
ప్రతి సంస్థ లేదా పరిశ్రమలలో పనిచేసే ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతా ఉంటుంది. అతడికి వచ్చే జీతాన్ని అనుసరించి ప్రతినెలా కొంత మొత్తం అందులో జమ అవుతుంది. యజమాని కూడా తన తరఫున మరి కొంత మొత్తాన్ని ఉద్యోగి ఖాతాలో జమ చేస్తాడు. ఇలా ప్రతి నెలా జమ చేసిన సొమ్మును ఉద్యోగ విరమణ నాటికి పెద్ద మొత్తంలో అందజేస్తారు. ఉద్యోగులందరికీ తమ జీతం నుంచి ప్రతి నెలా ఈపీఎఫ్ ఖాతాకు సొమ్మును మినహాయిస్తున్నారని తెలిసినప్పటికీ, అసలు తమ ఖాతాలో డబ్బు ఎంత ఉందన్న విషయాన్ని పట్టించుకోరు.
ఉద్యోగి సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రారంభించిన పొదుపు పథకమే ఈపీఎఫ్. దీనిపై పూర్తి అవగాహన అవసరం. అప్పుడే మీరు ఎంత పొదుపు చేశారన్న విషయం తెలుస్తుంది. ఆ ఖాతాపై మీకు పర్యవేక్షణ ఉంటుంది. ఈపీఎఫ్ లో మీరు చందాదారులుగా చేరినప్పుడే మీకు యూనివర్సల్ అక్కౌంట్ నంబర్ (యూఏఎన్) ఇస్తారు. దానిని ఉపయోగించి చాలా సులువుగా మీరు ఈపీఎఫ్ ఖాతాలో పొదుపును తెలుసుకోవచ్చు. రిటైర్మెంట్ తర్వాత మెరుగైన ఆర్థిక ప్రణాళిక వేసుకోవడానికి మీరు పొదుపు ఖాతాను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. యూఏఎన్ నంబర్ ను ఉపయోగించి ఈపీఎఫ్ ఖాతాలో పొదుపు ను తెలుసుకునేందుకు చాలా సులువైన మార్గాలు ఉన్నాయి.
ఉమాంగ్ యాప్ ను ఉపయోగించి ఈపీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు. అందుకోసం మీరు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఉమాంగ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత భాషను ఎంచుకొని మీ సొంత మొబైల్ నంబర్ తో రిజిస్టర్ చేసుకోండి. అందులో కనిపించిన వివరాలలో ఈపీఎఫ్ఓ ఆప్షన్‌ను ఎంచుకోండి. వ్యూ పాస్ బుక్ ఆప్షన్ లోకి వెళ్లి మీ యూఏఎన్ నంబర్ ను ఎంటర్ చేయాలి. వెంటనే మీ మొబైల్ కు ఓటీపీ నంబర్ వస్తుంది. ఆ నంబర్ ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. స్క్రీన్ మీద కనిపించిన సూచనల ఫాలో అయ్యి మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..