Watch Video: శునకానికి ఘనంగా దినకర్మ చేసిన యజమాని.. నివ్వెరపోయిన స్థానికులు!

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్ కేంద్రంలోని సీతంపేట రోడ్‌లో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి చేబోతుల రాజు జంతు ప్రేమికుడు. తన ఇంటి ఆవరణలో అహ్లాదకరంగా ఓ పార్కులా నిర్మించుకుని అందులో కుటీరం ఏర్పాటు చేశాడు. ఇందులో సుమారు 50 శునకాలకు ప్రతిరోజు ఆహారం పెడుతున్నాడు. అందులో టైసాన్ అనే ఓ సునకం గత 15 ఏళ్లుగా అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. అయితే టైసాన్..

Watch Video: శునకానికి ఘనంగా దినకర్మ చేసిన యజమాని.. నివ్వెరపోయిన స్థానికులు!
Dasa Dina Kharma Ritual To Pet Dog
Follow us

| Edited By: Srilakshmi C

Updated on: Aug 04, 2024 | 8:20 PM

శ్రీకాకుళం, ఆగస్టు 4: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్ కేంద్రంలోని సీతంపేట రోడ్‌లో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి చేబోతుల రాజు జంతు ప్రేమికుడు. తన ఇంటి ఆవరణలో అహ్లాదకరంగా ఓ పార్కులా నిర్మించుకుని అందులో కుటీరం ఏర్పాటు చేశాడు. ఇందులో సుమారు 50 శునకాలకు ప్రతిరోజు ఆహారం పెడుతున్నాడు. అందులో టైసాన్ అనే ఓ సునకం గత 15 ఏళ్లుగా అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. అయితే టైసాన్ ఇటీవల మరణించింది. తన శునకం మృతి చెందినప్పటి నుంచి రాజు నిద్రాహారాలు మానేసి ఎంతో వ్యధ అనుభవిస్తున్నాడు. తన బాధను ఇతరులకు చెప్పుకోలేక గుండెల్లోనే దాచుకుంటూ కుమిలిపోయాడు. తాజాగా చనిపోయిన శునకానికి దినకర్మ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం 9వ రోజు కావటంతో వందలాది శునకాలను తీసుకువచ్చి వాటికి ఆహారం ఇస్తూ, అలాగే బంధువులు, మిత్రులు సమీప గ్రామాల ప్రజలందరిని పిలిచి అదివారం వేద మంత్రాలతో శునకంకు ఖననం చేసిన చోట దినకర్మ చేశాడు. దీనిని చూసి ప్రతిఒక్కరూ ఔరా అని ముక్కున వేలేసుకున్నారు.

నేటి కాలంలో సొంత తల్లి దండ్రులకే పట్టెడు అన్నం పెట్టలేక అనాధాశ్రమాల్లో, వృద్దాశ్రమాలలో పెడుతున్నటువంటి రోజులలో.. ఇలా పెంపుడు కుక్కను ఇంట్లో కుటుంబ సభ్యుని మాదిరిగా భావించి కర్మ కాండలను నిర్వహించటం అంతటా చర్చనీయాంశం అయింది. కానీ తన తల్లికి ఇచ్చిన మాటను నమ్మి పది మందికి అన్నం పెట్టాలి. మనల్ని నమ్ముకున్న వారికి ఆహారం ఇవ్వాలి అనే మాటకు కట్టుబడి మూగ జీవాలైన సునకాల ఆకలి తీరుస్తున్నానని రాజు అంటున్నాడు.

ఇవి కూడా చదవండి

కరోనా కష్టకాలంలో ప్రజలకు ఆహారం లేని సమయంలో శునకాలు మృతి చెందడం చూసి చలించిన రాజు.. కరోనా సమయంలో వందలాది శునకాలకు తన ఇంట్లోనే ఆహారం వండి పాలకొండ పట్టణంలో వీధుల్లోకి వెళ్లి శునకాలకు అందించాడు. దీంతో అప్పట్లో పాలకొండ పట్టణ ప్రజలందరూ ఆర్మీ రాజు ఔదర్యాన్ని కొనియాడారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

శునకానికి ఘనంగా దినకర్మ చేసిన యజమాని.. నివ్వెరపోయిన స్థానికులు!
శునకానికి ఘనంగా దినకర్మ చేసిన యజమాని.. నివ్వెరపోయిన స్థానికులు!
కొమరంపులితో బొబ్బిలి పులి..
కొమరంపులితో బొబ్బిలి పులి..
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్‌ పని చేయదు.. ఫోన్‌ల జాబితా చూడండి
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్‌ పని చేయదు.. ఫోన్‌ల జాబితా చూడండి
వర్షాకాలంలో ఆ రోగాలు దరిచేరకూడదంటే అరటి పువ్వు తినాల్సిందే!
వర్షాకాలంలో ఆ రోగాలు దరిచేరకూడదంటే అరటి పువ్వు తినాల్సిందే!
టూత్‌పేస్ట్‌లో విషం కలిపి హతం.. గురితప్పని 'మొస్సాద్‌' ఆపరేషన్లు
టూత్‌పేస్ట్‌లో విషం కలిపి హతం.. గురితప్పని 'మొస్సాద్‌' ఆపరేషన్లు
వామ్మో.. ఈ దొంగలు మామూల్లోళ్లు కాదురా స్వామీ..!
వామ్మో.. ఈ దొంగలు మామూల్లోళ్లు కాదురా స్వామీ..!
ఈ బుడ్డోడిని గుర్తుపట్టారా?ప్రాణ గండం నుంచి బయటపడిన టాలీవుడ్ హీరో
ఈ బుడ్డోడిని గుర్తుపట్టారా?ప్రాణ గండం నుంచి బయటపడిన టాలీవుడ్ హీరో
గుర్తుకొస్తున్నాయి.. అంటూ కేంద్ర మంత్రి ఫ్రెండ్ షిప్ డే సందడి!
గుర్తుకొస్తున్నాయి.. అంటూ కేంద్ర మంత్రి ఫ్రెండ్ షిప్ డే సందడి!
మరో రెండు నెలలు ఆ రాశుల వారికి మంచి రోజులు..!
మరో రెండు నెలలు ఆ రాశుల వారికి మంచి రోజులు..!
రాత్రి నిద్రిస్తున్నప్పుడు స్మార్ట్‌ఫోన్‌ను ఎంత దూరంలో ఉంచాలి?
రాత్రి నిద్రిస్తున్నప్పుడు స్మార్ట్‌ఫోన్‌ను ఎంత దూరంలో ఉంచాలి?