ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్).. ఇది ఉద్యోగుల పదవీ విరమణ సమయానికి ఆర్థిక భద్రత, భరోసాను కల్పించే స్కీమ్. ఉద్యోగితో పాటు మీకు ఉద్యోగం ఇచ్చిన సంస్థ కూడా దీనిలో మీ పేరు మీద డబ్బులు జమచేస్తుంది. ఈ మొత్తంపై ప్రభుత్వం ఏడాదికి ఒకసారి వడ్డీని అందిస్తుంది. వాస్తవానికి ఇది ఉద్యోగ విరమణ సమయానికి మాత్రమే ఖాతా నుంచి నగదు ఉపసంహరణకు అనుమతి ఇస్తుంది. అయితే కొన్ని ప్రత్యేక అత్యవసర పరిస్థితుల్లో ఈపీఎఫ్ నుంచి నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. పాత కాలపు విధానంలోలా ఈపీఎఫ్ ఆఫీసుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కూర్చొని మీ కంప్యూటర్ లేదా ఫోన్ నుంచి ఆన్ లైన్లో ఈపీఎఫ్ విత్ డ్రా చేయొచ్చు. అదీ మెడికల్ ఎమర్జెన్సీ అయితే గంటలోనే మీ క్లెయిమ్ ఫారంను ప్రాసెస్ చేస్తారు. అదెలాగో తెలుసుకుందాం రండి..
ఒకవేళ మీకు అత్యవసరంగా నగదు అవసరం అయ్యింది. అది వైద్య సంబంధిత అవసరాలు లేదా, ఇంటి రెన్నోవేషన్ వంటిది అవసరం ఏదైనా మీరు ఈపీఎఫ్ ఖాతా నుంచి నగదు విత్ డ్రా చేయొచ్చు. ఈ ప్రక్రియను మీరు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఇంట్లో నుంచే పూర్తి చేయొచ్చు. ఒక వారంలోనే మీరు విత్ డ్రా చేసిన మొత్తం మీ ఖాతాకు జమవుతుంది. అదెలా చేయాలో ఇప్పుడు చూద్దాం..
ఖాతా బ్యాలెన్స్ ఇలా.. మీరు ఒకవేళ పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ తనిఖీ చే సుకోవాలనుకుంటే 011 22901406 నంబర్ ఈపీఎఫ్ ఖాతాకు రిజిస్టర్ అయిన ఫోన్ నంబర్ నుంచి కాల్ చేయొచ్చు. మీకు తిరిగి ఎస్ఎంఎస్ రూపంలో పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ చూపుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..