Tax Saving FDs: పన్ను ఆదా చేసే ఎఫ్‌డీలు ఇవే.. ఏ బ్యాంకులో అధిక వడ్డీ అంటే..

ఏ పథకాలలో అధిక పన్ను రాయితీలు ఉన్నాయో వెతుకుతున్నారు. అలాంటి వారికి బెస్ట్ పరిష్కారం ఈ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్ డ్ డిపాజిట్స్. వీటిల్లో రూ. 1.5లక్షల వరకూ పన్ను మినహాయింపు లభిస్తుంది. ఆదాయ పన్ను శాఖ చట్టం సెక్షన్ 80సీ కింద ఈ మినహాయింపు పొందొచ్చు. అయితే ఈ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్ డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టేముందు కొన్ని అంశాలను తెలుసుకోవాలి.

Tax Saving FDs: పన్ను ఆదా చేసే ఎఫ్‌డీలు ఇవే.. ఏ బ్యాంకులో అధిక వడ్డీ అంటే..
Save Tax

Updated on: Mar 09, 2024 | 7:53 PM

ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగిసిపోతోంది. ఈ క్రమంలో పన్ను చెల్లింపుదారులు అందరూ తమ పన్ను మినహాయింపుల కోసం క్లయిమ్ చేసుకునేందుకు ఆతృతగా ఉన్నారు. ఏ పథకాలలో అధిక పన్ను రాయితీలు ఉన్నాయో వెతుకుతున్నారు. అలాంటి వారికి బెస్ట్ పరిష్కారం ఈ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్ డ్ డిపాజిట్స్. వీటిల్లో రూ. 1.5లక్షల వరకూ పన్ను మినహాయింపు లభిస్తుంది. ఆదాయ పన్ను శాఖ చట్టం సెక్షన్ 80సీ కింద ఈ మినహాయింపు పొందొచ్చు. అయితే ఈ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్ డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టేముందు కొన్ని అంశాలను తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం. అలాగే ఆయా బ్యాంకుల్లో ఎఫ్డీలపై వడ్డీ రేట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీ అంటే..

ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీ ఫిక్స్ డ్ టెన్యూర్ తో వస్తుంది. ఐదేళ్ల కాల పరిమితితో ఇవి వస్తాయి.పెట్టుబడి దారులు గరిష్టంగా రూ. 1.5లక్షల వరకూ పెట్టుబడి పెట్టొచ్చు. ఇవి నెలవారీ లేదా క్వార్టర్లీగా పెట్టుబడి ప్రారంభించొచ్చు. అయితే వీటిపై వచ్చే వడ్డీపై ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్(టీడీఎస్) కట్ అవుతుంది. వడ్డీ మొత్తం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 40,000 కన్నా మంచి వడ్డీ వస్తే టీడీఎస్ కట్ అవుతుంది. అదే సమయంలో సీనియర్ సిటిజెన్స్ కు అయితే రూ. 50,000 దాటితే టీడీఎస్ డిడక్ట్ అవుతుంది.

ఎక్కడ ఎఫ్‌డీ ప్రారంభించాలి..

మన బ్యాంకు అకౌంట్ ఉంది కదా అదే బ్యాంకులో ఎఫ్ డీ కూడా ప్రారంభిద్దామని చాలా మంది భావిస్తారు. అయితే అది సరియైన విధానం కాదని నిపుణులు చెబుతున్నారు. ఏ బ్యాంకులో అత్యధిక వడ్డీ రేటు వస్తుందో సరిచూసుకొని ఆ బ్యాంకులో ఖాతా ప్రారంభించాలని సూచిస్తున్నారు. దీని వల్ల అధిక రాబడికి అవకాశం ఉంటుంది.

ట్యాక్స్ సేవింగ్ ఎఫ్ డీలపై వడ్డీ రేట్లు..

  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 6.50శాతం, సీనియర్ సిటిజెన్స్ కు 7.50శాతం వడ్డీ రేటు వస్తుంది.
  • హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 7.00శాతం, సీనియర్ సిటిజెన్స్ కు 7.50శాతం వడ్డీ రేటు వస్తుంది.
  • యాక్సిస్ బ్యాంక్‌లో ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 7.00శాతం, సీనియర్ సిటిజెన్స్ కు 7.75శాతం వడ్డీ రేటు వస్తుంది.
  • ఐసీఐసీఐ బ్యాంక్‌లో ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 7.00శాతం, సీనియర్ సిటిజెన్స్ కు 7.50శాతం వడ్డీ రేటు వస్తుంది.
  • డీసీబీ బ్యాంక్‌లో ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 7.40శాతం, సీనియర్ సిటిజెన్స్ కు 7.90శాతం వడ్డీ రేటు వస్తుంది.
  • ఇండస్ ఇండ్ బ్యాంక్‌లో ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 7.25శాతం, సీనియర్ సిటిజెన్స్ కు 7.75శాతం వడ్డీ రేటు వస్తుంది.
  • ఎస్ బ్యాంక్‌లో ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 7.25శాతం, సీనియర్ సిటిజెన్స్ కు 8.00శాతం వడ్డీ రేటు వస్తుంది.
  • ఆర్బీఎల్ బ్యాంక్‌లో ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 7.10శాతం, సీనియర్ సిటిజెన్స్ కు 7.60శాతం వడ్డీ రేటు వస్తుంది.
  • బంధన్ బ్యాంక్‌లో ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 7.00శాతం, సీనియర్ సిటిజెన్స్ కు 7.50శాతం వడ్డీ రేటు వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..