Hero Motocorp: బైక్ కొనాలనుకునే వారికి ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ షాక్ ఇచ్చింది. తన కంపనీకి చెందిన ద్విచక్ర వాహనాల మోడళ్లపై ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు కంపెనీ తరఫున ఒక ప్రకటన విడుదల చేసింది. ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల కంపెనీపై మరింత భారం పడుతోందని, ఈ కారణంగా ధరలు పెంచాల్సి వస్తోందని మోటోకార్ప్ స్పష్టం చేసింది. కస్టమర్లకు మరీ భారం కాకుండా కనీస స్థాయిలోనే రేట్లు పెంచడం జరుగుతుందని పేర్కొన్నారు. తాజా ప్రకటన ప్రకారం.. కంపెనీకి చెందిన ప్రతి ద్విచక్ర వాహనంపై కనీసం రూ. 2500 వరకు పెరిగే అవకాశం ఉంది. దీని ప్రకారం.. వివిధ రకాల మోడళ్ల బైక్‌లు, స్కూటర్ల ధరల్లో మార్పులు ఉంటాయని పేర్కొంది. ఇదిలాఉంటే.. గత జనవరిలోనే తమ కంపెనీకి చెందిన ద్విచక్ర వాహనాలపై రూ. 1500 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే కేవలం 2 నెలల వ్యవధిలోని మరోసారి రెట్లు పెంచడంతో వినియోగాదారులు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తోంది.
ఇదిలాఉంటే.. మోటోకార్ప్ బాటలోనే మరికొన్ని ఆటోమొబైల్ సంస్థలు పయనిస్తున్నాయి. తమ తమ కంపెనీలకు చెందిన వాహనాల ధరలు పెంచేందుకు సిద్ధం అయ్యాయి. ఇప్పటికే ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఏప్రిల్ 1వ తేదీ నుంచి తమ వాహనాలపై ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇక ‘నిస్సాన్’ కూడా తమ కంపెనీకి చెందిన కార్లపై ధరలు పెంచబోతున్నట్లు ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది. కంపెనీకి చెంది అన్ని రకాల మోడల్ కార్లపై ధరలు పెరుగుతాయంది. అయితే ఎంతమేర పెంచుతారనేది మాత్రం వెల్లడించలేదు. ఇక పెంచిన ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని నిస్సాన్ ప్రకటించింది.
Also read: