Ravi Kiran
04 August 2024
అత్యంత వేగంగా వెళ్లే రైలు, అన్ని సౌకర్యాలున్న రైలు.. అత్యంత దూర ప్రాంతాలకు వెళ్లే రైలు.. ఇలా అన్ని చూసి ఉంటారు. మీరెప్పుడైనా అత్యంత నెమ్మదిగా ప్రయాణించే రైలు గురించి విన్నారా.?
భారతదేశంలో అత్యంత నెమ్మదిగా నడిచే రైలు నీలగిరి మౌంటైన్ రైల్వే. నీలగిరి పర్వతాల గుండా వెళ్లే ఈ రైలును బ్రిటిష్ వారు ప్రారంభించారు.
తమిళనాడులోని నీలగిరి మౌంటైన్ రైల్వేలో కల్లార్, కూనూర్ మధ్య 20 కిలోమీటర్ల వంపు ఆసియాలోనే అత్యంత ఎత్తైన రైలు. ఈ రైలు ఎందుకు నెమ్మదిగా నడుస్తుందంటే..
పర్వతంపై 1.12.28 వాలు ఉంది. రైలు ప్రయాణించే ప్రతి 12.28 అడుగులకు ఒక అడుగు ఎత్తు పెరుగుతుంది. అందుకే దీన్ని భారతదేశంలో అత్యంత నెమ్మదిగా ఉండే రైలు అని కూడా అంటారు.
9 కి.మీ వేగంతో ప్రయాణించే ఈ రైలు ఐదు గంటల వ్యవధిలో 46 కి.మీ కవర్ చేస్తుంది. ఇది మన దేశంలో అత్యంత వేగంగా వెళ్లే రైలు కంటే దాదాపు 16 రేట్లు వెనుకంజ ఉంటుంది.
ఇండియాలో మెట్టుపాళయం నుంచి ఊటీ వరకు నడిచే ఏకైక ర్యాక్ రైల్వే ఇది.ఈ రైలును ఎక్కువగా పర్యాటకులు ఉపయోగిస్తారు. వారు సెలవు దినాలలో ఇక్కడకు సరదాగా గడపడానికి వెళతారు.
నీలగిరి మౌంటైన్ రైల్వే రైలు మెట్టుపాళయంలో మార్నింగ్ 7.10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు ఊటీకి చేరుతుంది. ప్రధాన స్టేషన్లు కూనూర్, వెల్లింగ్టన్, అరవంకాడు, కేతి, లవ్‌డేల్
తిరుగు ప్రయాణంలో రైలు ఊటీ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.35 గంటలకు మెట్టుపాళయం చేరుకుంటుంది.