04 August 2024
Subhash
అనుకోకుండా క్రెడిట్ కార్డు ఉన్న వ్యక్తి చనిపోతే ఆ క్రెడిట్ కార్డు బిల్లు ఎవరు చెల్లించాలనే అనుమానం మీకెప్పుడైనా వచ్చిందా..?
అయితే చాలా మంది క్రెడిట్ కార్డు ఉన్న వ్యక్తి చనిపోతే ఆ అప్పుడు అతని వారసులు చెల్లించాలని అనుకుంటూ ఉంటారు.
నిబంధనల ప్రకారం క్రెడిట్ కార్డుపై ఉన్న అప్పుకు ఎవరికీ బాధ్యత ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డు నిబంధనల గురించి తెలుసుకుందాం.
చట్టపరమైన వారసులు బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, రుణ ఒప్పందాలు, క్రెడిట్ కార్డ్ బిల్లులతో సహా అన్ని ఆర్థిక పత్రాలను సేకరించాలి.
మరణించిన వ్యక్తికి తగినంత నిధులు ఉంటే ఏదైనా ఆస్తులను చట్టపరమైన వారసులకు పంపిణీ చేయడానికి ముందు ఈ అప్పులు వారు చెల్లించాల్సి ఉంటుంది.
ఒకవేళ మరణించిన వ్యక్తికి తగినంత నిధులు లేకపోతే రుణదాతలు పూర్తిగా చెల్లించాల్సిన మొత్తాలను తిరిగి పొందలేరు.
అయితే కుటుంబ సభ్యులు సాధారణంగా రుణాల కోసం సంతకం చేసినట్లయితే లేదా క్రెడిట్ కార్డ్‌లపై జాయింట్ అకౌంట్ హోల్డర్‌లైతే తప్ప ఈ అప్పులకు వ్యక్తిగతంగా బాధ్యత ఉండదు.
సాధారణంగా మరణించిన వ్యక్తికి సంబంధించి వారసత్వ ఆస్తులను కలిగి ఉంటే ఆ వ్యక్తికి ఆస్తులను పంచుకోవాలని అనుకునే వారు ఆ వ్యక్తి అప్పులను తీర్చాల్సి ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు.