Study Loan: బ్యాంకు అధికారులకు హైకోర్టు షాక్.. ఆ విద్యార్థికి షరతులు లేకుండా విద్యా రుణం ఇవ్వాల్సిందే..!

మన దేశంలో వివిధ రుణాల మంజూరులో బ్యాంకులు కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా పేద విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించేలా విద్యా రుణాలను అందిస్తూ ఉంటాయి. ఈ విద్యా రుణాలను సంబంధిత విద్యార్థి చదువు పూర్తయ్యి ఉద్యోగంలో చేరాక తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొందరు తలతిక్క బ్యాంకు అధికారులు ఈ రుణాల మంజూరులో నిబంధనల వంకతో విద్యార్థులను ఇబ్బందిపెడుతూ ఉంటారు.

Study Loan: బ్యాంకు అధికారులకు హైకోర్టు షాక్.. ఆ విద్యార్థికి షరతులు లేకుండా విద్యా రుణం ఇవ్వాల్సిందే..!
Loan For Higher Education
Follow us

|

Updated on: Aug 04, 2024 | 8:39 PM

మన దేశంలో వివిధ రుణాల మంజూరులో బ్యాంకులు కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా పేద విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించేలా విద్యా రుణాలను అందిస్తూ ఉంటాయి. ఈ విద్యా రుణాలను సంబంధిత విద్యార్థి చదువు పూర్తయ్యి ఉద్యోగంలో చేరాక తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొందరు తలతిక్క బ్యాంకు అధికారులు ఈ రుణాల మంజూరులో నిబంధనల వంకతో విద్యార్థులను ఇబ్బందిపెడుతూ ఉంటారు. వారి చర్యలు బ్యాంకులకు కూడా ఇబ్బందులను తెచ్చిపెడతాయి. విద్యా రుణం మంజూరుకు కొర్రీలు పెట్టిన అధికారి ఒకరు ఎట్టకేలకు రుణం మంజూరు చేసినా కొన్ని షరతులు విధించారు. ఆ షరతులపై ఓ సంస్థ హైకోర్టును ఆదేశించడంతో కోర్టు బ్యాంకుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. ఈ విషయం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ విద్యార్ధికి విద్యా రుణం మంజూరు చేయడానికి ముందస్తు షరతును మినహాయించాలని తెన్కాసి జిల్లాలోని ఒక బ్యాంకును ఆదేశించింది. కన్యాకుమారి జిల్లాలోని శ్రీ రామకృష్ణ మెడికల్ కాలేజ్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ విద్యార్థి 2020లో తెన్కాసి జిల్లాలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో విద్యాజ్యోతి ఎడ్యుకేషన్ లోన్ కింద విద్యా రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే రుణం మంజూరు విషయంలో బ్యాంకు అధికారులు కొర్రీలు పెడుతూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్థికంగా పేద కుటుంబాలకు చెందిన అర్హులైన విద్యార్థులకు విద్యా రుణాలు మంజూరు చేయలేదని బ్యాంకు మేనేజర్‌కు వ్యతిరేకంగా స్థానికంగా ఓ స్వచ్ఛంద సంస్థ పోస్టర్లు అంటించింది. ముఖ్యంగా పిటిషనర్ తండ్రి ఎన్జీఓలో ఆఫీస్ బేరర్‌గా ఉండేవారు. అయితే ఎట్టకేలకు 2021లో బ్యాంక్ పిటిషనర్‌కు రుణ మంజూరు ఉత్తర్వులను ఇస్తూ కొన్ని ప్రీ-రిలీజ్ షరతులు విధించింది. 

బ్యాంకుకు వ్యతిరేకంగా పోస్టర్లు అంటించినందుకు క్షమాపణలు చెప్పాలని స్పష్టం చేయడంతో బ్యాంకు ఆదేశాలపై విద్యార్థి కోర్టును ఆశ్రయించింది.అయితే  పిటీషన్ విచారణ సందర్భంగా రుణం మంజూరు చేయని బ్యాంకు అధికారులు లేదా బ్యాంకుపై నిరసన తెలపడం ప్రాథమిక హక్కు అని కోర్టు వ్యాఖ్యానించింది. దీన్ని పరువు నష్టం కలిగించేలా చూడలేమని జస్టిస్ కె. మురళీ శంకర్ అభిప్రాయపడ్డారు. పోస్టర్‌ను అతికించడం, హ్యాండ్‌బిల్స్‌ పంపిణీ చేయడం నిరసనగా గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. అయితే నిరసన పేరుతో లక్ష్మణరేఖను దాటకూడదని కోర్టు పేర్కొంది. కాబట్టి విద్యార్థి క్షమాపణ చెప్పకుండానే రుణం మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. క్షమాపణ షరతును మినహాయించి రుణం మంజూరు ప్రక్రియను కొనసాగించాలని కోర్టు బ్యాంకును ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

మ‌రిన్ని బిజినెస్ వార్త‌ల కోసం క్లిక్ చేయండి…

బ్యాంకుఅధికారులకు హైకోర్టు షాక్..ఆ విద్యార్థికి లోన్ ఇవ్వాల్సిందే
బ్యాంకుఅధికారులకు హైకోర్టు షాక్..ఆ విద్యార్థికి లోన్ ఇవ్వాల్సిందే
వన్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ బామ్మర్ది మూవీ ఈవెంట్.. ఎప్పుడంటే?
వన్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ బామ్మర్ది మూవీ ఈవెంట్.. ఎప్పుడంటే?
శునకానికి ఘనంగా దినకర్మ చేసిన యజమాని.. నివ్వెరపోయిన స్థానికులు!
శునకానికి ఘనంగా దినకర్మ చేసిన యజమాని.. నివ్వెరపోయిన స్థానికులు!
కొమరంపులితో బొబ్బిలి పులి..
కొమరంపులితో బొబ్బిలి పులి..
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్‌ పని చేయదు.. ఫోన్‌ల జాబితా చూడండి
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్‌ పని చేయదు.. ఫోన్‌ల జాబితా చూడండి
వర్షాకాలంలో ఆ రోగాలు దరిచేరకూడదంటే అరటి పువ్వు తినాల్సిందే!
వర్షాకాలంలో ఆ రోగాలు దరిచేరకూడదంటే అరటి పువ్వు తినాల్సిందే!
టూత్‌పేస్ట్‌లో విషం కలిపి హతం.. గురితప్పని 'మొస్సాద్‌' ఆపరేషన్లు
టూత్‌పేస్ట్‌లో విషం కలిపి హతం.. గురితప్పని 'మొస్సాద్‌' ఆపరేషన్లు
వామ్మో.. ఈ దొంగలు మామూల్లోళ్లు కాదురా స్వామీ..!
వామ్మో.. ఈ దొంగలు మామూల్లోళ్లు కాదురా స్వామీ..!
ఈ బుడ్డోడిని గుర్తుపట్టారా?ప్రాణ గండం నుంచి బయటపడిన టాలీవుడ్ హీరో
ఈ బుడ్డోడిని గుర్తుపట్టారా?ప్రాణ గండం నుంచి బయటపడిన టాలీవుడ్ హీరో
గుర్తుకొస్తున్నాయి.. అంటూ కేంద్ర మంత్రి ఫ్రెండ్ షిప్ డే సందడి!
గుర్తుకొస్తున్నాయి.. అంటూ కేంద్ర మంత్రి ఫ్రెండ్ షిప్ డే సందడి!