Bank FD: పెరిగిన ఎఫ్‌డీ వడ్డీ రేట్లు.. ఏ బ్యాంకులో అధిక ప్రయోజనం.. వివరాలు తెలుసుకోండి..

|

Apr 01, 2023 | 8:00 PM

ఫిక్స్ డ్ డిపాజిట్ ఖాతాలపై పెంచిన వడ్డీ రేట్లు ఖాతాదారులకు ఉపశమనాన్ని కలిగించాయి. అయితే ఒక్కో బ్యాంకులో ఒక్కో రకమైన వడ్డీ రేట్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రైవేటు బ్యాంకర్లయినా ఐసీఐసీఐ బ్యాంక్, పీఎన్ బీ, హెచ్డీఎఫ్సీలలో రూ. 2 కోట్ల కంటే తక్కువ విలువైన ఎఫ్ డీ ఖాతాలపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Bank FD: పెరిగిన ఎఫ్‌డీ వడ్డీ రేట్లు.. ఏ బ్యాంకులో అధిక ప్రయోజనం.. వివరాలు తెలుసుకోండి..
Fixed Deposits Rates
Follow us on

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలుమార్లు రెపో రేటు సవరించింది. గత ఫిబ్రవరిలోనే 25 బేస్ పాయింట్లు పెంచి6.50 శాతానికి తీసుకెళ్లింది. ఫలితంగా బ్యాంకర్లు వడ్డీ రేట్లను కూడా పెంచాయి. రుణాలపై వడ్డీ రేట్లు వినియోగదారులకు ఇబ్బందులు కలుగజేయగా.. ఫిక్స్ డ్ డిపాజిట్ ఖాతాలపై పెంచిన వడ్డీ రేట్లు ఖాతాదారులకు ఉపశమనాన్ని అందించాయి. అయితే ఒక్కో బ్యాంకులో ఒక్కో రకమైన వడ్డీ రేట్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రైవేటు బ్యాంకర్లయినా ఐసీఐసీఐ బ్యాంక్, పీఎన్ బీ, హెచ్ డీ ఎఫ్ సీలలో రూ. 2 కోట్ల కంటే తక్కువ విలువైన ఎఫ్ డీ ఖాతాలపై వడ్డీ రేట్లలో తేడాను గమనిద్దాం..

ఐసీఐసీఐ బ్యాంక్ ..

ఐసీఐసీఐ బ్యాంక్ లో ఫిబ్రవరి 24, 2023 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయి. రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి..

  • 7 రోజుల నుండి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 3 శాతం; సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం
  • 15 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం
  • 30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 4.00 శాతం
  • 46 రోజుల నుండి 60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 4.25 శాతం; సీనియర్ సిటిజన్లకు 4.75 శాతం
  • 61 రోజుల నుండి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.00 శాతం
  • 91 రోజుల నుండి 120 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 4.75 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం
  • 121 రోజుల నుండి 150 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 4.75 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం
  • 151 రోజుల నుండి 184 రోజులు: సాధారణ ప్రజలకు 4.75 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం
  • 185 రోజుల నుండి 210 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం
  • 211 రోజుల నుండి 270 రోజులు: సాధారణ ప్రజలకు 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం
  • 271 రోజుల నుండి 289 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 6.00 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం
  • 290 రోజుల నుండి 1 సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 6.00 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం
  • 1 సంవత్సరం నుండి 389 రోజులు: సాధారణ ప్రజలకు 6.70 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.20 శాతం
  • 390 రోజుల నుండి 15 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 6.70 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.20 శాతం
  • 15 నెలల నుండి 18 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 7.10 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం
  • 18 నెలల నుండి 2 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు 7.10 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం
  • 2 సంవత్సరాల 1 రోజు నుండి 3 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం
  • 3 సంవత్సరాల 1 రోజు నుండి 5 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం
  • 5 సంవత్సరాల 1 రోజు నుండి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు 6.90 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం.

HDFC బ్యాంక్..

హెచ్ డీ ఎఫ్సీ బ్యాంక్ లో కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 21, 2023 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ బ్యాంకులో రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తంలో చేసే ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డ రేట్లు ఇలా ఉన్నాయి..

  • 7 రోజుల నుండి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం
  • 15 రోజుల నుండి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం
  • 30 రోజుల నుండి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 4.00 శాతం
  • 46 రోజుల నుండి 60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.00 శాతం
  • 61 రోజుల నుండి 89 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.00 శాతం
  • 90 రోజుల నుండి 6 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.00 శాతం
  • 6 నెలల 1 రోజు నుండి 9 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం
  • 9 నెలల 1 రోజు నుండి 1 సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 6.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.50 శాతం
  • 1 సంవత్సరం నుండి 15 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 6.60 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం
  • 15 నెలల నుండి 18 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 7.10 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం
  • 18 నెలల 1 రోజు నుండి 21 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం
  • 21 నెలల నుండి 2 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు – 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం
  • 2 సంవత్సరాల 1 రోజు నుండి 3 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం
  • 3 సంవత్సరాల 1 రోజు నుండి 5 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం
  • 5 సంవత్సరాల 1 రోజు నుండి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ..

పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఫిబ్రవరి 20, 2023 నుండి కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయి. రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై తాజా వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి..

  • 7 రోజుల నుండి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 4.00 శాతం
  • 15 రోజుల నుండి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 4.00 శాతం
  • 30 రోజుల నుండి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.00 శాతం
  • 46 రోజుల నుండి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.00 శాతం
  • 91 రోజుల నుండి 179 రోజులు: సాధారణ ప్రజలకు 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.00 శాతం
  • 180 రోజుల నుండి 270 రోజులు: సాధారణ ప్రజలకు 5.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.00 శాతం
  • 271 రోజుల నుండి 1 సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 5.80 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.30 శాతం
  • 1 సంవత్సరం: జనరల్ పబ్లిక్ కోసం 6.80 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.30 శాతం
  • 1 సంవత్సరం నుండి 665 రోజులు పైన: సాధారణ ప్రజలకు 6.80 శాతం; సీనియర్ సిటిజన్లకు -7.30 శాతం
  • 666 రోజులు: సాధారణ ప్రజలకు 7.25 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం
  • 667 రోజుల నుండి 2 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు 6.80 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.30 శాతం
  • 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం
  • 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు 6.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.00 శాతం
  • 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలకు పైబడి: సాధారణ ప్రజలకు 6.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.30 శాతం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..