
భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు(ఎఫ్‌డీ) బాగా ఉపయోగపడతాయి. అధిక వడ్డీతోపాటు స్థిరమైన రాబడిని అందిస్తాయి. పైగా పన్ను ప్రయోజనాలుంటాయి. దీంతో ఎక్కువ శాతం మంది ఎఫ్‌డీలను ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతారు. పోస్టు ఆఫీసులు, బ్యాంకుల్లో ఈ ఖాతాలను నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఈ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అలాగే అన్ని చోట్లా ఒకేలా ఉండవు. పోస్ట్ ఆఫీసుల్లో ఒక వడ్డీ రేటు ఉంటుంది. బ్యాంకుల్లో ఒక రకమైన వడ్డీ రేటు ఉంటుంది. బ్యాంకులలో కూడా బ్యాంకు రకాన్ని బట్టి మారుతుంటుంది. ఒక్కో బ్యాంకు ఒక్కో రకమైన వడ్డీ రేటు అమలు చేస్తాయి. మీరు కనుక ఎఫ్‌డీ ప్రారంభించాలనుకుంటే ఏ బ్యాంకులో ఎక్కువ వడ్డీ ఉందో తెలుసుకోవడం ముఖ్యం. పైగా ఈ వడ్డీ రేట్లు స్థిరంగా ఉండవు. దేశంలో ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, ఆర్బీఐ రెపో రెటు వంటి అంశాల ఆధారంగా వడ్డీ రేటు మారుతుంటుంది. ఆర్బీఐ రెపో రేటు మారితే అన్ని బ్యాంకుల్లో ఎఫ్‌డీ రేట్లు మారతాయి. అందుకే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించిన తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్ గా ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా పొదుపులు, పెట్టుబడులను ఆప్టిమైజ్ చేయాలని చూస్తున్న వ్యక్తులు, వ్యాపారాలకు ఇది చాలా కీలకం.
బ్యాంకులు తమ ఎఫ్‌డీ రేట్లను ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నాయి. దీనిని అనుసరించి, భారతదేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ముందుగా తమ ఎఫ్‌డీ రేట్లను సవరించింది. ఇప్పుడు ఎస్బీఐకి సంబంధించిన ఎఫ్‌డీ వడ్డీ రేట్ల గురించి ఇప్పుడు చూద్దాం..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..