Fixed deposit: వృద్ధులకు ఎక్కువ వడ్డీ.. అధిక భద్రత.. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే ఈ బ్యాంకుల్లోనే చేయాలి..

|

Jun 05, 2023 | 3:00 PM

సీనియర్ సిటిజెన్స్ కు ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో అధిక వడ్డీ వస్తుంది. . అన్ని బ్యాంకులు సాధారణ పౌరులతో పోల్చితే సీనియర్ సిటిజెనులకు అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. వాటిల్లో టాప్ బ్యాంకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Fixed deposit: వృద్ధులకు ఎక్కువ వడ్డీ.. అధిక భద్రత.. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే ఈ బ్యాంకుల్లోనే చేయాలి..
Fixed Deposit
Follow us on

ఇటీవల కాలంలో బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు అత్యంత ఉత్తమ పెట్టుబడి పథకాలలో ఒకటిగా పరిగణిస్తున్నారు. అందరూ వీటిలో ఖాతాలు ప్రారంభించేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజెన్స్ కు ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో అధిక వడ్డీ వస్తుంది. . అన్ని బ్యాంకులు సాధారణ పౌరులతో పోల్చితే సీనియర్ సిటిజెనులకు అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ),హెచ్‌డీఎఫ్సీ, ఐసీఐసీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) వంటి అనేక బ్యాంకులు సీనియర్ సిటిజన్‌లకు 7 నుంచి 10 సంవత్సరాల ఎఫ్‌డీలపై అదనపు 50 బేసిస్ పాయింట్లను (0.50 శాతం) అందిస్తున్నాయి. సాధారణ పౌరులతో పోల్చితే సీనియర్ సిటిజన్‌లకు అందించే ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఆయా బ్యాంకులు అందించే వడ్డీ రేట్లను ఓసారి చూద్దాం.

సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ అందిస్తున్న ప్రత్యేక ఎఫ్‌డీలు..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్ వుయ్ కేర్ ఉంది. దీనిలో 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండే ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్‌లకు 30 బీపీఎస్ వడ్డీ రేటును అందిస్తుంది. అంటే వడ్డీ రేటు 7.50 శాతంగా ఉంటుంది. ఈ వడ్డీ రేట్లు ఫిబ్రవరి 15, 2023 నుండి అమలులోకి వచ్చాయి. అలాగే ఎస్బీఐ అమృత్ కలాష్ ఎఫ్డీ పథకం 400 రోజుల ప్రత్యేక వ్యవధితో వస్తుంది, దీనిపై సాధారణ ప్రజలకు 7.10 శాతం వడ్డీ రేటు, సీనియర్ సిటిజన్‌లకు 7.60 చొప్పున వడ్డీ రేటు లభిస్తుంది.

సీనియర్ సిటిజన్ల కోసం హెచ్‌డీఎఫ్సీ ప్రత్యేక ఎఫ్‌డీ పథకం..

సీనియర్ సిటిజన్ల కోసం హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్ ప్రత్యేక ఎఫ్‌డీ అందిస్తోంది. ఈ పథకాన్ని హెచ్‌డీఎఫ్సీ సీనియర్ సిటిజన్ కేర్ అని అంటారు. ఈ డిపాజిట్లపై బ్యాంక్ 75 బీపీఎష్ అధిక వడ్డీ రేటును అందిస్తుంది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్‌డీ పథకంలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ జూలై 7, 2023 వరకు పొడిగించబడింది. సీనియర్ సిటిజన్‌లకు 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు 7.75% వడ్డీ రేటును అందిస్తుంది. . ఈ రేట్లు మే 29, 2023 నుండి అమలులోకి వచ్చాయి. ఇది కాకుండా, హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్ 35, 55 నెలల కాలవ్యవధితో రెండు ప్రత్యేక ఎడిషన్-ఎఫ్‌డీ పథకాలను కూడా ప్రవేశపెట్టింది, ఇవి సీనియర్ సిటిజన్‌లకు వరుసగా 7.70 శాతం, 7.75 శాతం వడ్డీ రేట్లను అందిస్తాయి.

ఇవి కూడా చదవండి

సీనియర్ సిటిజెనులకు ఐసీఐసీఐ అందిస్తున్న ప్రత్యేక ఎఫ్‌డీ పథకం

సీనియర్ సిటిజన్ల కోసం ఐసీఐసీఐ బ్యాంక్ అందిస్తున్న ప్రత్యేక ఎఫ్‌డీ పథకం ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్‌డీ స్కీమ్. దీనిలో 80 బీపీఎస్ వరకూ అధిక వడ్డీ రేటును అందిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్ ఎఫ్‌డీ పథకం వార్షికంగా 7.50 శాతం వడ్డీని అందిస్తుంది. ఈ వడ్డీ రేట్లు ఫిబ్రవరి 24, 2023 నుండి అమలులోకి వచ్చాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.