
High CIBIL Score Benefits: సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. ఎందుకంటే ఆర్థిక విషయాలలో ఇది ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలన్నా, ఇంకా ఏదైనా ఆర్థికపరమైన బెనిఫిట్స్ పొందాలన్నా ముందుగా చూసేది సిబిల్ స్కోర్. ఇది లేకుంటే భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలలో. క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ అనేది కేవలం బ్యాంకు లోన్స్ లేదా క్రెడిట్ స్కోర్ కోసం అప్లై చేసుకునేందుకు మాత్రమే అవసరమని చాలా మంది అనుకుంటారు. కానీ దీని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ఒక వ్యక్తికి 750కి పైగా సిబిల్ స్కోర్ ఉంటే బ్యాంకు నుంచి అయినా సులభంగా రుణం పొందవచ్చు. అయితే సిబిల్ స్కోర్ బాగుంటో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్న విషయం చాలా మందికి తెలియదు. కొందరైతే సిబిల్ స్కోర్ గురించి పెద్దగా పట్టించుకోరు. స్కోర్ తగ్గేందుకు ఎన్నో కారణాలు ఉంటాయి. క్రెడిట్ కార్డు, రుణం వాయిదాలు సరిగ్గా చెల్లించని కారణంగా సిబిల్‌పై ఎఫెక్ట్ పడుతుంది.
సిబిల్ (CIBIL) అంటే క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్. దేశంలోని నాలుగు ప్రధానమైన క్రెడిట్ బ్యూరోల సంస్థలలో సిబిల్ (CIBIL) ఒకటి. బ్యూరోస్ ఈక్విఫ్యాక్స్, CRIF హైమార్క్ ,ఎక్స్‌పీరియన్ అనేవి దేశంలోని మిగతా మూడు క్రెడిట్ బ్యూరోల సంస్థలు. నాలుగు క్రెడిట్ బ్యూరోలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ద్వారా గుర్తింపు పొందినవి.
క్రెడిట్ బ్యూరో సంస్థల ద్వారా సులభంగా సిబిల్ లేదా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు. క్రెడిట్ బ్యూరో అధికారిక వెబ్‌సైట్ ద్వారా PAN వివరాలు, పుట్టిన తేది, మొబైల్ నంబర్‌తో క్రెడిట్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ సులభంగా తెలుసుకోవచ్చు. కొన్ని సంస్థలు ఉచితంగా సిబిల్ స్కోర్‌ను చెక్ చేసుకునేందుకు అవకాశం ఇస్తుంటాయి. కొన్ని ఛార్జీలు వసూలు చేస్తాయి. అయితే చీటికి మాటికి సిబిల్ చెక్ చేసుకోవడం కూడా మంచిది కాదంటున్నారు నిపుణులు. పదేపదే చెక్ చేసుకుంటే పాయింట్లు పడిపోయే అవకాశం ఉంది.
మీ సిబిల్ స్కోర్ బాగుండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నట్లయితే గడువులోగా బిల్లు చెల్లించడం చాలా ముఖ్యం. అలాగే ఏవైనా రుణాలు కూడా కూడా ఈఎంఐలు సరిగ్గా చెల్లించాలి. ఏవైనా మిస్ చేసుకున్నట్లయితే దాని ఎఫెక్ట్ మీ సిబిల్‌పై పడుతుందని గుర్తించుకోండి. మినిమమ్ డ్యూ చెల్లించకుండా, క్రెడిట్ కార్డు బిల్లు మొత్తం చెల్లించాలి. దీంతో అధిక వడ్డీ, ఇతర ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
మీ క్రెడిట్ లిమిట్‌లో 30 లేదా 40 శాతం మాత్రమే ఖర్చు చేయాలి. క్రెడిట్ యుటిలైజేషన్ ఎక్కువగా ఉంటే సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. దీని వలన లోన్ అప్రూవల్‌పై ప్రభావం ఉంటుంది. లోన్ లేదా క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసిన ప్రతీసారి హార్డ్ క్రెడిట్ ఎంక్వైరీ జరుగుతుంది. ఒకేసారి ఎక్కువ లోన్స్ కోసం అప్లై చేయడం మంచిది కాదు.
ఇది కూడా చదవండి: పోస్టాఫీసులో కేవలం ఏడాదికి రూ.899తో రూ.15 లక్షల ఇన్సూరెన్స్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి