FD Interest Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు మారాయ్.. ప్రైవేటు బ్యాంకుల్లో కొత్త రేట్లు ఇవే..

|

May 11, 2024 | 5:20 PM

ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్. 2024 మే నెలలో చాలా బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్లాన్లపై వడ్డీ రేట్లను సవరించాయి. వాటిల్లో ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(ఎస్ఎఫ్బీ), సిటీ యూనియన్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికంగా వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకుల వివరాలు ఇప్పుడు చూద్దాం..

FD Interest Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు మారాయ్.. ప్రైవేటు బ్యాంకుల్లో కొత్త రేట్లు ఇవే..
Fixed Deposit1
Follow us on

ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్. 2024 మే నెలలో చాలా బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్లాన్లపై వడ్డీ రేట్లను సవరించాయి. వాటిల్లో ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(ఎస్ఎఫ్బీ), సిటీ యూనియన్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికంగా వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకుల వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన రేట్లు మే 1, 2024 నుంచి అమలులోకి వచ్చాయి. వాటి ప్రకారం బ్యాంక్ సాధారణ పౌరులకు 4 శాతం నుంచి 8.50 శాతం మధ్య వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు, బ్యాంక్ 4.60 శాతం నుంచి 9.10 శాతం మధ్య వడ్డీ రేటును అందిస్తోంది. 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కాలవ్యవధిలో అత్యధిక వడ్డీ రేటు 8.50 శాతం నుంచి 9.10 శాతం మధ్య అందిస్తోంది.

ఆర్బీఎల్ బ్యాంక్ ఎఫ్డీ వడ్డీ రేట్లు..

ఆర్బీఎల్ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలపై ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు మే 1, 2024 నుంచి అమలులోకి వచ్చాయి. 18 నుంచి 24 నెలల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలపై అత్యధికంగా 8% వడ్డీ రేటును అందిస్తుంది. అదే ఎఫ్డీ వ్యవధిలో, సీనియర్ సిటిజన్ 0.50% అదనంగా సంపాదిస్తారు. అంటే 8.50%, సూపర్ సీనియర్ సిటిజన్‌లు (80 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ) 0.75% అంటే 8.75% అదనపు వడ్డీ రేటుకు అర్హులు.

క్యాపిటల్ బ్యాంక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్డీ వడ్డీ రేట్లు..

క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలపై ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన ఎఫ్డీ వడ్డీ రేట్లు మే 6, 2024 నుంచి అమలులోకి వచ్చాయి. సాధారణ పౌరులకు 3.5 శాతం, 7.55 శాతం మధ్య వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ 4 శాతం నుంచి 8.05 శాతం మధ్య వడ్డీ రేటును అందిస్తుంది. 400 రోజుల వ్యవధిలో అత్యధిక వడ్డీ రేటు అందించబడుతుంది.

సిటీ యూనియన్ బ్యాంక్ ఎఫ్డీ వడ్డీ రేట్లు..

సిటీ యూనియన్ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలపై ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన ఎఫ్డీ వడ్డీ రేట్లు మే 6, 2024 నుంచి అమలులోకి వస్తాయి. బ్యాంక్ సాధారణ పౌరులకు 5 శాతం నుంచి 7.25 శాతం మధ్య ఉంటుంది. సీనియర్ సిటిజన్‌లకు 5 శాతం నుంచి 7.75 శాతం మధ్య వడ్డీ రేటును అందిస్తుంది. 400 రోజుల కాలవ్యవధిపై అత్యధిక వడ్డీ రేటు 7.25 శాతం నుంచి 7.75 శాతం అందించబడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..