Eblu FEO X: మార్కెట్‌లో తక్కువ ధరలోనే క్యూటెస్ట్ ఈవీ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు ఏంటంటే..?

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుంది. పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు సామాన్యులు ఈవీలను ఆశ్రయిస్తుంటే, ప్రభుత్వాలు కూడా కాలుష్యం నుంచి రక్షణకు ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు చాలా కంపెనీలు మార్కెట్‌లో ఈవీ వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. మధ్యతరగతి ప్రజలనే టార్గెట్ చేస్తూ స్టార్టప్ ఈవీ కంపెనీలు సూపర్ ఫీచర్లతో తక్కువ ధరలోనే ఈవీలనను అందుబాటులోకి తెస్తున్నాయి.

Eblu FEO X: మార్కెట్‌లో తక్కువ ధరలోనే క్యూటెస్ట్ ఈవీ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు ఏంటంటే..?
Eblu Feo X
Follow us

|

Updated on: Aug 04, 2024 | 5:15 PM

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుంది. పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు సామాన్యులు ఈవీలను ఆశ్రయిస్తుంటే, ప్రభుత్వాలు కూడా కాలుష్యం నుంచి రక్షణకు ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు చాలా కంపెనీలు మార్కెట్‌లో ఈవీ వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. మధ్యతరగతి ప్రజలనే టార్గెట్ చేస్తూ స్టార్టప్ ఈవీ కంపెనీలు సూపర్ ఫీచర్లతో తక్కువ ధరలోనే ఈవీలనను అందుబాటులోకి తెస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ గోదావరి ఎలక్ట్రిక్ మోటర్స్ ఫ్యామిలీ ఈ-స్కూటర్‌కు సంబంధించిన కొత్త వేరియంట్ అయిన ఇబ్లూ ఎఫ్ఈఓ ఎక్స్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. కేవలం రూ.99,999 ఎక్స్-షోరూమ్ ధరతో రిలీజ్ చేసిన ఈ స్కూటర్ కచ్చితంగా మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకుంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇబ్లూ ఎఫ్ఈఓ ఎక్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఇబ్లూ ఎఫ్ఈఓ ఎక్స్ గోదావరి ఎలక్ట్రిక్ మోటర్స్‌కు సంబంధించి రెండో మోడల్ అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇబ్లూ ఎఫ్ఈఓ ఎక్స్ మోడల్ స్కూటర్‌ను మొదటి సారిగా భారత్ గ్లోబల్ మొబిలిటీ ఎక్స్పో 2024 లో ఆవిష్కరించార. ఈ స్కూటర్‌లో 28 లీటర్ల స్టోరేజ్ స్పేస్తో పాటు 2.36 కేడబ్ల్యూ బ్యాటరీతో 110 కిమీ పరిధిని అందిస్తుంది. ఇబ్లూ ఎఫ్ఈఓ ఎక్స్ స్కూటర్ కస్టమర్ల ఫీడ్ బ్యాక్ ఆధారంగా రిలీజ్ చేశామని గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ సీఈఓ హైదర్ ఖాన్ తెలిపారు. ఈ స్కూటర్ రైడర్లకు అత్యుత్తమ సౌకర్యాన్ని అందిస్తుందని వివరిస్తున్నారు. ఈ స్కూటర్‌ను భారతదేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వివరించారు. 

భారతదేశంలో ఇబ్లూ ఎఫ్ఈఓ ఎక్స్ స్కూటర్‌కు సంబంధించిన ప్రీ ఆర్డర్లు తీసుకుంటున్నామని వివరించారు. ముఖ్యంగా గోదావరి ఎలక్ట్రిక్ మోటర్స్ కంపెనీ తన డీలర్ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి ప్రణాళికలను రచిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశవ్యాప్తంగా 74 డీలర్షిప్లను 100 డీలర్లకు పెంచాలని యోచిస్తోంది. గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ ప్రస్తుతం ఇబ్లూ ఎఫ్ఈఓ (ఈ2డబ్ల్యూ), ఇబ్లూ రోజ్ (ఈ3డబ్ల్యూ- ఎల్5ఎం), ఇబ్లూ స్పిన్, ఇబ్లూ థ్రిల్ వంటి ఈ-సైకిళ్లతో సహా అనేక రకాల ఎలక్ట్రిక్ వాహనాలను అమ్మకాలు సాగిస్తుంది. 

ఇవి కూడా చదవండి

మ‌రిన్ని బిజినెస్ వార్త‌ల కోసం క్లిక్ చేయండి…

వయనాడు విలయాన్నిజాతీయ విపత్తుగా ప్రకటించాలని రాహుల్‌ డిమాండ్
వయనాడు విలయాన్నిజాతీయ విపత్తుగా ప్రకటించాలని రాహుల్‌ డిమాండ్
మార్కెట్‌లో తక్కువ ధరలోనే క్యూటెస్ట్ ఈవీ స్కూటర్ లాంచ్..!
మార్కెట్‌లో తక్కువ ధరలోనే క్యూటెస్ట్ ఈవీ స్కూటర్ లాంచ్..!
చోరికి గురైన లారీ.. ఈజీగా పట్టేసిన ఓనర్.. ఎలాగబ్బా..!
చోరికి గురైన లారీ.. ఈజీగా పట్టేసిన ఓనర్.. ఎలాగబ్బా..!
అమెరికాలో పలు కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు
అమెరికాలో పలు కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు
మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు తీసుకోవచ్చో తెలుసా? ఒక్క క్లిక్‌తో
మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు తీసుకోవచ్చో తెలుసా? ఒక్క క్లిక్‌తో
ఆ పోలీస్‌ అభిమానికి బంపర్ ఆఫర్.! అడిగిన వారికి ఇచ్చుడే..!
ఆ పోలీస్‌ అభిమానికి బంపర్ ఆఫర్.! అడిగిన వారికి ఇచ్చుడే..!
కొంపముంచిన సరదా.. సెల్ఫీ తీసుకుంటూ 60 అడుగుల లోయలో పడిన యువతి
కొంపముంచిన సరదా.. సెల్ఫీ తీసుకుంటూ 60 అడుగుల లోయలో పడిన యువతి
ఈఅమ్మాయిని గుర్తు పట్టారా?ఇప్పుడు పిచ్చెక్కించే గ్లామరస్ హీరోయిన్
ఈఅమ్మాయిని గుర్తు పట్టారా?ఇప్పుడు పిచ్చెక్కించే గ్లామరస్ హీరోయిన్
BSNLలో 4G, 5G నెట్‌వర్క్‌ ఎందుకు ఆలస్యం.. కారణాలు చెప్పిన మంత్రి
BSNLలో 4G, 5G నెట్‌వర్క్‌ ఎందుకు ఆలస్యం.. కారణాలు చెప్పిన మంత్రి
స్పీడ్‌గా వెళ్తున్న కంటైనర్ నుంచి గప్పుమన్న వాసన.. తీరా చూస్తే..!
స్పీడ్‌గా వెళ్తున్న కంటైనర్ నుంచి గప్పుమన్న వాసన.. తీరా చూస్తే..!