Electric Scooter: స్పోర్ట్స్ కార్ రేంజ్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్.. క్లాసిక్ డిజైన్‌తో కట్టిపడేస్తోంది..

|

May 31, 2023 | 6:30 PM

యాదేయ(Yadea) సరికొత్త లుక్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనిపేరు యాదేయ వీఎఫ్ ఎఫ్200(Yadea VF F200).దీనిని పోర్షే( Porsche) తో కలిసి సంయుక్తంగా తయారు చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Electric Scooter: స్పోర్ట్స్ కార్ రేంజ్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్.. క్లాసిక్ డిజైన్‌తో కట్టిపడేస్తోంది..
Yadea Vf F200 Electric Scooter
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ పెరుగుతోంది. అందులోనూ ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. దీంతో కంపెనీలు కూడా అత్యాధునిక ఫీచర్లతో కూడిన స్కూటర్లను లాంచ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. గ్రాండ్ లో తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇదే క్రమంలో యాదేయ(Yadea) సరికొత్త లుక్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనిపేరు యాదేయ వీఎఫ్ ఎఫ్200(Yadea VF F200). ఇది ఎల్3ఈ కేటగిరిలో అత్యంత శక్తివంతమైన స్కూటర్ అని యాదేయా కంపెనీ ప్రకటించింది. దీనిని పోర్షే( Porsche) తో కలిసి సంయుక్తంగా తయారు చేసింది. డిజైన్ ఫిలాసఫీ మొత్తం పోర్షేదే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

స్పెసిఫికేషన్లు ఇవి..

వీఎఫ్ ఎఫ్200 ఈ స్కూటర్ లో 11కిలోవాట్ల అవుట్ పుట్ ఇచ్చే మోటార్ ఉంటుంది. ఇది గ్యాస్ ఇంజిన్ లతో పోల్చితే డబుల్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. గరిష్టంగా 236ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తితో ఈ స్కూటర్ కేవలం 2.5 సెకండ్లలోనే సున్నా నుంచి 48 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలుతుంది. గరిష్టంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలుతుంది. దీనిలో బ్యాటరీని సింగిల్ చార్జ్ చేస్తే 130 కిలోమీటర్ల వరకూ రేంజ్ ఇస్తుంది.

ధర, లభ్యత..

ఈ వీఎఫ్ ఎఫ్200 స్కూటర్ కు సంబంధించిన ఫీచర్లు ఇంకా పూర్తి స్థాయిలో కంపెనీ ప్రకటించలేదు. ధర కూడా ఇంకా వెల్లడి కాలేదు. మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేదు. అయితే అతి త్వరలోనే ఈ స్కూటర్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..