Small Savings Schemes: కొత్త వడ్డీ రేట్లు వచ్చాయ్.. పీపీఎఫ్, ఎన్పీఎస్ వంటి పథకాల్లో మార్పులివే..

పోస్ట్ ఆఫీస్ సేవింగ్ పథకాలు, సీనియర్ సిటిజన్ల సేవింగ్ స్కీమ్‌లు (ఎస్ సీఎస్ఎస్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పథకాల వడ్డీ రేట్లు 2024 ఏప్రిల్ ఒకటి నుంచి మొదలైన త్రైమాసికానికి మారవు. జనవరి-మార్చి త్రైమాసికంలో నిర్ణయించిన వడ్డీ రేట్లనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Small Savings Schemes: కొత్త వడ్డీ రేట్లు వచ్చాయ్.. పీపీఎఫ్, ఎన్పీఎస్ వంటి పథకాల్లో మార్పులివే..
Small Savings Schemes

Updated on: Apr 08, 2024 | 2:16 PM

ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక భద్రత కోసం వివిధ పొదుపు పథకాలతో పెట్టుబడి పెడతారు. వాటిలో నెలవారీ కొంత మొత్తాన్ని లేదా ఒకేసారి డిపాజిట్ చేస్తారు. నిర్ణీత కాలవ్యవధి తర్వాత వడ్డీతో సహా మనకు డబ్బులు అందుతాయి. వీటిపై ఇచ్చే వడ్డీ రేటు అనేక నిబంధనలకు లోబడి ఉంటుంది. సాధారణంగా ప్రతి త్రైమాసికానికి (మూడు నెలలు) వడ్డీరేటు నిర్ణయిస్తారు. దేశవ్యాప్తంగా వివిధ ఆర్థిక సంస్థల ద్వారా ప్రభుత్వ పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి ప్రజల ఆర్థిక ఉన్నతికి ఉపయోగపడతాయి. పిల్లలు, మహిళలు,రైతులు, కార్మికులు, సీనియర్ సిటీజన్లకు విడివిడిగా ఉన్నాయి.

పాత వడ్డీరేటే కొనసాగింపు..

పోస్ట్ ఆఫీస్ సేవింగ్ పథకాలు, సీనియర్ సిటిజన్ల సేవింగ్ స్కీమ్‌లు (ఎస్ సీఎస్ఎస్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పథకాల వడ్డీ రేట్లు 2024 ఏప్రిల్ ఒకటి నుంచి మొదలైన త్రైమాసికానికి మారవు. జనవరి-మార్చి త్రైమాసికంలో నిర్ణయించిన వడ్డీ రేట్లనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం జనవరి-మార్చి త్రైమాసికానికి రెండు చిన్న పొదుపు పథకాల వడ్డీ రేటుపై 10-20 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇలా రేట్లు పెంచడం దీనితో వరుసగా ఆరోసారి. దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసులలోని ప్రభుత్వ పథకాల తాజా (2024 ఏప్రిల్-జూన్ వరకూ) వడ్డీ రేట్లు తెలుసుకుందాం.

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్.. ఈ పథకంలో కనీసం రూ.వెయ్యి గరిష్టంగా రూ.30 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. ఖాతా తెరిచే నాటికి 60 ఏళ్లు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండాలి. వీఆర్ఎస్ తీసుకున్న వారికి 55 ఏళ్లకు అవకాశం ఉంది. డిఫెన్స్ సర్వీసెస్ రిటైర్ సిబ్బంది కొన్ని నిబంధనలకు లోబడి 50 ఏళ్ల తర్వాత ఖాతా తెరిచే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా లేదా జీవిత భాగస్వామితో సంయుక్తంగా ఖాతాను తెరవవచ్చు. ఖాతా తెరిచిన తేదీ నుంచి ఐదేళ్ల ముగిసిన తర్వాత ఖాతా మూసివేయవచ్చు. వీలుంటే మరో మూడేళ్లు పొడిగించవచ్చు. కొన్ని షరతులకు లోబడి అకాల మూసివేతకు అనుమతి ఉంది. ఈ పథకంలో డిపాజిట్లకు ఆదాయపు పన్ను చట్టంలోని 80సీ ప్రకారం పన్నుమినహాయింపు లభిస్తుంది. 2024 ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 త్రైమాసికానికి ఈ పథకంలో 8.20 శాతం వడ్డీని అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

జాతీయ పొదుపు (నెలవారీ ఆదాయ ఖాతా) పథకం.. ఈ స్కీమ్ లో కనీసం రూ.వెయ్యి, గరిష్టంగా రూ.9 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. జాయింట్ ఖాతాలో రూ.15 లక్షల వరకూ అనుమతి ఉంది. ఖాతా ఐదేళ్లలో మెచ్యూర్ అవుతుంది. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను నిర్వహించవచ్చు. వాటిపై కొన్ని నిబంధనలు ఉంటాయి. ఏడాది తర్వాత లేదా మూడేళ్ల లోపు ఖాతాను మూసివేయాలనుకుంటే డిపాజిట్ లో 2 శాతం తగ్గిస్తారు. మూడేళ్ల తర్వాత మూసివేయాలనుకుంటే డిపాజిట్ పై 1 శాతం తగ్గిస్తారు. ఏప్రిల్ – జూన్ త్రైమాసికానికి ఈ పథకంలో 7.4 శాతం వడ్డీని అందిస్తున్నారు.

నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ ఖాతా.. ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల కాల వ్యవధిలో మనం ఈ పథకంలో డిపాజిట్లు చేయవచ్చు. కనీసం రూ.వెయ్యి, గరిష్ట పరిమితి లేదు. ఖాతాలోని డిపాజిట్లను ఆరు నెలల తర్వాత కానీ ఒక సంవత్సరం ముందుగా విత్‌డ్రా చేసుకుంటే సాధారణ వడ్డీ చెల్లిస్తారు. ఐదేళ్ల కాలవ్యవధి డిపాజిట్లకు మాత్రం ఆదాయపు పన్ను చట్టంలోని 80సీ కింద మినహాయింపు పొందుతాయి. ఈ త్రైమాసికంగాలో వడ్డీ రేట్లను చూసుకుంటే ఏడాది డిపాజిట్లపై 6.90 శాతం, రెండేళ్ల డిపాజిట్లపై 7 శాతం, మూడేళ్ల డిపాజిట్లపై 7.10 శాతం, ఐదేళ్ల డిపాజిట్లపై 7.5 శాతం అందజేస్తున్నారు.

నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్.. దీనిలో కనీస డిపాజిట్ రూ.వెయ్యి, గరిష్ట డిపాజిట్ కు పరిమితి లేదు. ఖాతా ఐదేళ్లలో మెచ్యూర్ అవుతుంది. ఒకే హోల్డర్ రకం ఖాతాను పెద్దలు తన కోసం లేదా మైనర్ తరపున తెరవవచ్చు. మైనర్ పదేళ్లు వచ్చాక ఒకే హోల్డర్ తరహా ఖాతాను కూడా తెరవవచ్చు. దీనిపై ఈ త్రైమాసికానికి 7.74 శాతం వడ్డీని ఇస్తున్నారు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పథకం.. ఈ పథకంలో ఒక ఆర్థిక సంవత్సరంలో కనీస డిపాజిట్ రూ.500 చేయాలి. గరిష్ట డిపాజిట్ రూ. 1,50,000. 3వ ఆర్థిక సంవత్సరం నుంచి 6వ ఆర్థిక సంవత్సరం వరకు రుణ సౌకర్యం ఉంది.
7వ ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా ఉపసంహరణ చేసుకోవచ్చు. ఖాతా తెరిచిన నాటి నుంచి పదిహేను పూర్తి ఆర్థిక సంవత్సరాలు పూర్తయిన తర్వాత మెచ్యూర్ అవుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ కింద డిపాజిట్ కు మినహాయింపు లభిస్తుంది. సెక్షన్ -10 కింద ఖాతాలో సంపాదించిన వడ్డీ కి కూడా వర్తిస్తుంది. పీపీఎఫ్ పథకంలో డిపాజిట్లకు 7.1 శాతం వడ్డీ రేట్లు ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..