
ప్రతీఒక్కరి ఇంట్లో విద్యుత్ అనేది చాలా ముఖ్యం. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఎలక్ట్రిక్ పరికరాలకు ఛార్జింగ్ వరకు కరెంట్ అవసరం. ఇంటికి విద్యుత్ సరఫరా లేకపోతే ఎలాంటి పనులు చేయలేము. దీంతో ప్రజలకు ఇది ఒక ప్రాధమిక అవసరంగా మారిపోయింది. ప్రస్తుతం సామాన్యుల ఇళ్లల్లో కూడా ఫ్రిడ్జ్, ఏసీ, కూలర్, టీవీ, వాషింగ్ మెషిన్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటున్నాయి. దీంతో కరెంట్ బిల్లు అనేది ఎక్కువగా వస్తోంది. అయితే కొన్నిసార్లు తక్కువగా వాడినా కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందనే అనుమానం చాలామందిని వేధిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. తాము కరెంట్ తక్కువగా వాడినా బిల్లు ఎక్కువగా వస్తుందని దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఈ నెంబర్ల ద్వారా కంప్లైంట్ చేయవచ్చు. దీంతో అధికారులు పరిశీలించి మీ సమస్యను పరిష్కరిస్తారు. ఎలా కంప్లైంట్ చేయాలనేది చూద్దాం.
కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందనే డౌట్ మీకు ఉంటే 1912 హెల్ప్ లైన్ నెంబర్‌కు కాల్ చేయాలి. దీంతో పాటు నేషనల్ కన్జూమర్ హెల్ప్ లైన్ నెంబర్‌కు వాట్సప్‌లో మెస్సేజ్ ద్వారా కూడా ఫిర్యాదు చేసే అవకాశముంది. ఇందుకోసం 8800001915 నెంబర్‌కు వాట్సప్‌లో హాయ్ అని మెస్సేజ్ పెట్టండి. ఆ తర్వాత మీ భాషను ఎంచుకుని రిజిస్టర్ కంప్లైంట్ ఆప్షన్ ఎంచుకోండి. మీ విద్యుత్ కనెక్షన్ నెంబర్, బిల్లు వివరాలు, ఇతర డీటైల్స్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత రిఫరెన్స్ నెంబర్ సేవ్ చేసుకోండి. దీని ఆధారంగా మీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అధికారులు పరిశీలించి మీ బిల్లు కరెక్ట్‌గానే వచ్చిందా.. లేదా ఏదైనా తప్పుగా వచ్చిందా అనేది చెబుతారు.
కొన్నిపార్లు కరెంట్ బిల్లులో సాంకేతిక సమస్యల వల్ల తప్పుగా బిల్లు రావచ్చు. కొన్ని పరిస్థితుల్లో పొరపాట్లు వల్ల బిల్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో ఈ హెల్ప్ లైన్ నెంబర్ల ద్వారా మీరు ఇంటి వద్ద నుంచే మొబైల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఒకవేళ బిల్లు తప్పుగా ముద్రిస్తే రివైజ్ చేసి మళ్లీ జారీ చేస్తారు. ఫిర్యాదు చేసిన మూడు నుంచి 7 రోజుల్లోపు విద్యుత్ అధికారులు మీ ఇంటికి వచ్చి మీటర్‌ను పరిశీలిస్తారు. మీటర్‌లో ఏదైనా టెక్నికల్ సమస్య ఉంటే సరిచేస్తారు. ఈ హెల్ప్ లైన్ నెంబర్లు అనేది దేశవ్యా్ప్తంగా అందుబాటులోకి ఉంటాయి. 24 గంటల పాటు ఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చు.