Hero: బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు మరెన్నో అడ్వాన్స్‌ ఫీచర్స్‌.. బడ్జెట్‌ ధరలో కొత్త స్కూటర్‌

|

Jun 09, 2024 | 3:02 PM

ఈ స్కూటర్‌లో 110.9cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను అందించారు. అలాగే ఇందులో ప్రత్యేకంగా కార్నరింగ్ లైట్ ఫీచర్ కూడా అందించారు. ఈ స్కూటర్‌ ఇంజన్‌ 8.2hp శక్తి, 8.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ స్కూటర్‌లో డిజిటల్ డిస్‌ప్లేను అందించారు. అలాగే ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌ను ఇచ్చారు...

Hero: బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు మరెన్నో అడ్వాన్స్‌ ఫీచర్స్‌.. బడ్జెట్‌ ధరలో కొత్త స్కూటర్‌
Hero Xoom Combat Edition
Follow us on

ప్రస్తుతం అన్ని ప్రొడక్ట్స్‌ స్మార్ట్‌గా మారిపోతున్నాయి. ఆటోమొబైల్‌ రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా కార్లతో పాటు స్కూటర్లలో కూడా స్మార్ట్‌ ఫీచర్స్‌ను కంపెనీలు పరిచయం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ టూ వీలర్‌ కంపెనీ హీరో మార్కెట్లోకి కొత్త స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. హీరో జూమ్‌ కంబాట్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ స్కూటీలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

హీరో కంపెనీ జూమ్‌ కంబాట్‌ పేరుతో అదిరిపోయే స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. ఆకర్షణీయమైన డిజైన్‌, స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్లతో ఈ స్కూటీనీ తీసుకొచ్చారు. ధర విషయానికొస్తే ఈ స్కూటర్‌ టాప్‌ ఎండ్‌ ధర రూ. 80,967 (ఎక్స్‌ షోరూమ్‌)కి లభిస్తోంది. ఇ ఈ స్కూటర్‌ను మ్యాట్ షాడో గ్రే కలర్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీనికి బేస్ గ్రే కోట్ కూడా లభిస్తుంది. ఇక ఈ స్కూటర్‌ బేస్‌ ఎల్‌ఎక్స్‌ వేరియంట్‌ ధర రూ. 71,484గా నిర్ణయించారు.

ఈ స్కూటర్‌లో 110.9cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను అందించారు. అలాగే ఇందులో ప్రత్యేకంగా కార్నరింగ్ లైట్ ఫీచర్ కూడా అందించారు. ఈ స్కూటర్‌ ఇంజన్‌ 8.2hp శక్తి, 8.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ స్కూటర్‌లో డిజిటల్ డిస్‌ప్లేను అందించారు. అలాగే ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌ను ఇచ్చారు. దీంతో మీ ఫోన్‌తో స్కూటర్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. లుక్స్‌ పరంగా చూస్తే స్పోర్టీ లుక్‌తో డిజైన్‌ చేసిన ఈ స్కూటర్‌లో స్టైలిష్‌ అలాయ్‌ వీల్స్‌ను ఇచ్చారు.

బీఎస్‌6 ఇంజన్‌తో వచ్చే ఈ స్కూటర్‌లో స్పోర్టీ రైడ్‌ ఫీచర్‌ను ప్రత్యేకంగా అందించారు. అలాగే ఇందులో ఫ్రంట్ డిస్క్ బ్రే ఫీచర్‌ను ఇచ్చారు. మెరుగైన బ్రేకింగ్ సెటప్‌ ఈ స్కూటర్‌ సొంతం. వీటితో పాటు డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్‌, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌, ట్యూబ్‌లెస్‌ టైర్స్‌ వంటి ఫీచర్లను అందించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..