది కలను సకారం చేసుకున్నారు. మరికొందరు కలను సకారం చేసుకునే పనిలో పడ్డారు. అయితే వారు వెంటనే ఇళ్లు కొనాలి. లేకుంటే ధరలు పెరిగే అవకాశం ఉందని ఓ సంస్థ తెలిపింది. దేశీయంగా వచ్చే ఏడాదిలో ఇళ్ల ధరలు 5 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు స్థిరాస్తి కన్సల్టింగ్‌ సేవల సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ పేర్కొంది. కోవిడ్ పరిణామాల వల్ల ఈ ఏడాది నివాస గృహాల ధరల్లో హెచ్చుతగ్గులు అధికంగా కనిపించినా, వచ్చే ఏడాది ధరలు స్థిరంగా ఉండొచ్చని ‘2022 అవుట్‌లుక్‌ రిపోర్ట్‌’ లో ఈ సంస్థ తెలిపింది. ఐటీ కంపెనీల నియామకాలు అధికంగా ఉన్నందున ఆఫీసు స్థలానికి వచ్చే ఏడాది గిరాకీ పెరుగుతుందని నివేదికలో పేర్కొంది.

విశాలంగా, అధునాతన సదుపాయాలు కల ఇళ్లను వినియోగదార్లు ఇష్టపడుతున్నారని నివేదికలో వివరించింది. నిర్మాణ సామగ్రి ధరలు అధికం కావడంతో, ఇళ్ల ధరలు పెరుగుతున్నాయని చెప్పింది. వచ్చే ఏడాదిలో ధరల వృద్ధి 5 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. దేశంలోని 5 అతిపెద్ద ఐటీ కంపెనీలు ఇటీవల కాలంలో 2.60 లక్షల మంది నిపుణులను నియమించుకున్నాయి. వీరంతా కార్యాలయాలకు వస్తే అదనంగా 1.16 కోట్ల చదరపు అడుగుల ఆఫీసు స్థలం కావాల్సి ఉంటుంది.

‘ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌ స్పేస్‌’ కు గిరాకీ పెరిగేదే కానీ తగ్గే అవకాశం లేదని నివేదిక వివరించింది. నాణ్యమైన ఆఫీసు స్థలాన్ని కంపెనీలు, ఉద్యోగులు ఇష్టపడుతున్నందున ఆఫీసు స్థల అద్దెలు స్ధిరంగా ఉండటంతో పాటు పెరిగే అవకాశం లేకపోలేదని పేర్కొంది. ఇ-కామర్స్‌ విస్తరణ వల్ల గోదాము స్థలానికి ఎన్నడూ లేనంత డిమాండ్‌ ఏర్పడింది. దీంతో 2023 నాటికి 4.59 కోట్ల చదరపు అడుగుల గోదాము స్థలం అవసరమని నైట్‌ ఫ్రాంక్‌ అంచనా వేసింది. రీట్‌ (రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌) పెట్టుబడులకు రిటైల్‌ మదుపరులు ఆసక్తి చూపుతున్నందున భారతీయ రియల్‌ ఎస్టేట్‌ రీట్స్‌ మార్కెట్‌ బాగా విస్తరించే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. డేటా కేంద్రాల ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున స్థిరాస్తికి ఈ విభాగం నుంచి గిరాకీ ఇంకా పెరుగుతుందని అంచనా వేసింది. నైట్ ఫ్రాంక్ హోమ్‌బ్యూయర్స్ సర్వే 2021 ప్రకారం 61 శాతం మంది రాబోయే 12 నెలల్లో ధరల పెరుగుదలను ఆశిస్తున్నారు.

Read Also.. Credit Suisse: వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 9 శాతంగా ఉండొచ్చు.. స్విస్ బ్రోకరేజ్ సంస్థ క్రెడిట్ సూయిస్ అంచనా..