
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా 350 సిసి కంటే తక్కువ సామర్థ్యం కలిగిన మోటార్‌సైకిళ్లు, స్కూటర్‌లపై పూర్తి GST ప్రయోజనాలను తన కస్టమర్లకు బదిలీ చేస్తామని ప్రకటించింది . ఈ ప్రకటన సమయంలో హోండా CB300R ఈ జాబితాలో చేర్చలేదు. కానీ కంపెనీ ఇప్పుడు దాని అధికారిక వెబ్‌సైట్‌లో దాని ధరలను సవరించింది. కొత్త ధరల ప్రకారం.. హోండా CB300R ఎక్స్-షోరూమ్ ధర రూ.2.40 లక్షల నుండి రూ.2.19 లక్షలకు తగ్గించింది. ఇది మొత్తం రూ.21,000 వరకు తగ్గించింది.
ఇది కూడా చదవండి: Bank Holidays: వినియోగదారులకు అలర్ట్.. అక్టోబర్‌లో 20 రోజుల పాటు బ్యాంకులు బంద్
ఇది ఇప్పుడు KTM 250 డ్యూక్ (రూ. 2.12 లక్షలు), ట్రయంఫ్ స్పీడ్ 400 ( రూ . 2.50 లక్షలు ), TVS అపాచీ RTR 310 ( రూ. 2.21 లక్షల నుండి 2.87 లక్షలు) వంటి బైక్‌లతో పోటీపడుతుంది. ఈ బైక్‌కు శక్తినిచ్చేది 286cc. సింగిల్-సిలిండర్ , DOHC , లిక్విడ్-కూల్డ్ ఇంజిన్. ఇది 31 హార్స్‌పవర్, 27.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6 -స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
హోండా CB300R ధర
CB300R ప్రారంభంలో రూ.2.77 లక్షల వద్ద ప్రారంభమైంది. భారతదేశంలో ఉత్పత్తి పెరగడంతో ధర రూ.2.40 లక్షలకు తగ్గించింది. ఇప్పుడు సవరించిన GST రేటు తర్వాత రూ.2.19 లక్షలకు చేరింది.
హోండా CB300R డిజైన్
హోండా CB 300R నియో స్పోర్ట్స్ కేఫ్ డిజైన్‌తో కూడిన ఛాసిస్ , డ్యూయల్ -ఛానల్ ABS , అసిస్ట్, స్లిప్పర్ క్లచ్ , పూర్తిగా డిజిటల్ LCD ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, మెరుగైన నియంత్రణ కోసం అప్‌సైడ్-డౌన్ ఫ్రంట్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది .
హోండా CB300R
CB300R ధర తగ్గింపును పొందినప్పటికీ NX500, రెబెల్ 500, CBR650R వంటి ఇతర హోండా బిగ్‌వింగ్ మోడళ్ల ధరలు GST సవరణ తర్వాత స్వల్పంగా పెరిగాయి.
ఇది కూడా చదవండి: Bike Prices: గుడ్‌న్యూస్.. జీఎస్టీ తగ్గింపు తర్వాత ఈ బైక్‌లపై భారీ తగ్గింపు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి