Post Office Scheme: ఒకేసారి పెట్టుబడి.. నెలనెలా ఆదాయం.. వృద్ధులకు బెస్ట్‌ స్కీమ్‌

|

May 23, 2024 | 7:58 AM

Post Office Monthly Income Scheme: పోస్టాఫీసు పథకాలలో అత్యంత ప్రజాదరణ పొందింది పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అకౌంట్ (ఎంఐఎస్‌). ఇది ఒక సారి ఏకమొత్తం పెట్టుబడి తర్వాత నెలవారీ ఆదాయాన్ని పొందేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. దీనిలో మీరు పెట్టిన పెట్టుబడిని బట్టి ప్రతి నెలా రూ.5,550 వరకు నెలవారీ పింఛను లభిస్తుంది. అదే ఉమ్మడి ఖాతా అయితే రూ.9,250 వరకు నెలవారీ పెన్షన్ పొందవచ్చు. 

Post Office Scheme: ఒకేసారి పెట్టుబడి.. నెలనెలా ఆదాయం.. వృద్ధులకు బెస్ట్‌ స్కీమ్‌
Post Office Scheme
Follow us on

పోస్ట్‌ ఆఫీస్‌ పథకాలపై ప్రజలకు నమ్మకం ఉంటుంది. ప్రభుత్వ భరోసా ఉంటుందన్న విశ్వాసం వారిలో బలంగా పనిచేస్తుంది. దీంతో ఆయా పథకాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతారు. ముఖ్యంగా వృద్ధులు ఈ పోస్టాఫీసు పథకాలపై ఎక్కువ నమ్మకంగా ఉంటారు. పోస్ట్‌ ఆఫీసు కూడా అనేక పథకాలను అమలు చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా పెన్షన్‌ పథకాలకు దీనిలో మంచి డిమాండ్‌ ఉంటుంది. వృద్ధాప్యంలో నెలవారీ స్థిరమైన ఆదాయం కావాలని కోరుకునే వారికి ఇవి బెస్ట్‌ ఎంపికలుగా నిలుస్తున్నాయి. వృద్ధులకు రోజువారీ ఖర్చులు, వైద్య సంరక్షణ లేదా అనేక ఇతర అవసరాలను తీర్చడానికి వారికి ఈ నెలవారీ ఆదాయం ఉపయోగపడుతుంది. అంతేకాక ఈ నెలావారీ ఆదాయం వారి రోజువారీ అవసరాల కోసం ఇతరులపై ఆధారపడే పరిస్థితి ఉండదు. అలాంటి పోస్టాఫీసు పథకాలలో అత్యంత ప్రజాదరణ పొందింది పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అకౌంట్ (ఎంఐఎస్‌). ఇది ఒక సారి ఏకమొత్తం పెట్టుబడి తర్వాత నెలవారీ ఆదాయాన్ని పొందేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. దీనిలో మీరు పెట్టిన పెట్టుబడిని బట్టి ప్రతి నెలా రూ.5,550 వరకు నెలవారీ పింఛను లభిస్తుంది. అదే ఉమ్మడి ఖాతా అయితే రూ.9,250 వరకు నెలవారీ పెన్షన్ పొందవచ్చు. ఈ క్రమంలో మీరు రూ. 1,000, రూ. 2,000, రూ. 3,000, రూ. 4,000, రూ. 5,000 పొందేందుకు మీరు ఎంత మొత్తంలో పెట్టుపెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం రండి..

పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్‌ ఫీచర్లు..

  • పోస్టాఫీసులోని ఈ నెలవారీ పథకం 7.4 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తుంది.
  • దీనిలో కనీస పెట్టుబడి మొత్తం రూ. 1,000 కాగా, వ్యక్తిగత ఖాతాలో గరిష్ట మొత్తం రూ. 9 లక్షలు, ఉమ్మడి ఖాతాలో రూ. 15 లక్షల వరకూ పెట్టుబడి పెట్టొచ్చు.
  • ఖాతా తెరిచిన తేదీ నుంచి ఒక నెల పూర్తయిన తర్వాత మీరు పెట్టిన పెట్టుబడిని బట్టి ప్రతి నెలా మీకు పింఛన్‌ వస్తుంది. అది మెచ్యూరిటీ వరకు వడ్డీతో సహా చెల్లిస్తారు.
  • దీనిపై సంపాదించే వడ్డీకి పన్ను విధిస్తారు.
  • పథకం మెచ్యూరిటీ వ్యవధి ఖాతా తెరిచిన తేదీ నుంచి ఐదు సంవత్సరాలు.
  • ఎంఐఎస్‌ ఖాతాను కూడా ముందుగానే మూసివేయవచ్చు. కానీ 2శాతం పెనాల్టీ పడుతుంది. ప్రధాన మొత్తం నుంచి రెండు శాతం తీసుకుంటారు.
  • మెచ్యూరిటీ వ్యవధి తర్వాత, వారు డిపాజిట్ చేసిన మొత్తాన్ని తిరిగి తీసుకోవచ్చు. అయితే పెన్షన్‌ ఆగిపోతుంది.

నెలవారీ పెన్షన్ ఎలా పొందాలి?

  • ఈ పథకం 7.4 శాతం వార్షిక వడ్డీ రేటును ఇస్తుంది కాబట్టి, రూ. 1,000 నెలవారీ పెన్షన్ పొందడానికి రూ. 1,62,000 ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టాలి.
  • రూ. 2,000 నెలవారీ పెన్షన్ కోసం, రూ. 3,25,000 ఒక్కసారి పెట్టుబడి పెట్టాలి.
  • రూ.4,86,500 పెట్టుబడితో మీకు నెలవారీ రూ.3,000 పెన్షన్ పొందొచ్చు.
  • రూ.4,000 నెలవారీ పెన్షన్ కోసం, రూ.6,48,700 పెట్టుబడి పెట్టాలి.
  • రూ. 5000 పెన్షన్‌ కోసం రూ.8,11,000 ఒక్కసారి పెట్టుబడి పెట్టాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..