మార్చి వచ్చిందంటే సాధారణంగా అన్ని కంపెనీలు పద్దుల చిట్టాలపై కుస్తీ పడుతుంటాయి. ఇదే క్రమంలో తమ కొత్త ఉత్పత్తుల కూడా ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తాయి. మార్చి నెలను అందుకు వేదికగా చేసుకుంటాయి. ఏటా మాదిరిగానే ఈ సారి ఈ మార్చిలో పెద్ద సంఖ్యలోనే కార్లు మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది. దానిలో ప్రముఖంగా హ్యూందాయ్, హోండా, మారుతి, టోయోటా వంటి కంపెనీల నుంచి కొత్త కార్లు మార్కెట్లోకి రానున్నాయి. వీటిల్లో కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తులు ఎప్పడు తీసుకొస్తాం అనే విషయంపై ఇప్పటికే క్లారిటీ ఇవ్వగా మరికొన్ని లాంచింగ్ ను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మార్చిలో లాంచింగ్ డేట్ ఫిక్స్ చేసిన నాలుగు కంపెనీలకు చెందిన కార్లను ఇప్పుడు చూద్దాం. వాటి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిని వెర్నా మోడల్లో కొత్త వేరియంట్ ని ఆవిష్కరించేందుకు హ్యూందాయ్ కంపెనీ సిద్ధమైంది. ఇప్పటికే ఈ సెడాన్ వాహనానికి బుకింగ్స్ కూడా ఓపెన్ చేసింది. మార్చి 21వ తేదీన దానిని లాంచ్ చేయనుంది. దీని ప్రారంభ ధర రూ. 10 లక్షల నుంచి ఉంటుంది. కొత్త వెర్నా స్పోర్టివ్ లుక్ లో ఉంటుందని, గతం మోడల్ కంటే కాస్త పెద్దదిగా ఉంటుందని ఆ కంపెనీ పేర్కొంది. ఫీచర్ల విషయానికి వస్తే పెద్ద టచ్ స్క్రీన్ సిస్టమ్, కొత్త డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉంటుంది. 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది.
సెడాన్ వేరియంట్ వెర్నాకు పోటీగా, దానికన్నా ముందుగానే హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ తో వస్తోంది. ఇది మార్చి రెండో తేదీనే మార్కెట్లోకి అడుగు పెట్టనుంది. దీని ధర రూ. 11 లక్షల నుంచి ప్రారంభవుతోంది. కొత్త హోండా సిటీ లోపల, బయట చిన్న చిన్న మార్పులను చేసింది. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి కొత్త ఫీచర్లను అందిస్తోంది.1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు బలమైన-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లతో వస్తుంది.
మారుతి ఫ్రాంక్స్(Fronx ) పేరిట ఎస్యూవీ ని ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. ఇది మారుతి బాలెనో, గ్రాండ్ విటారాల మాదిరిగా ఉంటుంది. క్యాబిన్ బాలెనో మోడల్లో ఉంటుంది. దీనిని మార్చి నెల మధ్యలో ఎప్పుడైనా విడుదల చేసే అవకాశం ఉంది. దీని ప్రారంభ ధర రూ. 8 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. దీనిలో టచ్‌స్క్రీన్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, హెడ్-అప్ డిస్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా , ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తుంది.
సిట్రోయెన్ ఈసీ3 ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా మార్చి ప్రారంభంలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది దాదాపు పెట్రోల్ మోడల్ లోనే ఉంటుంది. దీనిలో 29.2kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది గరిష్టంగా 320 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. దీనిలోని మోటార్ 57PS, 143Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 10-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. దీని ధర రూ. 11 లక్షల నుంచి ఉంటుంది.
ఇన్నోవా క్రిస్టా, ఫిబ్రవరిలోనే మార్కెట్లోకి వస్తుందని అంతా ఆశించారు. కానీ అది జరగలేదు. ఈ మర్చిలో మధ్యలో వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది ఆటోమేటిక్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, పవర్డ్ డ్రైవర్ సీటు, టచ్‌స్క్రీన్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్ ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. దీని ధర రూ. 20 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..