కార్ల మార్కెట్లో లేటెస్ట్ సెన్సేషన్ కియా. మన దేశంలో ఈ సౌత్ కొరియా కంపెనీ కార్లు కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేస్తున్నాయి. వినియోగదారుల నుంచి కూడా ఈ కార్లపై పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుండటంతో ఆ కంపెనీ తన మార్కెట్ ను మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో మరిన్ని కొత్త ఫీచర్లతో తన మోడళ్లను అప్ గ్రేడ్ చేస్తోంది. అందులో భాగంగా కియా కారెన్స్ 2023 పేరుతో కారును మన దేశంలో సరికొత్తగా లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.10.44 లక్షలు(ఎక్స్ షోరూం). దీనిలో ఇంజిన్, గేర్ బాక్స్ వంటి వాటిని అప్ గ్రేడ్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
కియా కారెన్స్ మోడల్ లో మొత్తం ఐదు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రీమియం, ప్రెస్టేజ్, ప్రెస్టేజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్ పేరుతో ఇవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ. 10.44 లక్షల నుంచి 17.49 లక్షలు(ఎక్స్ షోరూం) వరకూ ఉంది.
కియా తన పాత ఇంజిన్ అయిన 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ని నిలిపివేసింది. దాని స్థానంలో కారెన్స్ కారులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ని తీసుకొచ్చింది. ఇది 158 బీహెచ్పీ తో 253ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఇంజిన్ హ్యూందాయ్ అల్కాజర్ అలాగే త్వరలో రానున్న వెర్నా మోడళ్లలోనూ వాడుతున్నారు.
ఇదే క్రమంలో మాన్యూల్ గేర్ బాక్స్ కి కియా స్వస్తి చెప్పింది. దాని స్థానంలో కియా కారెన్స్ కారులో ఐఎంటీ క్లచ్చెస్ మాన్యూల్ తో కూడిన ఎంపీవీ ని తీసుకొచ్చింది. అలాగే ఏడు స్పీడ్ డీసీటీని అందిస్తుంది.
ఈ కారెన్స్ కారులో ఆరు ఎయిర్ బాగ్స్ ఉంటాయి. అలాగే ఏబీఎస్, ఈఎస్సీ, హెచ్ఏసీ, వీఎస్ఎం, డౌన్ హిల్ బ్రేక్ కంట్రోల్, డిస్క్ బ్రేక్స్, టీపీఎంఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్స్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. అదే విధంగా 12.5 అంగుళాల డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..