Honda Activa 7G: హోండా యాక్టివా 7జీ వచ్చేస్తోంది.. మైలేజ్‌ ఎంతో తెలిస్తే స్టన్ అవ్వాల్సిందే

|

Oct 15, 2024 | 7:24 AM

దేశీయ మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు జరుపుకున్న స్కూటీగా ఘనత సాధించిన హోండా కంపెనీ వచ్చే ఏడాది మొదటి భాగంలో యాక్టీవా 7జీ లాంచ్ చేసేందుకు సిద్దమవుతోంది. అయితే డిసెంబర్‌లోనే ఈ స్కూటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంతా భావిస్తున్నారు. అయితే కంపెనీ ఈ స్కూటర్‌ లాంచింగ్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి...

Honda Activa 7G: హోండా యాక్టివా 7జీ వచ్చేస్తోంది.. మైలేజ్‌ ఎంతో తెలిస్తే స్టన్ అవ్వాల్సిందే
Honda 7g
Follow us on

ప్రస్తుతం భారత్‌లో బైక్‌లకు సమానంగా, మాటకొస్తే బైక్‌లతో పోటీపడీ మరీ స్కూటీల అమ్మకాలు జరుగుతున్నాయి. కేవలం పెద్దలే కాకుండా యువత కూడా స్కూటీలను కొనుగోలు చేస్తున్నాయి. స్కూటర్ల విభాంగా హోండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. హోండా యాక్టీవా స్కూటర్‌కు దక్కిన ఆదరణ దానికి సాక్ష్యంగా చెప్పొచ్చు. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి హోండా నుంచి యాక్టీవా 7జీ వచ్చేస్తోంది.

దేశీయ మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు జరుపుకున్న స్కూటీగా ఘనత సాధించిన హోండా కంపెనీ వచ్చే ఏడాది మొదటి భాగంలో యాక్టీవా 7జీ లాంచ్ చేసేందుకు సిద్దమవుతోంది. అయితే డిసెంబర్‌లోనే ఈ స్కూటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంతా భావిస్తున్నారు. అయితే కంపెనీ ఈ స్కూటర్‌ లాంచింగ్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ప్రస్తుతం ఈ స్కూటీ ఫీచర్లకు సంబంధించి కొన్ని వార్తలు వస్తున్నాయి. వీటి ప్రకారం ఈ స్కూటీలో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత ఉండనుంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

7జీలో అధునాతన టెక్నాలజీకి పెద్ద పీట వేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే డిజిటల్‌ స్క్రీన్‌, మొబైల్‌ కనెక్టివిటీ, యూఎస్‌బీ ఛార్జర్‌ను అందించనున్నారు. ఇక ఈ స్కూటీలో ఎల్‌ఈడీ లైట్స్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. కారుల్లో ఉన్న పుష్‌ బటన్ స్టార్ట్ ఫీచర్‌ను ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ స్కూటీలో సైలెంట్ స్టార్ట్‌ వంటి అధునాతన ఫీచర్‌ను ఇచ్చే అవకావం ఉందని తెలుస్తోంది. అలాయ్‌ వీల్స్‌తో ఈ స్కూటర్‌ను తీసుకొస్తున్నారు.

ఇక మైలేజ్‌కు ఇందులో పెద్ద పీట వేసినట్లు స్పష్టమవుతోంది. ఒక లీటర్‌కు ఈ స్కూటర్ ఏకంగా 55 నుంచి 60 కి.మీల మైలేజ్‌ ఇవ్వనుందని తెలుస్తోంది. ఇక ధర పరంగా చూస్తే హోండా యాక్టివీ ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ. 90 వేల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఈ స్కూటీకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని కంపెనీ అంచనా వేస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..