అన్ని రంగాలలో ఆఫర్ల జాతర నడుస్తోంది. ఆన్ లైన్ వెబ్ సైట్లు, ఆఫ్ లైన్ స్టోర్లలో కూడా ఫెస్టివ్ సీజన్ పేరుతో పలు రకాల డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లు కనీవినీ ఎరుగని డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా కూడా తన సెడాన్ మోడల్ కార్లపై భారీ తగ్గింపు ఆఫర్లను ప్రకటించింది. హోండా సిటీ ఐదో జనరేషన్, హోండా అమేజ్ కార్లపై రూ. 75,000 వరకూ డిస్కౌంట్ ను అందిస్తోంది. మీరు ఒకవేళ సెడాన్ కారును కనుక కొనుగోలు చేయాలని భావిస్తే ఇదే మంచి తరుణం. జపనీస్ కార్ మేకర్ అయిన హోండా ఈ సిటీ, అమేజ్ కార్లపై అక్టోబర్ చివరి వరకూ ఆఫర్లను కొనసాగిస్తోంది. అయితే ఇటీవల లాంచ్ అయిన హోండా ఎలివేట్ ఎస్ యూవీ కారుపై మాత్రం ఎటువంటి ఆఫర్లు ఈ నెలలో ఉండవని హోండా ప్రకటించింది. ఈ హోండా ఎలివేట్ ఎస్ యూవీ ధర రూ. 11లక్షలు(ఎక్స్ షోరూం)గా ఉంది.
హోండా సిటీ ఐదో జనరేషన్, హోడా అమేజ్ కార్లపై అందిస్తున్న డిస్కౌంట్లు అక్టోబర్ 31 వరకూ అందుబాటులో ఉంటాయి. ఈ కార్లపై డిస్కౌంట్లు క్యాష్ బ్యాక్స్, ఉచిత యాక్సెసరీస్, ఎక్స్ చేంజ్ బోనస్ తోపాటు కార్పొరేట్ బోనస్ కలిపి ఉంటాయి.
హోండా సిటీ కారుపై ఆఫర్.. ఈ కారు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి సమయం. ఈ నెలాఖరు వరకూ డిస్కౌంట్ ధరలు అందుబాటులో ఉంటాయి. కారు తయారీదారు చెబుతున్న దాని ప్రకారం ఈ ఐదో జనరేషన్ సిటీ సెడాన్ కారు ప్రారంభ ధర రూ. 11.63 లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుంది. దీనిపై డైరెక్ట్ క్యాష్ డిస్కౌంట్ రూ. 25,000 ఉంటుంది. లేదా రూ. 26,947 విలువైన యాక్సెసరీస్ ఉచితంగా అందిస్తారు. అంతేకాక లాయల్టీ బోనస్ కింద రూ. 4,000 వరకూ ఇస్తారు. ఒకవేళ పాత కారు ఎక్స్ చేంజ్ చేస్తే.. తగిన విధంగా తగ్గింపు ఉంటుంది. ఎక్స్ చేంజ్ బోనస్ కింద రూ. 6,000 తగ్గింపు లభిస్తుంది. అలాగే ఎక్స్ చేంజ్ ప్రయోజనాలు రూ. 15,000 వరకూ ఉంటాయి. అంతేకాక రెండు రకాల కార్పొరేట్ డిస్కౌంట్ ప్యాకేజెస్ కూడా అందుబాటులో ఉంటాయి. స్టాండర్డ్ డిస్కౌంట్ రూ. 5,000కాగా స్పెషల్ కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 20,000 విలువైన ప్రయోజనాలు అందిస్తారు.
హోండా అమేజ్ కారుపై ఆఫర్.. ఈకారును అక్టోబర్ మాసంలో మీరు కొనుగోలు చేయాలనుకుంటే రూ. 57,000 వరకూ వివధ రకాల డిస్కౌంట్ల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. ఈ కారు తయారీ దారు క్యాష్, కార్పొరేట్ డిస్కౌంట్లతో పాటు లాయల్టీ బోనస్ కూడా అందిస్తోంది. అలాగే స్పెషల్ కార్పొరేట్ డిస్కౌంట్లు, ఎక్స్ చేంజ్ బోనస్ కూడా ఇస్తోంది. ఈ అమేజ్ కారును మీరు కొనుగోలు చేస్తే రూ. 15,000 తగ్గింపును పొందొచ్చు. లేదా రూ. 18,147 విలువైన యాక్సెసరీస్ ను ఉచితంగా పొందొచ్చు. అలాగే లాయల్టీ బోనస్ కింద రూ. 4,000, కార్పొరేట్ బోనస్ డిస్కౌంట్ కింద రూ. 3,000 తగ్గింపు లభిస్తుంది. స్పెషల్ కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ. 20,000 విలువైన వివిధ ప్రయోజనాలు పొందొచ్చు. ఈ హోండా కారుపై ఎక్స్ చేంజ్ బోనస్ కింద రూ. 15,000 వరకూ తగ్గింపు లభిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..