భారతీయ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ సంస్కరణల బాట పట్టింది. ప్రైవేటు టెలికాం సంస్థల నుంచి వస్తున్న పోటీని అధిగమించేందుకు అవసరమైన మార్పులను చేసుకుంటూ ముందుకెళ్తోంది. అందులో భాగంగా సంస్థకు అంతగా ప్రయోజనం చేకూర్చని, వినియోగదారులు ఆసక్తి చూపని పలు సేవలను సమీక్షించుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రీపెయిడ్ ప్లాన్ల ట్యారిఫ్ లలో పలు మార్పులు చేసింది. వినియోగదారుల నుంచి అంతగా స్పందన లేని నాలుగు ప్రీ పెయిడ్ ప్యాక్ లను తొలగించి.. కొత్తగా మరో రెండు ప్లాన్లను ప్రకటించింది. కొత్తగా తీసుకొచ్చిన ప్లాన్లలో అధిక ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు పేర్కొంది. దేశంలో 5జీని వచ్చే ఏడాదికి పూర్తి స్థాయిలో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్లను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఆ ప్లాన్ల వివరాలు ఇప్పుడు చూద్దాం..
బీఎస్ఎన్ఎల్ రూ. 71.. ఈ రీచార్జ్ ప్యాక్ ని టెలికాం సంస్థ నిలిపివేసింది. దీనిలో ఫ్రీ కాలింగ్, ఫ్రీ మెసేజ్ అవకాశం లేదు. కాల్ చేసినప్పుడు ప్రతి నిమిషానికి 30 పైసలు తీసుకుంటుంది. అలాగే 30 రోజుల వ్యాలిడిటీతో రూ. 20 టాక్ టైం ఇస్తారు. ఇతర ఏ బెనిఫిట్స్ కూడా లేవు.
బీఎస్ఎన్ఎల్ రూ. 104.. ఇది 18 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అలాగే రూ.99 విలువైన ప్రత్యేక డిస్కౌంట్ కూపన్స్ వస్తాయి.
బీఎస్ఎన్ఎల్ రూ. 135.. ఈ ప్యాక్ లో 1440 నిమిషాల కాలింగ్ టైమ్ ఉంటుంది. కానీ ఎటువంటి డేటా బెనిఫిట్స్ ఉండవు. 24 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది.
బీఎస్ఎన్ఎల్ రూ. 395.. ఈ ప్రత్యేకమైన ప్లాన్ లో 3000 నిమిషాల ఆన్ నెట్ కాలింగ్, 1800 నిమిషాల ఆఫ్ నెట్ కాలింగ్ అవకాశం ఉంటుంది. దీనిని వినియోగించుకోవాలంటే వినియోగదారులు ప్రతి నిమిషానికి 20 పైసలు ఖర్చు చేయాల్సిందే. ఈ ప్యాక్ లో అదనంగా రోజుకి 2జీబీ డేటా 71 రోజుల వ్యాలిడిటీతో ఇస్తారు.
పాత ప్లాన్లను తొలగించడంతో పాటు బీఎస్ఎన్ఎల్ పలు కొత్త ప్లాన్లను ఫెస్టివల్ ధమాకా ఆఫర్లుగా ప్రకటించింది. ఎస్టీవీ రూ. 269, ఎస్టీవీ రూ. 769 లతో కొత్త ప్లాన్లను అందించింది.
బీఎస్ఎన్ఎల్ రూ. 269.. ఈ ప్యాక్ లో అన్ లిమిటెడ్ కాలింగ్ తో పాటు రోజుకు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, జింగ్ యాప్ యాక్సెస్, ఎరోస్ నౌ సబ్ స్క్రిప్షన్ వంటి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.
బీఎస్ఎన్ఎల్ రూ. 769.. ఈ ప్యాక్ రీచార్జ్ చేయించుకుంటే అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు వస్తాయి. అలాగే లోక్దున్ అప్లికేషన్, జింగ్ యాప్ యాక్సెస్, 90 రోజుల ఎరోస్ నౌ ఎంటర్టైన్మెంట్ సబ్ స్క్రిప్షన్ వంటి ప్రయోజనాలు అందుతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..